నేడు ( జనవరి 9, శనివారం) భారత దేశంలో తొలి ముస్లీం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి.
జ్యోతిరావు పూలే, సావిత్రి బాయ్ పూలే నిర్వహించిన పాఠ శాలలో ఫాతిమా షేక్ దళితులకు, ముస్లీం బాలికలకు పాఠాలు చెప్పారు.
జ్యోతిరావు పూలే, సావిత్రి బాయ్ పూలే లు తమకు వారసత్వం గా వచ్చిన ఇంట్లో పాఠశాల నిర్వహించడానికి అనుమతించని జ్యోతిరావు తండ్రి వారిని అక్కడినుంచి తరిమి వేశారు.
ఆ సమయంలో ఫాతిమా షేక్, ఆమె సోదరుడు మియా ఉస్మాన్ షేక్ వారిని తమ ఇంటికి ఆహ్వానించి, తమ ఇంట్లోనే ఆ పాఠ శాలను పెట్టుకోవటానికి సదుపాయం కల్పించారు. ఇదే దేశంలో మొట్టమొదటి బాలికా పాఠశాల. జ్యోతిబా, సావిత్రిబాయి, ఫాతిమా ముగ్గురు కలిసే దళితలకు విద్యను బోధించారు. ఫూలే దంపతులతో కలసి పనిచేసిన విషయాలకంటే ఫాతిమా గురించి ఎక్కువ తెలియడం లేదు. ఫూలే ప్రారంభించిన అయిదు పాఠశాలలో ఫాతిమా పని చేశారుు.
అలాంటి గొప్ప వైతాళికు రాలైన ఫాతిమా షేక్ జయంతి కి నివాళులు అర్పిద్దాం.