ఆంధ్ర పంచాయతీ ఎన్నికలకు కేంద్రబలగాలు వస్తాయా?

ఆంధ్రలో ఏమవుతున్నది? తాను రాజ్యంగం ప్రకారం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని, ఎన్నికల జరపడం తనవిధి అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిషికేషన్ జారీ చేశారు.

ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు.

అయితే, తాము ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వ అభిమతాన్ని ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కమిషన్ తెలియచేశారు. ప్రభుత్వం ఇలా ఉన్నపుడు కమిషన్ నోటిఫికేషన్ ని రెవిన్యూ అధికారులు, పోలీసులు,  ప్రభుత్వ సిబ్బంది గౌరవించి ఎన్నికల విధుల్లోకి రాగలరా? అనుమానమే.

అపుడే ఉద్యోగ సంఘాలు కమిషన్ మీద ఆగ్రహం వ్యవక్తం చేశాయి.
ఎన్నికల సంఘం ఏక పక్షంగా వెల్తామంటే తాము సహకరించమని కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

ఈ సహాయ నిరాకరణలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపకుండా వెనకంజ వేస్తారా లేక కేంద్రం సాయం కోరతారా అనేది ఇపుడు తలెత్తిన ప్రశ్న.

జగన్ వెర్సస్ నిమ్మగడ్డ

కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ కొనసాగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.  ఏదో విధంగా నిమ్మగడ్డను వదిలించుకునేందుకు  అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు.

 

అయితే ప్రధాన కార్యదర్శిని, డిజిపి నియమించుకున్నట్లుగా ఎన్నికల కమిషనర్ ను నియమించుకునేందుకు జగన్ అవకావం లేదు. ఈ పోస్టు రాష్ట్ర ప్రభుత్వనియమావళిలో కాకుండా, నేరుగా రాజ్యంగ నియమాల పరిధిలో ఉంటుంది. అందువల్ల ఎన్నికల కమిషనర్ ను తప్పించి, మరొక అనుకూలమయిన అధికారిన ఈ పోస్టులోకి వేసుకోవడం జగన్ కు సాధ్యం కాలేదు. ఒక ప్రయత్నం చేసి  విఫలమయ్యారు.ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్ల కు కుదించి, రమేష్ కుమార్ ను పీకేసి, తమిళనాడుకు చెందిన ఎవరో రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించుకున్నారు. దీనిని కోర్టు కొట్లి వేసింది. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదించడానికి వీల్లేదని చెప్పింది. అంటే 2021 ఏప్రిల్ రిటైరయ్యేదాకా ఇష్టమున్నాలేకపోయినా, రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్ చీఫ్. ఆయన చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి. దీనిని ఆపడానికి వీల్లేదు.

కమిషన్ చెప్పినట్లు ఫిబ్రవరి 5, 7, 9, 17న దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తామని ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.   చివరి దశ పోలింగ్ రోజునే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

సాధ్యం కాదన్న జగన్ ప్రభుత్వం

అయితే, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్  స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషన్ కు లేఖ రాశారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం తమ నిర్ణయానికి కట్టుబడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోనంటున్నది. ఇక తేల్చాల్సింది కోర్టే.

“నాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, నేనూ నా ప్రభుత్వానిదే పైచేయి గా ఉండాలి  కాబట్టి, మేం ఎన్నికలను రమేష్ కుమార్ ఉన్నంతవరకు నిర్వహించం,” అనేది ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇలా కోర్టు కేసులతో, వివాదాలతో మార్చినెలాఖరుదాకా లాగితే, రమేష్ కుమార్ రిటైర్ అవుతారు. అపుడు ఇష్టమయిన అధికారిని నియమించుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని జగన్ భావిస్తున్నారు.

నిజానికి ఇది ఆంధ్రలో వికృత రూపం తీసుకున్న కుల రాజకీయ రాపోరాటమే. జగన్ ,చంద్రబాబు ల మధ్య సాగుతున్న కమ్మ- రెడ్డి అధిపత్యం పోరు మాత్రమే. ఈ తగాదా ప్రభుత్వంలోని అన్ని డిపార్టు మెంటుల్లోకి పాకింది. చంద్రబాబు నాయుడు నిమించిన అధికారులందరిని జగన్ ఏరి పారేస్తున్నాడు. కొందరికి రెండేళ్లవుతున్నా పోస్టింగులు ఇవ్వలేదు. వాళ్లంతా జీతాల్లేక జగన్ ప్రతీకార జ్వాలలకు మసిఅయిపోతున్నారు. ఇందులో చిన్న చిన్న పోలీసు అధికారలూ ఉన్నారు. వీళ్లందరిని తీసి పక్కనపడేసినా,  కీలకమయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం సాధ్యం కాలేదు. అందుకే ఈగొడవంతా. నేను ప్రజలతీర్పుతో వచ్చిన ముఖ్యమంత్రిని జగన్ చెబుతున్నారు, రాజ్యంగ ఏర్పాటుచేసి  ఎన్నికల కమిషన్ నాది అది నిమ్మగడ్డ అంటున్నారు. ఎవరు గొప్పో చెప్పడం సాధ్యం కాదు.

అయితే, భారత దేశంలో ఎన్నికయిన ప్రభుత్వాలు ‘ప్రజాతీర్పు’ అనే  సాకుతో  విచ్చల విడిగా పని చేయకుండా అదుపుచేసేందుకు రాజ్యాంగంలో చాలా  ఏర్పాట్లున్నాయి.ఇందులో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్లు, మానవ హక్కలు కమిషన్లు వగైరా వస్తాయి. వీటిని ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.ఎన్నికయిన ప్రభుత్వాలైనా వీటికి లోబడే పనిచేయాలి.

ఇదొక గొప్ప ఏర్పాటు. వీటిని నియమించేది ప్రభుత్వాలే అయినా, వాటి స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించాలి.

అందుకే అసెంబ్లీలో ఎన్నిక ల్లో గెల్చిన ప్రజాప్రతినిధులంతా చేసిన చట్టం చెల్లదని  ఇద్దరు న్యాయమూర్తులు కొట్టిపడేయవచ్చు. ముఖ్యమంత్రి మీద అరోపణలు వస్తే, ఎన్నికల్లో గెల్చినా జైలుకూ పంపించవచ్చు. శాసన సభల పదవీ కాలం పూర్తయ్యాక, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఖాతరు చేయకుండా   ఎన్నికలు నిర్బీతితో నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. అందుకే కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ గా టిఎన్ శేషన్ ఉన్నపుడు కమిషన్ పవర్ ఏమిటో చూపి ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను, ఎన్నికల్లో గెలిచామన్న అహంకారంతో విర్రవీగినా వారందరికి నిద్రపట్టకుండా చేశారు.

ఈ అధికారం ఉపయోగించుకుని నేను ఎన్నికలు నిర్వహిస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. ఆ మేరకు ఆయన కరెక్టు. మరిదీనిన రాష్ట్ర ప్రభుత్వ తప్పించుకోగలదా? కోర్టులో సవాల్ చేయాలి. సాధారణంగా ఎన్నికల కమిషన్ ప్రారంభించిన  ఎన్నికల ప్రాసెస్ ను కోర్టులు ఆపేందుకు ఇష్టపడవు. రేపు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు  ఎన్నికలు జరపలేమన్న జగన్ ప్రభుత్వం వాదనను కొట్టివేస్తే ఎలా?

కేంద్రబలగాలు వస్తాయా?

కోర్టులో జగన్ ప్రభుత్వ పిటిషన్ వోడిపోతే, ఏమవుతుంది. కమిషన్ ఎన్నికల నిర్వహణ కోసం పోలీసుల, ప్రభుత్వ యంత్రంగాన్ని తన పరిధిలోకి తీసుకుని ఎన్నికల కోడ్ అమలు చేస్తుంది. జిల్లా కలెక్టర్లు, ఇతర రెవిన్యూ అధికారులు, జగన్  ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ లో బిజీ అని ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించగలరా?  ప్రభుత్వం మాట కాదని, పోలీసు, ప్రభుత్వ సిబ్బంది కమిషన్ కు సహకరించగలరా? అపుడే ఉద్యోగ సంఘాలు కమిషన్ మీద ఆగ్రహం వ్యవక్తం చేశాయి.
ఎన్నికల సంఘం ఏక పక్షంగా వెల్తామంటే
తాము సహకరించమని కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
అపుడు ఎన్నికల కమిషన్ చీఫ్ గా రమేష్ కుమార్ కేంద్రబలగాలను కోరతారా? కేంద్ర బలగాలను కోరినపుడు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం  ఏర్పడుతుందా? సిపిపి కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్ నారాయణ నిన్న రాత్రి పొద్దు పోయాక ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందనే హచ్చరిక కూడా చేశారు.

ఏమవుతుందో చూడాలి. మొత్తానికి రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్యదేశంలో ఎపుడూ, ఎక్కడా జరగని విధంగా యుద్ధం  మొదలయింది. ఒకరు ప్రజల తీర్పు అంటూ మాట్లాడితే, మరొకరు రాజ్యాంగం చూపి మాటాల యుద్దం, లేఖా యుద్దానికి సిద్దమయ్యారు. చూద్దాం, ఏమవుతుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *