అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల చేయడాన్ని ఎపి ఉద్యోగుల జెఎసి తీవ్రంగా విమర్శించింది. ఎన్నికల విధుల్లోకిరాలేమని చాలా స్పష్టం చెబుతూ ఎన్నికలను బహిష్కరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇపుడు ఏచర్య తీసుకుంటుందో చూడాలి. రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏకాకి చేసేందుకు జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఫిబ్రవరి పంచాయతీ ఎన్నికల ను నిర్వమించేందుకు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిన్న ప్రోగ్రామ్ విడుదల చేసిన సంగతి తెలిసింది.
ఇలా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రకటన మీద ఉద్యోగుల సంఘం విరచుకుపడటం ఇదే మొదటి సారి కావచ్చు. ఉద్యోగుల నాయకుడు బొప్పరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నేతవ్యాఖ్యలకంటే పదునుగా ఉన్నాయి.
రమేష్ కుమార్ ఉద్యోగుల సంఘం ఇంత తీవ్రంగా స్పందించడాన్ని వూహించలేం
. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జెఎసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏమన్నారో చూడండి:
పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది.
కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ నిమ్మగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై ఉద్యోగులు ఆందోళన చెెందుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేము, ఎస్‌ఈసీకి ఉద్యోగుల ప్రాణాలు ఎస్‌ఈసీకి పట్టవా?
వ్యాక్సినేషన్ పంపిణీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదు
నిమ్మగడ్డ పునరాలోచించి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘కరోనా బారిన పడి 109 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహిస్తే మంచిది’’ అని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరు అని సుధీర్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నేత స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నోటిషికేషన్ విడుదల చేయడం ఏమిటి? ఎన్నికల కమీషనర్ ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.