తొందరపడి వ్యాక్సిన్లకు అనుమతి నిచ్చారా, అనుమానాలు మొదలు

భారత ప్రభుత్వం  కోవిషీల్డ్ (ఆక్స్ ఫోర్డ్ ), కోవాగ్జిన్ (భారత్ బయోటెక్ ) లకు అనుమతి ఇచ్చినట్లు వార్తలు రావడంతో వివాదం రాజుకుంది.

ఎలాంటి అనుమతి ఇచ్చారు అనే వివరణ లేకుండా మీడియో రెండు వ్యాక్సిన్ లకు  ప్రభుత్వం  అనుమతి ఇచ్చినట్లు, ఇక తొందర్లోనే ఈ వ్యాక్సిన్ లప్రజలకు ఎక్కి స్తారని  వార్తలొచ్చాయి.

చాలా మంది చప్పట్లు కొట్టారు. శభాష్ అన్నారు.

అయితే, కొంద మంది నిపుణులు అనుమతినిచ్చిన విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయని,అలాంటపుడు ఈ వ్యాక్సిన్లు గొప్పగా పనిచేస్తాయని వూహించి అనుమతినీయడమేమిటని చాలా మంది శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా  (డిసిజిఐ)అనుమతి నిచ్చేందుకు వాడిన భాష ఎమిటో అర్థం కావడం లేదని వాళ్లు చెబుతున్నారు.

ఈ వ్యాక్సిన్ లకు అనుమతినిస్తూ   డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ వి జిసోమాని  వాడిన భాష ఏమిటో అర్థం కావడం లేదని, ఇట్లాంటిఅనుమతులను తామె గతంలో చూడనే లేదని వారు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితులలో కొన్ని పరిమితులకు లోబడి (restricted use in emergency situation) వాడేందుకు అనుమతిస్తున్నట్లు  పేర్కొనం ఏమిటి? అనేది వారి ప్రశ్న.

. “ After adequate examination, the Central Drug Standards Control Organization decided to accept the recommendations of the expert committee and accordingly vaccines of Serum Institue of India and Bharat Biotech are being approved for restricted use in emergency situations and permission is being granted,”అని సోమాని మీడియాకు చెప్పారు.

ఇపుడు ఈ రెండు సంస్థలు ఇంకా క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిని కొనసాగించవచ్చని సోమానీ చెప్పారు.  అదే సమయంలో ఆయన ఈ రెండు వ్యాక్సిన్లు  110 శాతం సురక్షితం అన్నారు. పరీక్షలు కొనసాగుతున్నపుడు రెండు  సురక్షితమయిన ఎలా సర్టిఫికేట్ ఇస్తారు?

క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నపుడు, అత్యవర పరిస్థితులలో వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చా? అదే విధంగా ఇంకా పరీక్షలు పూర్తి కాకముందే 110 శాతం సురక్షితం అని ప్రకటించవచ్చా అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి.

విమర్శలు రాగానే ఈ వ్యాక్సిన్ లకు ఇచ్చిన అనుమతులను సమర్థించుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ నానా తిప్పలు పడుతున్నారు.

ఇంగ్లండులో కరోనా వైరస్ కొత్త రూపాలు కనిపించినందున దాని ముందస్తు నివారణకు  భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాగ్జిన్ కు  ఎమర్జన్నీ ఆథోరైజేషన్ యూజ్ లెసెన్స్ ఇవ్వడం జరిగిందని, నిర్వీర్యం చేసిన కరోనా వైరస్ (SAS-CoV-2 virus) నుంచి తయారయింది కాబట్టి ఇంగ్లండులో కనిపించిన కొత్తవైరస్ నుంచి కోవ్యాగ్జిన్ రక్షణ ఇస్తుందని ఐసిఎంఆర్  డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెబుతున్నారు.

పరీక్షల్లో తేలే ఫలితాలను బట్టి కాకుండా, ఈ వ్యాక్సిన్ లు తప్పక పనిచేస్తాయనే ఆశాభావంతో అనుమతులిచ్చారని, ఇది నియమాలకు విరుధ్దమమని  పుణే లోని నేషనల్ ఇన్ స్టిట్యట్యూట్ ఆప్ ఇమ్యునాలజీ మాజీ శాస్త్రవేత్త సత్యజిత్ రథ్ వంటి వాళ్లు సోమానీ, బలరామ్ భార్గవ వంటి వాళ్ల వాదనలను తోసిపుచ్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *