టిడిపి ‘హిందూ స్లోగన్ ’తో ఉలిక్కి పడిన బిజెపి

 

తెలుగుదేశం పార్టీ హిందూ స్లోగన్ తీసుకుంది. ఆంధ్రలో గుళ్ల మీద దాడి ‘హిందూ మతం మీద దాడి’ అని నిన్న టిడిపి నేత అచ్చన్నాయుడు స్టేట్ మెంట్ ఇవ్వడంతో బిజెపి ఉలిక్కి పడింది.  ఎందుకంటే అది బిజెపి ఇవ్వాల్సిన నినాదం.
ఈ మధ్య ఆంధ్రలో దేవాలయాల మీద జరుగుతున్న దాడులను బిజెపి ఖండించంలో అంత పదును లేదు. ఏదో ఒకటి ఆర ప్రకటనలనిస్తున్నారు, ట్వీట్ల చేస్తున్నారు తప్ప,  దాన్నొక ఉద్యమ స్థాయిలోకి తీసుకుపోలేకపోతున్నారు.
దీనికి కారణం ఆ పార్టీ ఆంధ్ర శాఖకు జగన్ మీద పోరాటం చేసేందుకు పైనుంచి అనుమతి లేకపోవడమే.
దీనికి కారణం బిజెపి హైకమాండ్ కు ముఖ్యమంత్రి జగన్ తో ఢిల్లీలో  చాలా అవసరం ఉంది. ఎందుకంటే, ఈ పార్టీకి పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో మంచి బలం ఉంది. ఇది మోదీ ప్రభుత్వానికి అవసరం.అందువల్ల జగన్ హయాంలో  ఆలయాల మీద దాడులు జరుగుతున్నా  సమరభేరీ మోగించేందుకు ఎపి బిజెపికి అనుమతి లేదు. దీనితో ఏ మేరకు జగన్ మీద దాడి చేయాలో బిజెపికి అర్థం కావడం లేదు.
ఈ విషయం తెలుగుదేశం పార్టీ గ్రహించింది. జాప్యం లేకుండా హిందూ స్లోగన్ ని అందుకుంది. నిన్న అచ్చన్నాయుడు ఇచ్చిన  స్టేట్ మెంట్ ఉద్దేశం, ఈ హిందూ మత రాజకీయాలు బిజెపి నుంచి లాక్కునే ప్రయత్నమే. రాష్ట్రంలో  90 రోజుల్లో సుమారు 130 సార్లు హిందూదేవాలయాలమీద ఏదో ఒక దాడి జరిగిందని టిడిపి ఒక జాబితా కూడా విడుదల చేసింది.
నిన్న అచ్చన్నాయుడు స్టేట్ మెంట్, ఈ  రోజు చంద్రబాబు విజయనగరం జిల్లా రామతీర్థం యాత్ర… చూస్తే బిజెపి కంటే దేవాలయాల మీద దాడులను టిడిపి చాలా చాలా సీరియస్ గా తీసుకుంటున్నదనిపిస్తుంది. ఇదే బిజెపికి మింగుడు పడటం లేదని పిస్తుంది.
నిన్న అచ్చన్నాయుడి  స్టేట్ మెంట్ ను  బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి  అక్షేపించారు.
విష్ణు వర్ధన్ రెడ్డి ట్విట్టర్ ఎక్కి దేవాలయాలమీద దాడులను ఖండించే అర్హత దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు లేదని అన్నారు. దీనికి టిడిపి మాజీ మంత్రి కొత్త పల్లి జవహర్ బిజెపి వార్నింగ్ ఇచ్చారు.

 

అయిదే,దీనికి టిడిపి మాజీ మంత్రి కొత్త పల్లి జవహర్ అభ్యంతరం తెలిపారు. ఇలాంటి మాటలు మాట్లాడితే సహించమని, ఖబడ్దార్ అని హెచ్చరిక చేశారు.
చంద్రబాబు కూలుస్తున్నపుడు విష్ణువర్థన్ రెడ్డి ఏ కలుగులో ఉన్నారని జవహర్ ప్రశ్నించారు.
సమస్యను పక్కదారి పట్టించేందుకు విష్ణువర్థన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశం పంపారు. టీడీపీ బాధ్యతగా వ్యవహరిస్తుందని, హైందవ ముసుగులో జగన్ రెడ్డి భజన విష్ణువర్థన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.
ఖబడ్దార్..నీ మాటలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మట్లాడితే ప్రజలు శిక్ష వేస్తారని, ఏ ప్రయోజనం ద్వారా చంద్రబాబును విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. హైందర రక్షకుడిగా జగన్..ఆలయాలు కూల్చేవాడిలా చంద్రబాబు మీకు కనబడుతున్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను కాపాడింది టీడీపీనే అన్ని మతాలను గౌరవించేది ఒక్క టీడీపీనే అన్న మాట గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *