తెలుగుదేశం పార్టీ హిందూ స్లోగన్ తీసుకుంది. ఆంధ్రలో గుళ్ల మీద దాడి ‘హిందూ మతం మీద దాడి’ అని నిన్న టిడిపి నేత అచ్చన్నాయుడు స్టేట్ మెంట్ ఇవ్వడంతో బిజెపి ఉలిక్కి పడింది. ఎందుకంటే అది బిజెపి ఇవ్వాల్సిన నినాదం.
ఈ మధ్య ఆంధ్రలో దేవాలయాల మీద జరుగుతున్న దాడులను బిజెపి ఖండించంలో అంత పదును లేదు. ఏదో ఒకటి ఆర ప్రకటనలనిస్తున్నారు, ట్వీట్ల చేస్తున్నారు తప్ప, దాన్నొక ఉద్యమ స్థాయిలోకి తీసుకుపోలేకపోతున్నారు.
దీనికి కారణం ఆ పార్టీ ఆంధ్ర శాఖకు జగన్ మీద పోరాటం చేసేందుకు పైనుంచి అనుమతి లేకపోవడమే.
దీనికి కారణం బిజెపి హైకమాండ్ కు ముఖ్యమంత్రి జగన్ తో ఢిల్లీలో చాలా అవసరం ఉంది. ఎందుకంటే, ఈ పార్టీకి పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో మంచి బలం ఉంది. ఇది మోదీ ప్రభుత్వానికి అవసరం.అందువల్ల జగన్ హయాంలో ఆలయాల మీద దాడులు జరుగుతున్నా సమరభేరీ మోగించేందుకు ఎపి బిజెపికి అనుమతి లేదు. దీనితో ఏ మేరకు జగన్ మీద దాడి చేయాలో బిజెపికి అర్థం కావడం లేదు.
ఈ విషయం తెలుగుదేశం పార్టీ గ్రహించింది. జాప్యం లేకుండా హిందూ స్లోగన్ ని అందుకుంది. నిన్న అచ్చన్నాయుడు ఇచ్చిన స్టేట్ మెంట్ ఉద్దేశం, ఈ హిందూ మత రాజకీయాలు బిజెపి నుంచి లాక్కునే ప్రయత్నమే. రాష్ట్రంలో 90 రోజుల్లో సుమారు 130 సార్లు హిందూదేవాలయాలమీద ఏదో ఒక దాడి జరిగిందని టిడిపి ఒక జాబితా కూడా విడుదల చేసింది.
నిన్న అచ్చన్నాయుడు స్టేట్ మెంట్, ఈ రోజు చంద్రబాబు విజయనగరం జిల్లా రామతీర్థం యాత్ర… చూస్తే బిజెపి కంటే దేవాలయాల మీద దాడులను టిడిపి చాలా చాలా సీరియస్ గా తీసుకుంటున్నదనిపిస్తుంది. ఇదే బిజెపికి మింగుడు పడటం లేదని పిస్తుంది.
నిన్న అచ్చన్నాయుడి స్టేట్ మెంట్ ను బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి అక్షేపించారు.
విష్ణు వర్ధన్ రెడ్డి ట్విట్టర్ ఎక్కి దేవాలయాలమీద దాడులను ఖండించే అర్హత దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు లేదని అన్నారు. దీనికి టిడిపి మాజీ మంత్రి కొత్త పల్లి జవహర్ బిజెపి వార్నింగ్ ఇచ్చారు.
ఆలయాలు కూల్చడంలో మీకు మీరే సాటి
బాబు VS జగన్5 జులై 2016 రోజు గుర్తు ఉందా @ncbn గారు? నాడు మీరు కూల్చింది.
బాబుగారు సియం గా40 ఆలయాలు.
జగన్ గారు సియం గా20 ఆలయాలు.
నేడు రామతీర్థ రామాలయానికి వెళ్ళేఅర్హత మీకు ఉందా బాబు గారు?రాజకీయాలకోసం రామాలయానికి వెళ్ళి ఆ ఆలయాన్ని అపవిత్రంచేయద్దు pic.twitter.com/wkk9OOfhhC— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 2, 2021