అవినీతి పాలిట బెబ్బులి, రూపా IPS మళ్లీ బదిలీ

ట్రాన్స్ ఫర్లకు భయపడను: రూపా ఐపిఎస్

ధైర్యానికి, నిజాయితీకి, రూల్ ఆప్ లా కు వెరవని ఐపిఎస్ ఆఫీసర్ కర్నాటకు చెందిన రూపా. ఆమెను మరొకసారి బదిలీ చేశారు. ఆమె సర్వీస్ లో సంవత్సరాలకంటే ట్రాన్సఫర్లే ఎక్కువగా ఉంటాయి. అవినీతి ఎక్కడున్నా, ఎవరికీ జంకకుండా  ఆమె బయటపెడతారు. ట్విట్టర్ ఆమె వేదిక. ఆమె ఈ రోజు కర్నాటక హోమ్ సెక్రెటరీ గా ఉన్నారు.  కర్నాటక కు మొదటి హోం సెక్రెటరీ ఆమెయే.
ఆమె ను   కర్నాటక స్టేట్ హస్తకళల అభివృద్ధి సంస్థకు  మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.  ఆమె ఈ రోజు ఈ బాధ్యతలు స్వీకరించారు.
ఆమెకు హెమంత్  నింబాల్కర్ అనే మరొక ఐపిఎస్ అధికారితో పేచీ వచ్చింది.  నిర్భయ స్కీమ్ కింద బెంగుళూరు ను సురక్షితమయిన నగరంగా తీర్చిదిద్దేందుకు ఒక పథకం అమలుచేస్తున్నారు.
దీనికి రు. 619 కోట్లు ఖర్చవుతాయి. ఈ పనులకు సంబంధించి టెండరింగ్ ప్రాసెస్ లో అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి బాధ్యత నింబాల్కర్ దని ఆమె చెబుతున్నారు. హోం సెక్రెటరీ గా ఆమె అక్రమాలను ప్రశ్నించారు.
అయితే, నింబాల్కర్ దీనిని వ్యతిరేకించారు.ఆమెకు తాను చేసిన పనులు ప్రశ్నించే జ్యూరిష్ డిక్షన్ లేదని, అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇది పెద్ద వివాదమయింది.
దీనితో ఆమె హోం సెక్రెటరీ పదవి నుంచి తప్పించి హస్తకళల అభివృద్ధి సంస్థకు మార్చారు. అదే విధంగా నింబాల్కర్ ను కూడా   ప్రాజక్టు నుంచి( బెంగుళూరు  అడిషనల్ కమిషనర్ (అడ్మినిస్ట్రేషన్ ) నుంచి తప్పించి ఇంటర్నల్ సెక్యూరిటీ కి మార్చారు.
ఈ బదిలీలమీద  గురువారం నాడు రూప ట్వీట్ చేస్తూ అధికారులను ట్రాన్స్ పర్ చేయడమనేది ప్రభుత్వంలో ఎపుడూ ఉంటుంది. దానిని తాను ప్రశ్నించలేనని, ఎక్కడి బదిలీ చేసిన వెళ్తానని, అయితే అక్కడ కూడా అవినీతినిబయటపెట్టే విజిల్ బ్లోయర్ పని మాననని చెప్పారు.ఈ పదవి, ఆ పదవి అనేది లేదు, అదేమంత విషయం కాదు. అని ట్వీట్ లో పేర్కొన్నారు.

 

(Like this story? Share it with friends!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *