‘నారాయణ కాలేజీల్లో భద్రతా ప్రమాణాలు నిల్’

భద్రతా ప్రమాణాలు పాటించని నారాయణ కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కర్నూలు విద్యార్థి సంఘాల జెఎసి డిమాండ్ చేసింది.
జెఎసి నేతలు కోనేటి వెంకటేశ్వర్లు, ఎం మోహన్, ఎంవిఎన్ రాజు యాదవ్, బండారి సురేష్ బాబు, బి భాస్కర్ నాయుడు ఈ మేరకు కర్నూలు నగరంలోని ఆర్ఐఓ కార్యాలయం నందు ఆర్ఐఓ సాల బాయ్ గారికి వినతిపత్రం అందజేశారు.
జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు పట్టణ సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో  ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీ సురేంద్ర కాలేజీ భవనం నుండి కింద పడటం వల్ల విద్యార్థికి తీవ్ర గాయాలు, రక్త శ్రావణం కావడం జరిగిందని, గురువారం తెల్ల వారిజామున 2:00 గం”ల ప్రాంతంలో సంఘటన జరిగితే కళాశాల యాజమాన్యం తల్లి దండ్రులకు ఉదయం7:00 గం”లకు   మాత్రమే  సమాచారం అందించారని తెలిపారు.

విద్యార్థి మెరుగైన వైద్యం అందించాలని, మేడికవర్ హాస్పిటల్స్ కర్నూలు వారు ఇంత వరకు విద్యార్థి వైద్యానికి సంబంధించిన ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
విద్యార్థి సురేంద్ర
తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎంహెచ్ఓ గారు స్పందించి విద్యార్థికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు లేకుండా నీట్, జేఈఈ పేరుతో ఇంటర్ విద్యార్థుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి  నారాయణ కార్పొరేట్ జూనియర్ కళాశాలాలు పాల్పడుతున్నాయని విద్యార్థి సంఘాల జెఎసి నేతలు ఆర్ఐఓ గారికి తెలిపారు. నారాయణ విద్యా సంస్థలు రాష్ట్రంలోనే ఫస్ట్, నారాయణ తర్వాతే మరెవరైనా తదితర టైటిల్స్ తో ఇతర జిల్లాల విద్యార్థుల ర్యాంకులను కర్నూలు జిల్లాలో తప్పుడు యాడ్స్ ద్వారా ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోయి చేరిన విద్యార్థులు అక్కడ సరైన వసతులు లేక విద్యార్థుల సంఖ్యకు తగ్గ టీచింగ్ ఫ్యాకల్టీ లేక సరైన విద్య అందడం  లేదన్నారు.
జిల్లా వ్యాప్తంగా నారాయణ కళాశాలలో సరైన భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని, కమర్షియల్ కాంప్లెక్స్ లో కాలేజీలు నిర్వహిస్తున్నారని, ఐదు అంతస్తుల భవనాలలో కేవలం ఒక్క చోట మాత్రమే స్టెప్స్ ఏర్పాటు చేసి, గోడలకు గ్రిల్స్ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఏదైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే విద్యార్థులు ఆ బిల్డింగ్ లో చిక్కుకొని బయటకు వచ్చే పరిస్థితి లేదని ఆర్ఐఓ గారి దృష్టికి తీసుకెళ్ళారు.
నారాయణ విద్యా సంస్థల తప్పుడు ప్రచారాలు నమ్మి కర్నూలు జిల్లాలో అనేక మంది విద్యార్థులు చేరి చివరకు సరైన మార్కులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనికర్నూలు నగరంలో గత నెల బైపిసి ఫస్టియర్ పూర్తి చేసుకున్న విద్యార్థిని తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నారాయణ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *