మస్తు తాగండి, డ్యాన్సేయండి…. ఎంకరేజ్ చేస్తున్న ఎక్సైజ్ శాఖ

తెలంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకకు ఆరోగ్యం కావాలి, పోలీసు శాఖకు లా అండ్ ఆర్డర్ కావాలి. అయితే, ఆబ్కారీ శాఖకి మాత్రం డబ్బు కావాలి. అందుకే  కరోనాను, కోర్టు ఉత్తర్వులను, కేంద్రం సూచలను,ఆరోగ్య శాఖ విజ్ఞప్తులను, పోలీసు విన్నపాలను ఖాతరు చేయనవసరం లేదు… ‘బార్లు తెరుస్తాం బాగా తాగండి, చిందులేయండి. మద్యం దుకాణాలు తెరుస్తున్నాం,  బాగా కొనండి’ అని ఎక్సైజ్ శాఖ  చెబుతూఉంది.
తెలంగాణ వ్యాప్తంగా  వ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరచిఉంచేందుకు , తెల్లవారుజామున 1 గంట వరకూ బార్లలో ఫుల్ తాగడానికి  అనుమతినిస్తూ   ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం లో ఆంతర్యం ఏమిటి?
పోలీసు కమిషనర్లు ప్రజలందరికి కఠిన హెచ్చరిక చేసిన గంటల్లోనే ఎక్సైజ్ జీవొ రావడం ఆశ్చర్యం.
ఇదీ కొత్త సంవ్సరానికి స్వాగతం పలకడంలో తెలంగాణలో ఎదురవుతున్న కన్ప్యూజన్.
కేంద్రం నుంచి హైకోర్టు దాకా అంతా కొత్త వేడుకలు వద్దంటే… అబ్కారీ శాఖ మాత్రం అర్ధరాత్రి12 గంటల వరకూ, ప్రజలకోసంబార్ల తలుపులు, దుకాణాలు షెటర్టు తెరిచి ఉంటాయని స్వాగతం చెబుతున్నది.
పాలీసులేమో  అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తామంటున్నారు.  తెలంగాణలో కరోనా మృతులకు నివాళిగా  న్యూఇయర్ వేడుకలు వద్దని  ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. వేడుకల్లో పాల్గొన్న తర్వాతే చాలా మంది కరోనా పాజిటివ్‌ అయిన  సందర్బాలను ఉదహరిస్తూ  ప్రజలంతా  న్యూఇయర్  వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన కోరుతున్నారు.
తెలంగాణ  నూతన సంవత్సర వేడుకలకు అనుమతుల్లేవని డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు రాజధాని లోని పోలీసుకమిషనర్లంతా ప్రకటించారు. హైదరాబాద్‌లో డిసెంబరు 31న రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేస్తున్నారు. బేగంపేట ఫ్లై ఓవర్‌ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు రాత్రి 11నుంచి మూసివేస్తారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఓఆర్‌ఆర్‌లు కూడా మూసి ఉంటాయి. విమాన టికెట్లు ఉన్న వారి వాహనాలు మాత్రమే ఓఆర్‌ఆర్‌పై అనుమతిస్తారు.  తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహనాలు జప్తు చేస్తారు. చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. తాగి పట్టుబడిన వాహనదారులకు మొదటిసారి శిక్షగా రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే రూ.15వేలు జరిమానా, 2ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
రాజధాని హైదరాబాద్‌లో ని మూడు కమిషనరేట్ల పరిధిలో అడుగడుగునా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. ఒక కమిషనర్ మరింత ముందుకు పోయి తాగిడ్రైవ్ చేసే వాళ్ల రోడ్ టెర్రరిస్టులన్నారు. పోలీసులిలా వల విసిరి పట్టుకునేందుకు సిద్ధంగా ఉంటే మీరంతా ఫుల్ తాగండి మేం మందుసప్లై చేస్తామని ఎక్సైజ్ శాక అనడం ఏమిటి?
మద్యం దుకాణాలను డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేయడం ఆయన సొంత నిర్ణయం అయి ఉండని, దీని వెనక రాజకీయ వత్తిడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఎందుకంటే, 31 వ అర్థరాత్రి నుంచి తెల్లవారే మద్యవ్యాపారం జోరుగా ఉంటుంది. అడమగా తెగా తాగి తూలుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే మత్తయిన సమయం అదే. అందువల్ల జోరుగా వ్యాపారం చేసుకోవాలనుకునేవా ళ్లంతా  ప్రభుత్వం పెద్దల మీద వత్తిడి తీసుకువచ్చి  ఇలా షాపులు,బార్లు తెరిచేలా వత్తిడి తెచ్చారని చాలామంది అనుమానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *