హైదరాబాద్ అపోలో నుంచి రజినీకాంత్ విడుదల

అధిక రక్తపోటు ఆటుపోటు, ఆయాసంతో హైదరాబాద్  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ను విడుదల చేశారు. ఆయన శుక్రవారం నాడుఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ లో గది రెండు వారాలుగా ఆయన అన్నాథే సినిమా షూటింగ్ ఉన్నారు. తొందరగా సినిమా షూటింగ్ ముగించాలని ఆయన ఎక్కువసేపు పని చేశారు. దీనితో ఆయనమీద వత్తిడి పెరిగి రక్తపోటు అటుపోట్లకు గురయింది.
ఈ రోజు పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆసుపత్రిని డిశ్చార్జ్ చేశారు. అయితే, వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని డాక్టర్లు సూచించారు. అందువల్ల ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన ఏలా చేస్తారో చూడాలి. గుంపులకు దూరంగా ఉండాలని చెప్పినందున, ఆయన జూమ్ యాప్ ద్వారా లేదా మరొక ఆన్ లైన్ పద్ధతిలో లైవ్ గా ప్రకటన చేయాలి. భారీ కోలాహలంలో పార్టీ ప్రకటించాలనుకుంటున్న రజినీ అభిమానులను ఇది నిరుత్సాహపరుస్తుందేమో.
“Mr Rajinikanth was admitted to the hospital on 25 December 2020 with severe hypertension and exhaustion. He was kept under close medical examination and treated by a team of doctors. His blood pressure has been stabilized and he is feeling much better. In view of his improved medical, he has been discharged from the hospital today,”అని ఆసుపత్రి బులెటీన్ విడుదల చేసింది.
అలాగే కోవిడ్ అంటుకోకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని కూడా డాక్టర్లు హెచ్చరించారు.
దీనితో ఆయన షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నాథే బృందంలో ఇద్దరికి గతంలో కోవిడ కనిపించింది.అపుడు రజినీ కాంత్ కు కూడా పరీక్షజరిపారు. అయితే, ఆయన కోవిడ్ నెగటివ్ అని తేలింది. అయితే, బిపి పెరగడం, ఆయాసం రావడంతో ఆసుపత్రికి తరలించారు.
రజినీ కాంత్ కు ఇప్పటికే రీనల్ ట్రాన్స్ ప్లాంట్ జరిగింది. దీనితో ఆయన రోగ నిరోధక శక్తి తగ్గింది.  కాబట్టి కోవిడ్ సోకకుండా ఉండేందుకు గుంపుల్లోకి వెళ్లరాదని డాక్లర్లు సూచించారు.  అయితే, ఈ నెల 31న ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *