వైసిపి (YCP) కి తెలుగు దేశం పార్టీ (TDP) కి సోషల్ మీడియాలో ప్రపంచయుద్దమంత వార్ నడుస్తోంది.రోజు రోజుకు తీవ్రమవుతూ ఉంది. రోజూ వందలట్వీట్లు విసురుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు.దుమెత్తి పోసుకుంటున్నారు.
నేతలొక వైపు, వాళ్ల అనుచరులు మరొకవైపు ట్విట్టర్ లో బీభత్సంగా పోరాడుతున్నారు.
వైఎస్ ఆర్ సి నేత, రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి విరామం లేకుండా చంద్రబాబు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ట్వీట్లతో దాడి చేస్తున్నారు. ఆయన బాబు ను వదలని రోజులేదు.దీనికి ఘాటుగానే టిడిపి నేతలు సమాధానమిస్తున్నారు.
ఈ రోజు మాజీ మంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు వైసిపి మీద విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు అమరావతి అవినీతిని పట్టుకుని చురకలేస్తే, నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ మృతి మీద వైసిపి నేతలు ఎన్ని సార్లు ఎన్నిరకాలుగా మాట్లాడారో, ఎలా రాజకీయాలకు దానిని వాడుకున్నారో గుర్తు చేశారు. వై సిపి కి టిిడిపికి మధ్య నడుస్తున్న వాగ్యుద్ధంలో కొన్ని ముఖ్యమయిన ట్వీట్స్.
పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని అర్ధాకలితో ఉద్యమించేవాళ్లు రైతులు. భూముల ధరలు కోట్లు పలకాలని 10AM-5PM ధర్నాలు చేసే వారు తమరి అనుచరులు. రియల్ ఎస్టేట్ మదుపుదారులు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 24, 2020
మెట్ల మీద కూర్చుంటున్నాడు , నేల మీద పడుకుంటున్నాడు, బాసిపీటలు వేస్తున్నాడు… ఏం చేసినా సానుభూతి రాకపోగా మెంటలెక్కిందని జనం అనుకుంటున్నారు. ఆ నాయుడి పేరేమి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 24, 2020
చంద్రబాబు ఇప్పటికీ చక్రం తిప్పుతున్నాడు. కాకపోతే ముందుకు కాదు వెనక్కి!
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 23, 2020
వీటికి టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఎదురుదాడి
(సొంత తండ్రి చనిపోతే 24 గంటల పాటు జగన్ రెడ్డి కలకత్తా హోటల్ లో ఏమి చేసాడో తెలియదు అనుకున్నావా?తండ్రి శవం పక్కన దొరక్కముందే సంతకాల సేకరణ ఎందుకు చేసాడో తెలియదు అనుకున్నావా? తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని, ప్రచారం చేసి, చివరకు అదే రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఇచ్చింది తెలియదు అనుకున్నావా ? ఇందులో నీ బ్రోకరేజ్ ఏంటో కూడా తెలుసు ‘ఏ2’ అలియాస్ ‘కేటు’. బాబాయ్ ఎలా పోయాడో తెలియదు. సొంత మామ ఎలా పోయాడో తెలియదు. చివరకు తండ్రి మరణం వెనుక కూడా మీ హస్తం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి అంటే, మీరు ఎంత రాక్షస జాతో అందరికీ తెలుసు. నువ్వు కూడా హత్యలు గురించి మాట్లాడే వాడివే. రంగా హత్యలో, మీ మహా మేత పాత్ర ఏమిటో విజయవాడ మొత్తం తెలుసు.ఎక్కువ లాగమాక, తెగుద్ది. ఎమ్మెల్యే వెలగపూడి పై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ము ఉంటే నిరూపించు సాయిరెడ్డి.)
సొంత తండ్రి చనిపోతే 24 గంటల పాటు @ysjagan కలకత్తా హోటల్ లో ఏమి చేసాడో తెలియదు అనుకున్నావా? తండ్రి శవం పక్కన దొరక్కముందే సంతకాల సేకరణ ఎందుకు చేసాడో తెలియదు అనుకున్నావా? తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని, ప్రచారం చేసి..,(1/3) pic.twitter.com/Rl5Kb0Yjao
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 25, 2020
చివరకు అదే రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఇచ్చింది తెలియదు అనుకున్నావా ? ఇందులో నీ బ్రోకరేజ్ ఏంటో కూడా తెలుసు ‘ఏ2’ అలియాస్ ‘కేటు’. బాబాయ్ ఎలా పోయాడో తెలియదు. సొంత మామ ఎలా పోయాడో తెలియదు. చివరకు తండ్రి మరణం వెనుక కూడా మీ హస్తం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి అంటే..,(2/3)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 25, 2020
మీరు ఎంత రాక్షస జాతో అందరికీ తెలుసు. నువ్వు కూడా హత్యలు గురించి మాట్లాడే వాడివే. రంగా హత్యలో, మీ మహా మేత పాత్ర ఏమిటో విజయవాడ మొత్తం తెలుసు.ఎక్కువ లాగమాక, తెగుద్ది. ఎమ్మెల్యే వెలగపూడి పై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ము ఉంటే నిరూపించు @VSReddy_MP .(3/3)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 25, 2020