ఎపి ప్రధాన న్యాయమూర్తి బదిలీ జగన్ లేఖ ప్రభావమేనా?

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు నిన్న అరడజన్ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగింది. బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించినట్లు తెలిసింది. వీరితో పాటు మరికొంత మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది.
ఐదుగురు సభ్యుల  సుప్రీంకోర్టు  కొలిజీయం  మంగళవారం ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇంత  పెద్ద ఎత్తున ప్రధాన న్యాయమూర్తులను అనేక మంది న్యాయమూర్తులను బదిలీలు జరగడం వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేవదీసిన విమర్శలే  కారణమని చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో పాటు మరి కొందరు న్యాయమూర్తులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీర్పులు చెబుతున్నారని, ప్రభుత్వ నిర్ణయాలనుకొట్టివేయడమే పనిగా పెట్టుకున్నారని  ముఖ్యమంత్రి జగన్ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఒక విధంగా రూలింగ్ వైసిపి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద   ఈ మేరకు ఒక క్యాంపెయిన ప్రారంభించిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో న్యాయమూర్తులమీద విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్  మీడియాలో పోస్టులు పెట్టిన వారి మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులను బుక్ చేయాలని కూడా ఆదేశించింది.
ఇదిక్యాంపెయిన్ తీవ్రస్థాయికి చేరకుని  తాను చేస్తున్న విమర్శలను  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి  కూడా జగన్ ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  న్యాయమూర్తులను సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్ వి రమణ ఉన్నారని జగన్ పేరెత్తి విమర్శించారు. ఇలా జగన్ బ హిరంగంగా విమర్శించడానికి  ఎన్ వి రమణ కూతుర్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాలపు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగమయ్యారనేది కారణం.
వారు పెద్ద ఎత్తున రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, రాజధాని అక్కడ వస్తుందని వారికి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ లీక్ చేసిందనేది  జగన్ చేసి ప్రధానమైన ఆరోపణ.
దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వయిరీ వేసింది. ఈ కేసును హైకోర్టు స్టాల్ చేసింది. అనంతరం జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసి, ఆ ఫిర్యాదును పత్రికలకు విడుదల చేసి దేశవ్యాపితంగా సంచలనం సృష్టించారు.
జగన్ ఫిర్యాదు మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  ఎస్ ఎ బాబ్డే ఇంకా చర్య తీసుకోవలసి ఉంది.ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరిని సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసింది.
సిక్కిం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎ కె గోస్వామిని ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

ఆంధ్ర ప్రధాన న్యాయమూర్తి  బదిలీ వెనక పెద్ద పొలిటికల్ లీగల్ కనెక్షన్  ఉన్నట్లు టైమ్సాఫ్ ఇండియా(పై క్లిప్పింగ్) రాసింది.
ఎందుకంటే, రాజకీయనాయకుల మీద ఉన్న కేసుల విచారణ సత్వరం పూర్తి చేయాలని జస్టిస్ రమణ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేయగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ వి రమణ కూతుర్ల మీద ఇన్ సైడర్ కేసుల మీద ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసింది.
తర్వాత ఎపి  హైకోర్టు పోలీసు విచారణ నిలిపివేయడమే కాకుండా  జస్టిస్ రమణకూతుర్ల కు సంబంధించినకేసుల  మీద ఎలాంటి వార్తలు రాయడానికి వీల్లేదని మీడియా మీద నిషేధం కూడా విధించింది.
దీని తర్వాతే జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. హైకోర్టు నిషేధం ఉత్తర్వు  దేశమంతాసంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు తర్వాత ఈ ఉత్తర్తులను కొట్టి వేసింది.
రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులను  సత్వరం విచారణ పూర్తి చేయాలన్న జస్టిస్ రమణ బెంచ్ జారీ చేసిన  ఉత్తర్వుల పరిణామం ఆంధ్రలో తీవ్రంగా ఉంటుందనేది అందరి అనుమానం. ఎందుకంటే, ముఖ్యమంత్రి జగన్ మీద సుమారు డజన్ కేసులు విచారణలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క కేసులో శిక్ష పడినా  జగన్ లాలూప్రసాద్ లాగా పదవికి రాజీనామాచేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు.
అందుకే జగన్ తీవ్రంగా స్పందిస్తూ సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖరాశారని అనుకుంటున్నారు.
టైమ్సా ఫ్ ఇండియా కథనం ప్రకారం సోమవారం సాయంకాలం నుంచి దేశరాజధానిలో ఆంధ్రప్రదేశ్ ప్రధానన్యాయమూర్తి బదిలీ గురించి వార్తలు వినవస్తున్నాయి.
జగన్ ఫిర్యాదు ఇంకా పరీశీలనలో ఉన్నపుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి బదిలీ జరగడం లీగల్ సర్కిల్స్ చర్చనీయాంశమయిందని టైమ్స్ రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *