“ఆంధ్రలో ప్రైవేటు స్కూళ్లను చంపేస్తున్నారు”

లాక్‌డౌన్‌ వల్ల తీవ్రమైన ఆర్ధికనష్టాలను ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలలను ఆదుకోవాల్సింది పోయి శాశ్వతంగా మూసివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినవైఖరి అవలంభిస్తోంది. పలురకాల జీవొలు జారీ చేసి చిన్న ప్రైవేటు పాఠశాలలను అణచివేస్తోంది. ఆర్ధిక నష్టాల వల్ల ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనలు ఇప్పటికిప్పుడు కొన్ని పాక్షికంగా పాటించకలేకపోవచ్చు. ప్రభుత్వం వాటిపై ఆగ్రహాన్ని పక్కనపెట్టి ఉదారంగా వ్యవహరిస్తేనే ప్రైవేటు పాఠశాలలు నిలబడగలవు. అవి నిలబడితేనే వీటిపై ఆధారపడిన ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉపాధి లభిస్తుంది. పేద తల్లిదండ్రులకు ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులకు విద్య లభిస్తుంది. మొత్తం ప్రైవేటు పాఠశాలలు ప్రమాదం నుంచి బయటపడపతాయి.
రాష్ట్రంలోని 47వేల ప్రభుత్వ పాఠశాలల్లో 42 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 15 వేల ప్రైవేటు పాఠశాలల్లో 37 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధన సహాయం ఆశించడం లేదు. స్వతంత్య్రంగా నిర్వహిస్తూ, విద్యార్ధి సగటు ఫీజు రూ.15 వేల నుంచి 20 వేలకే పరిమితం చేసి పేదతల్లిదండ్రులకు ఎంతో సహాయం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కోవిద్‌ -19 ప్రభావం పైవేటు విద్యారంగంపై తీవ్రంగా ఉంది. లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల తల్లిదండ్రులు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు 40 శాతం ఆగిపోయాయి. పాఠశాలలు తెరవకపోవడం వల్ల అడ్మిషన్లు లేక యాజమాన్యాలు ఆర్ధికనష్టాల బారినపడ్డారు. పాఠశాల భవనాల అద్దె, బస్సులకు చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేక తీవ్రమైన వత్తిడికి గురౌతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని 40 మంది కరెస్పాండెంట్లు ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు.
సోము వీర్రాజు, ఆంధ్ర బిజెపి అధ్యక్షుడు
లాక్‌డౌన్‌ సమస్యల వల్ల ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న 3.50 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉపాధి కోల్పోయారు. బతుకు తెరువుకు కూలిపనులు చేసుకుంటున్నారు. మొత్తం ప్రైవేటు విద్యావ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది.
ఇంత దారుణమైన పరిస్థితుల్లో మగ్గుతున్న ప్రైవేటు పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి అణచివేతధోరణి అవలంభిస్తోంది. గుర్తింపుకోసం మరల తనఖీలు చేస్తామని జీఓలు జారీచేసింది. గతంలో తనఖీలు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఉంటేనే గుర్తింపు ఇచ్చారు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునే సమయం ఇస్తేచాలు. అంతేకాని నష్టాల్లో కూరుకున్న సంస్థలను మరింత కుంగదీసేలా ఇబ్బందిపెడుతున్నారు.
ప్రైవేటు పాఠశాలలు ఎందుర్కొంటున్న సమస్యలు :
1). 8 నెలలుగా జీతాలు లేక ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయలును ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేల గౌరవవేతనం ఇవ్వాలి.
2).పాఠశాలలు తెరవని కారణంగా రుణాలకు సంబంధించి మారటోరియం కాలాన్ని 2021 జూన్‌ నెల వరకు వడ్డీలేకుండా పొడిగించాలి.
3). ఫీజురెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ పరిధి నుంచి చిన్న పాఠశాలలను తొలగించాలి.
4). పాఠశాలల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నేషన్‌ను మూడేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించాలి.
5).పాఠశాలలు నడవని కారణంగా స్కూలు బస్సులకు చెల్లించాల్సిన రోడ్డు టాక్సు, ఫిట్నెస్‌, బీమా గడువును 2021 మే వరకు పొడిగించాలి.

 

(ఇది సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ.  బిజెపి దీనిని విడుదల చేసింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *