ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చోటు లేని రాజధాని అమరావతి: నందిగం

 (నందిగం సురేష్‌,బాపట్ల లోక్ సభ సభ్యుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి) 
1. ఈ రోజు రాష్ట్రానికి ఒక టూరిస్టు వచ్చారని తెలిసింది. ఆ టూరిస్టు ఎవరయ్యా అంటే… గత 18 నెలలుగా రాష్ట్రాన్ని వదిలేసి హైదరాబాద్‌లో దాక్కొన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే. ఇక్కడకు ఒక టూరిస్టు మాదిరిగా వచ్చి వెళ్తున్న ఆయన అమరావతిలో తన బినామీ భూముల కోసం ఎంతగానో ఆరాటపడుతున్నాడు. అమరావతిలో రాజధాని కడతామంటూ వేల ఎకరాల భూములను అన్ని సామాజిక వర్గాల నుంచి కాజేశారు. రాజధాని ఏర్పాటుకు ముందే తన బినామీలు, తదితరులతో ఇక్కడ భూములు కొనుగోలు చేయించారు. అసలు చంద్రబాబు అమరావతి ఎవరి కోసం కట్టారు. ఎన్నికల ముందేమో చంద్రబాబు ఓట్లేయమని రాష్ట్రమంతా తిరిగి అడిగారు. తర్వాత ఒక జిల్లాలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన 29 గ్రామాల్లో, తన బినామీలు కొనుగోలు చేసిన భూముల కోసమే అమరావతి అంటూ ఆరాటం తప్ప చంద్రబాబు దగ్గర పెద్ద పోరాటమేమీ లేదు.
2. చంద్రబాబు చెబుతున్న అమరావతిలో పేదవాడు ఉండే అవకాశం ఉందా? పేదవారు ఉండే లెక్కన అయితే, రాజధాని ప్రాంతంలో 54వేల ఇళ్లు శ్రీ జగన్ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధపడితే కోర్టుకు వెళ్లి ఎలా అడ్డుకున్నారు  వేలాది ఎస్సీ, ఎస్టీలు అమరావతిలో భూములు ఇచ్చి ఉన్నారు. వాళ్లకు చంద్రబాబు ఎంతవరకు న్యాయం చేశారు? ప్యాకేజీ ఇచ్చే విషయంలో, కౌలు ఇచ్చే విషయంలో ఎంత వరకు న్యాయం చేశారు. మూడు, ఆరు నెలలకోసారి మెరుపు తీగలా చంద్రబాబు వచ్చి కనపడి వెళ్తున్నారు. తన దాయాదులు ఇబ్బందులు పడుతున్నారు. నష్టపోతున్నారు. కష్టపడుతున్నారన్నప్పుడు మాత్రమే చంద్రబాబుకు అమరావతి గుర్తు వస్తుంది.
 ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని అందరూ కోరుకోవాలి తప్ప, కేవలం ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో, ఒక సామాజికవర్గం లాభం కోసం ప్రభుత్వం ఉపయోగపడకూడదు. నిజానికి చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయనకు కావాల్సిన కొద్దిమంది డబ్బు సంపాదించుకునేందుకు అమరావతిని ఒక అడ్డాగా మార్చుకున్నారు. మరో రెండు, మూడొందల సంవత్సరాల పాటు అంతా తనవారే అక్కడ ఉండాలనే కుట్రతో చంద్రబాబు చేసిన డిజైన్‌కు మరో పేరే అమరావతి. అంతేతప్ప, ఇందులో పేదలకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఎటువంటి వాటా లేని రాజధాని కట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నించాడు. అందుకే, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.
3. ఈ భూముల్లో కొంత 54వేల మందికి ఇళ్ళ స్థలాలుగా ఇస్తామంటే.. దానికి కూడా చంద్రబాబు అడ్డుపడ్డాడు. తన సామాజిక వర్గం మాత్రమే బ్రతకాలి. తనను నమ్ముకున్న వ్యక్తులు మాత్రమే ఉండాలన్నది చంద్రబాబు అమరావతి డిజైన్‌ ఉంది.  అంతేకానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రపంచ రాజధాని కట్టాలన్న ముఖ్య ఉద్దేశం ఏమాత్రం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు చుట్టూ పేదలు, దళితులు ఉండకూడదన్న పద్ధతిలో వ్యవహరించారు. రాజధానిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే చంద్రబాబుకు నచ్చదు.
4. చంద్రబాబు డిజైన్ ఏమిటో, వారి తరఫున కోర్టులో వినిపించిన వాదనల్లోనే అర్థమైంది. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం వల్ల డెమోగ్రఫిక్ ఇన్‌ బ్యాలెన్స్ వస్తుందని హైకోర్టులో చేసిన వాదనతోనే చంద్రబాబు డిజైన్ పూర్తిగా బట్టబయలైందని సురేష్ తెలిపారు. రాజధానిలో పేదవారు ఎవ్వరూ ఉండకూడదు. వారికి ఇళ్ల ప్లాట్లు ఇస్తే మురికికూపంలా ఉండిపోతుంది. మరి, భవిష్యత్‌లో పేదవారిని చంద్రబాబు ఓట్లు అడుగుతారా? పేదవాడు ఉండకూడదా? ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను ఓట్లు అడిగే ఉద్దేశం ఆయనకు ఉందా? లేదా? మూడు ప్రాంతాల్లో ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా?
5. ఆస్తులు కూడగట్టుకున్నాం. వాటిని నిలబెట్టుకుందాం అనేలా చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడుతున్నారు తప్ప అమరావతి రైతుల మీద, వ్యక్తుల మీద ప్రేమ ఏమీ లేదు.  చంద్రబాబు సంపాదించిన సంపాదన, దోచేసిన సొమ్ము, కాజేసిన భూములు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాజధాని డెవలప్‌ అయితే.. రేపు రాజకీయంగా భవిష్యత్‌ ఉండదు. ఆ ఆస్తులు అంటూ నిలబెడితే.. వందల వేల కోట్లు కూడబెట్టాలనే కాన్సెప్ట్‌లో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.
6. ఎప్పుడు చూసినా జూమ్‌ యాప్‌లో కనిపించే చంద్రబాబు అమరావతి 365 రోజులు అంటూ హడావుడి చేయటానికి వచ్చారు. దళితుల కోసమో, ఆయన కోసమో తెలీదు కానీ.. అంబేద్కర్ విగ్రహానికి శంఖుస్థాపన చేశాడే తప్ప, నాలుగేళ్ళపాటు నిర్మాణం చేసింది లేదు. దళితులకు అన్యాయం జరుగుతోందంటూనే వారికి ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నా, ఇళ్లు ఇస్తున్నా, పేదవారు ఇంగ్లీషు మీడియం చదువుకుంటున్నా చంద్రబాబు ఓర్చుకోలేడు. నా కంటే ఘనంగా వీరు ఎలా బ్రతుకుతారనే కుళ్లు కుట్ర అసూయతో చంద్రబాబు రగిలిపోతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డిగారు 31 లక్షలు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలోని మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. నిసిగ్గుగా కోర్టుల్లో పిటీషన్లు వేసి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారు. మరి, పేదలు గురించి, దళితుల గురించి చంద్రబాబు మాట్లాడటం ఏంటి?
7. చంద్రబాబుకి ఆయన సామాజిక వర్గం బాగుపడటమే కావాలి. ఆయన్ని నమ్ముకున్న దొంగలు బాగుపడటం కావాలి. ఆలీబాబా అరడజను దొంగల్లా.. అలీబాబా 40 సంవత్సరాల దొంగలంతా చంద్రబాబు దగ్గరే ఉన్నారు. ఆ దొంగలంతా బ్రతకాలంటే చంద్రబాబు అమరావతిని అడ్డంపెట్టుకోవాలి. అందుకోసమే చంద్రబాబు అమరావతి పేరుతో ఈ రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్దిహీనమైన ఆలోచనలు మానుకోవాలి. మూడు రాజధానులు, మూడు ప్రాంతాలు అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల ప్లాట్లు అడ్డుకోవటంలో చంద్రబాబు తన వైఖరి చెప్పాలి. చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం… మామను వెన్నుపోటు పొడవటానికి, టీడీపీని లాక్కోవటానికి, ప్రజలను వాడుకొని వదిలేయటానికి, దళితుల్ని నిలువునా మోసం చేయటానికి, దళితుల్ని కించపరచటానికి ఉపయోగపడిందని.
8. చంద్రబాబు వచ్చి ఇక్కడ ఏదో ఉద్దరిస్తారట. భవిష్యత్‌లో మీరిక రాజకీయంగా పనికిరారు. కనీసం ఆస్తులు అయినా దక్కించుకుందామని నీచ సంస్కృతికి తెరలేపారు. అమరావతి రైతులకు ఏదో జరుగుతోందని అనటం ఏంటి? ఏనాడైనా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక్కరైనా వచ్చి దీక్షల్లో కూర్చున్న పరిస్థితులున్నాయా అని సురేష్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో అమరావతి రైతులకు ఏ న్యాయం చేశారు. ఏమని చెప్పి భూములు తీసుకున్నారు. సింగపూర్‌ టెక్నాలజీ చేతుల్లో ఉందని భూములు తీసుకున్నారు. సింగపూర్‌ వెళ్లిన అమరావతి రైతుల లిస్ట్ బయటపెడితే.. ఎవరెవరు వెళ్లారో తెలుస్తుందని అన్నారు. అందులో ఎంత మంది పేదవారు, ఎంత మంది ధనిక రైతులు సింగపూర్‌ వెళ్లారో తెలుస్తుంది.  టీడీపీ కార్యకర్తలను సింగపూర్ పర్యటనకు పంపించారు.  సింగపూర్‌లా అమరావతి కూడా ఉంటుందని భ్రమలు కల్పించారు. చంద్రబాబు నికృష్టపు చేష్టలతో కొంపలు ముంచి ఇప్పుడు కూనిరాగాలు పాడటం ఏంటి?
9. చంద్రబాబుకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవటం లేదు. ప్రజలకు మేలు జరుగుతుంటే చూస్తూ భరించలేని పరిస్థితికి చంద్రబాబు వెళ్లిపోతున్నారు. పేదవారి మీద పగపట్టేలా బాబు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో, అమరావతి రైతుల్ని, వారి భూముల్ని ముంచేసిన చంద్రబాబు ఏం మిగిలి ఉందని ఇదంతా చేస్తున్నారు. జనాల్ని రెచ్చగొట్టే ధోరణి ఆపండని సురేష్ సూచించారు. చంద్రబాబు తన దొంగల్ని కాపాడుకునే కార్యక్రమాలను ఆపేయాలి. ఇప్పటికైనా చంద్రబాబులో నీతి, నిజాయితీ 10% అయినా మిగిలి ఉంటే.. రాజధానిలో, రాష్ట్రంలో ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు. పేదవారికి ఇళ్ల స్థలాల్లో రిజిస్ట్రేషన్‌ కల్పిస్తే డీకే పట్టాలు ఇవ్వమని మాట్లాడుతున్నారు. చంద్రబాబు కుమారుడు, మనవడు ఇంగ్లీషు మీడియం చదువుకోవాలి. బాగుపడాలి. పేదవారు చదువుకుంటే నచ్చదు. చంద్రబాబు ఆలోచన ఏంటో రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే ఎన్నికల్లో తరిమి కొట్టారు. అయినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు.
10. ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడతారు. చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలని సురేష్ కోరారు. దసరా వేషగాడిలా చంద్రబాబు రాష్ట్రానికి వచ్చారు. ఖర్చులకు ఫండ్‌ కలెక్ట్ చేసుకొని చంద్రబాబు తిరిగి వెళ్తారు.

(నందిగం విలేకరులసమావేశంలో మాట్లాడిన విషయాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *