కాళేశ్వరంతో KCR జైలు కెళ్లడం ఖాయం: బండి

ముఖ్యమంత్రి  కెసిఆర్  త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని  తెలంగాణ బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజధాని ఢిల్లీలోపర్యటనలో ఉన్న సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత కెసిఆర్ ఢిల్లీ వెళ్తారని తాను చెప్పానని, అక్కడికెళ్లి పొర్లుదండాలు పెడతారని కూడా తాను వూహించానని ఆయన అన్నారు.
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయానికి సారథ్యం వహించిన సంజయ్ తొలిసారి రాజధాని వచ్చారు.  సీనియర్ నాయకులతో ఆయన సమావేశమవుతున్నారు
ముఖ్యమంత్రికెసిఆర్ ప్రధానికి వంగి వంగి ఎన్నడూ లేని విధంగా దండాలు పెట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ ఇలాంటి దండాలు ఎన్నిపెట్టినా తానుచేసిన తప్పులగురించి  కెసిఆర్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
కెసిఆర్ 20 కోట్లను దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని,దీనికి కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.    కాళేశ్వరానికి 3టిఎంసి నీళ్లని చెప్పి ఈ భారీదోపిడికీ పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. దీనికోసం కాళేశ్వరం అనుమతులు కావాలని, ఆయితే కేంద్రం దీనికి సుముఖంగా లేదని ఆయన  తెలిపారు. కేంద్రానికి ఎలాంటి డిపిఆర్  సమర్పించకుండా కెసిఆర్ ఏదో వత్తిడి తెచ్చి  అనుమతి సంపాదించాలనుకుంటున్నారని అయితే, కేంద్ర మంత్రి ఈ విషయంలో చాలా స్పష్టంగా డిపిఆర్ లేకుండా అనుమతి నీయడం జరగదని చెప్పారని ఆయన చెప్పారు.
కాళేశ్వరం ప్రాజక్టులో బాగా డీవియేషన్ ఉందని చెబూత  అనుమతులు ఒకదానికి ఇస్తే, ప్రాజక్టు నిర్మాణం మరొక విధంగా సాగుతూ ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజక్టు డిజైన్లు ఎందుకు మార్చాల్సివచ్చిందో ముఖ్యమంత్రి వివరించాలని బిజెపి అధ్యక్షుడు తెలిపారు.
ఇంకా సంజయ్ ఏమన్నారంటే…
ఇప్పటివరకు  కెసిఆర్ తెలంగాణలో సాగుకు ఒక్కచుక్కనీరు ఇవ్వలేదు. అలాంటపుడు కాళేశ్వరం ప్రాజక్టుకు అదనపు నీటికి ( మూడో టిఎంసి) అనుమతులు ఎందుకు? ఇదంతా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే. కృష్ణ జలాల వివాదం పై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేసేందుకు కెసిఆర్ ఎందుకు లేఖ ఇవ్వడం లేదు. కేంద్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని చూసున్నది. కెసిఆర్ మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడాలని చూస్తున్నారు.
కెసిఆర్ కోతల రాయుడు ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు.  కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచింది నిజం కాదా?  ఇదేమిటని ప్రశ్నిస్తే మా రాష్ట్రం… మా నిధులంటావు,  ఈ రాష్ట్రం మీ అయ్య జాగీరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *