ఏడాది పూర్తి చేసుకున్న అమరావతి రైతుల ఆందోళన

అమరావతిని రాజధాని గా కొనసాగించాలని, రాజధాని విశాఖ కు మార్చవద్దని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళన ఏడాది పూర్తి చేసుకుంటున్నది. ఈ డిసెంబరు 17 నాటికి అమరావతి రైతుల ఆందోళన మొదలయి ఏడాది పూర్తి అవుతుంది.
ఈ సందర్భంగా గుంటూరులో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి శనివారం మహా పాదయాత్ర చేపట్టింది.
శుభం కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు జరిగిన ఈ పాదయాత్రలో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు దేశం పార్టీ,  వామపక్ష పార్టీల  నేతలు రైతులకు సంఘీభావం తెలిపారు.
అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని  ఐకాస నిర్ణయించింది.
ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్‌ సమ్మేళనం నిర్వహిస్తారు.  డిసెంబర్ 15న విజయవాడలో పాదయాత్ర నిర్వహిస్తారు. 17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *