కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులలో అపోహాలు వున్నాయనీ, రైతులతో చర్చలు జరిపాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ సందర్భంగా సోమవారం నాడు పట్టణంలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దం చేసి, పంటల ధర నిర్ణాయక కమిటీని స్వయం ప్రతిపత్త సంస్థ గా ఏర్పాటు చేయాలని, మార్కెట్ యార్డులను బలోపేతం చేయాలని డిమాండ్ చేసారు.
దీని కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి పై అంశాలపై చట్టాలను తీసుకురావాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి,ఏర్వ రామచంద్రారెడ్డి, యాళ్ళరు రామసుబ్బారెడ్డి, సౌదాగర్ ఖాసీం మియా, యూనస్,పర్వేజ్,గన్నీ కరీం, మహేశ్వరరెడ్డి,పట్నం రాముడు,M.V.రమణారెడ్డి, వెంకటేశ్వర నాయుడు, అరీఫ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.