తెలుగులో బిటెక్ ?… ఒక తెలుగు IIT ప్రొఫెసర్ సంచలన ప్రతిపాదన

ఒక తెలుగు ప్రొఫెసర్ ఎవరూ వూహించని ప్రతిపాదన చేసి  అకడిమిక్ రంగంలో కలకలం సృష్టించారు. దేశంలో బిటి. టెక్ (B.Tech)ని ప్రాంతీయ భాషలలో బోధించాలని సూచించారు. ఇదే జరిగితే ఐఐటి లో హోదా గల్లంతవుతుంది. లక్షలాది మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ప్రతిభ బయటకు వస్తుంది. సాంకేతిక విద్యను ఏవో కొద్ది మంది ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ల మొనాపలి నుంచి  తప్పించి సార్వజనీనం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయన ఎవరో కాదు,మన తెలుగు వాడు. పేరు ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు. ఢిల్లీ ఐఐటి డైరెక్టర్.
వ్యక్తిగతంగా తన అభిప్రాయలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దేశం నిండా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రగతి శీలురు ఉన్నారు. వాళ్లకాళ్లకి ఒక భాష్ (ఇంగ్లీష్)బంధం కారాదు అని ఆయన పేర్కొన్నారు.
“I strongly believe, every child who does schooling in local languages must have an opportunity to take JEE Main and JEE Advanced in their local language.JEE  Advanced must be conducted in all local languages, where there is a demand. Once these students, who have had their schooling in local languages enter IITs, we must have  ‘study help’ groups which will help these students to migrate to English over a period of time.,” అని ఫ్రొపెసర్ గ్రామీణ విద్యార్థుల తరఫున వాదించారు.
తాను  12 వ తరగతి దాకా తెలుగు మీడియంలో ఒక గ్రామీణ వాతావరణంలో చదుకున్నానని చెబుతూ ఇపుడు అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా కొనసాగుతున్నానని ఆయన నిస్సంకోచంగా తన గతం పంచుకున్నారు. బిటెక్ ను ప్రాంతీయ భాషల్లో బోధించాల్సిన అవసరం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఐఐటిలలో కనీసం ఫస్ట్ సెమిస్టర్ ను ప్రాంతీయ భాషలలో బోధించడం మొదలుపెట్టాలి. ఏ భాషనైనా విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఢిల్లీ ఐఐటిలో హిందీ  భాషలో బోధించవచ్చు. ప్రాంతీయ భాషల్లో బిటెక్ బోధన మొదలయినపుడు అధ్యాపకుల ఎంపికలో భాష ఒక అర్హతాంశం అవుతుంది. దీనితో బిటెక్ మీద ఐఐటిల అధిపత్యం పోవడం మొదలవుతుంది.
ఏదో భాష రానంత మాత్రాన ఏ ఒక్కరికి ఉన్నతావకాశలను అందకుండా చేయరాదు. అర్హులయిన వారందరికి సమానావకాశాలు కల్పించేందుకు కృషి చేద్దాం. ప్రతిభకు కులం, గోత్రం, మతం,ప్రాంతీయత లేదు. ప్రతిభ పెల్లుబికి రావడానికి కావలసింది చిన్న చేయూత.ఐఐటి ల ఉద్దేశం ఇలాంటి ప్రతిభను గుర్తించి అది వికసించేందుకు చేయూతనీయడమే.
ఇంతకీ ప్రొఫెసర్  రామ్ గోపాల్ రావు ఎక్కడి వాడో తెలుసా?
ఆయన తెలంగాణలోని కోల్లాపూర్ లో జన్మించారు. ఇంటర్మీడియట్ దాకా గవర్నమెంట్ పాఠశాలలో, తెలుగు మీడియంలో చదువుకున్నారు. తర్వాత 1986లో వరంగల్ కాకతీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి  బి.టెక్ పూర్తి చేశారు. తర్వాత ఐఐటి బాంబే నుంచి 1991లో ఎమ్  టెక్ చేశారు. తర్వాత 1997లో 1997 జర్మనీ మ్యూనిక్ లోని  బుండేశ్వర్ యూనివర్శటీ నుంచి నానో టెక్నాలజీ నుంచి డాక్టొరేట్ పొందారు. తర్వాత 1997 నుంచి 1998 మధ్య కాలిఫోర్నియా యూనివర్శటీ నుంచి ఫోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేశారు. తర్వాత బొంబాయి ఐఐటిలో 18 సంవత్సరాలు పని చేశారు. అక్కడ ఆయన నానో టెక్నాలజీ కేల్కర్ ఛైర్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఇపుడు ఢిల్లీ ఐఐటి  డైరెక్టర్ గా ఉన్నారు. నానో టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నపరిశోధకుడాయన. లెక్కలేనన్ని అవార్డులొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *