అమరావతి కోసం వంద మంది రైతుల గుండెలు ఆగినా.. ముఖ్యమంత్రి కఠిన గుండె మాత్రం కరగడం లేదంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని కృష్ణ ప్రసాద్
అమరావతిలో సాగుతున్న రైతుల ఆందోళన గురించి ఆయనేముంటున్నారో చూడండి.
(అనగాని సత్యప్రసాద్)
అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యహరించడం సరికాదు. 347 రోజుల నుంచి రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశం నలుమూలల నుంచి మద్దతు లభిస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకపోగా వారికి పోటీగా పెయిడ్ ఆర్టిస్టులతో పేమెంట్ ఉద్యమం చేయించటం సిగ్గుచేటు.
మూడు రాజధానుల ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయానికి 100 మంది రైతుల గుండెలు ఆగినా ముఖ్యమంత్రి గుండె మాత్రం కరగడం లేదు. మానవత్వం లేని పాలకులు కులాలను,మతాలను రెచ్చగొడతారు, పనితనం లేని పాలకులు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారన్న పెద్దల మాటలను జగన్ అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు.18 నెలలపాటు అమరావతి నుంచి పాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలనా రాజధానిగా అమరావతి పనికి రాదా? అమరావతిపై వైసీపీకి ఎందుకంత కక్ష్య? సువిశాల ప్రజా రాజధాని అవసరమా? వృధా, వృధా అని వాది స్తున్నారు. రాజధాని విలువ తెలిసినవారు ఎవరైనా ఇలా మాట్లాడుతారా? తెలంగాణకి అద్భుతమైన రాజధాని హైదరాబాద్ ఉంది. తమిళనాడుకు చెన్నై ఉంది.కర్ణాటకకు బెంగుళూరు ఉంది . మనకు అద్భుతమైన రాజధాని ఉండకూడదా రాజధాని అమరావతి మార్చితే రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవని మేధావులు, నిపుణులు, ప్రజలు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు పెడచెవిన పెడుతున్నారు?
ముఖ్యమంత్రి జగన్ అహంకారం, అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ని అంధకారం చేశారు. అమరావతి పై బస్మాసుర హస్తం పెట్టారు. పోలవరాన్ని మింగేసారు. పగ,ప్రతీకారం,కూల్చివేతలు,అణచి వెతలుతప్ప 18 నెలలుగా చేసింది శూన్యం. ముఖ్యమంత్రి మూర్ఖపు నిర్ణయాలని న్యాయ వ్యవస్థ అడ్డుకోబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి రాష్ట్రం నాశనమయ్యేదే. రాజధాని మార్చితే రాష్టానికే కాదు వైసీపీ కూడా ముప్పే అని సాక్ష్యాత్తు వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా రైతులకు క్షమాపణ చెప్పి మూడు రాజధానుల మూర్ఖపు నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించటం న్యాయం, కాదంటే వైసీపీని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టడం ఖాయం.