హైదరాబాద్ లో వాజ్ పేయి విగ్రహం ఏమయింది? :రేవంత్ చురక

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి చురక.
ఎన్టీఆర్, పివి సమాధుల పెకలించాలని జిహెచ్ ఎంసి ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ చేసిన  వివాదాస్పద  కామెంట్ మీద ఆవేశంగా ఉపన్యాసాలిస్తున్న బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఎంపి రేవంత్ రెడ్డి చురక వేశారు.
అంత ఆవేశం పనికిరాదని చెబతూ బిజెపి ఏంచేయాలో సూచనలిచ్చారు. అదే ఈ వీడియో…
“పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కాపాడే పని మీకు అవసరం లేదు. హైదరాబాద్ లో వాజ్ పాయ్ విగ్రహం పెట్టించాలని గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి వెళ్లి కేసిఆర్ ను కలిశారు. రెండేళ్లు అవుతున్నది.ముందు దాని సంగతి చూడురి. బిజెపిలో పాత సామాన్ల వలే పక్కన పడేసిన అద్వానీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి  వంటి నాయకులకు గౌరవం ఇయ్యండి.వాళ్లని నిర్లక్ష్యం చేసి పక్క పార్టీలకుచెందిన పివి, ఎన్టీఆర్  వంటి వాళ్లని కాపాడే బాధ్యత తీసుకోవద్దు,’ అని సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి సలహా పూర్తిగా వినండి:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *