అసెంబ్లీ లోకి ఆ మీడియాను కూడా అనుమతించండి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి  అన్నిన్యూస్ చానెళ్లను పూర్తిగా అనుమతించాలని తెలుగు దేశం పార్టీ శాసనమడలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు,  బుద్దా వెంకన్న, మంతెన వెంకట సత్యనారాయణ రాజు మండలి ఛైర్మన్ ను కోరారు.
అసెంబ్లీ సమావేశాలకు ఏబిఎన్, టివి5, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులను కూడా అనుమతించాలని, ఈ మీడియా మీద నిషేధం మంచిదికాదని వారు తెలిపారు.
చట్ట సభల్లో కూడా మీడియా విషయంలో ప్రభుత్వం వివక్షకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు.
“మావేశాలకు మీడియాను అనుమతించకపోవడం ఆర్టికల్ 19 ని ధిక్కరించడమే. ఇది రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుంది.
చట్ట సభల్లో జరుగుతున్న చర్చలు ప్రజల్లోకి వెళ్ళాలంటే మీడియా సహకారం అవసరం. సొంత పత్రికలకు అనుమతి ఇస్తూ మిగతా వారికి అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని వెల్లడి,”అని వారు చెయిర్మన్ కు తెలిపారు.
 ఈ మీడియా ప్రతినిధుల మీద గత ఏడాది జూలై నుంచి నిషేధం కొనసాగుతూ ఉంది. ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి, ఈటి, టివి5లు అసెంబ్లీ నియమాలను ఉల్లంఘించారని వీటి మీద నిషేధం విధించారు. ఆ రోజు ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలను  సభనుంచి బహిష్కరించారు. వీరు బయటకు వెళ్లిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పీకర్ చర్యను, ప్రభుత్వ ధోరణిని విమర్శించారు. ఈ విమర్శను ఈచానెళ్లు  ప్రత్యక్ష ప్రసారం చేశాయి. సభ సమావేశాలలో ఉన్నపుడు ప్రత్యక్ష ప్రసారాలుచేయడం రూల్స్ కివ్యతిరేకం.  ఇలా ఒక చట్టాన్ని వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పుడు తీసుకువచ్చారు.  ఈ మూడు చానెళ్లు ఈ చట్టాన్ని ఉల్లంఘించాయని అసెంబ్లీలోకి రాకుండా నిషేధం విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *