బిజెపి, ఎంఐఎం పరస్పరం సాయం చేసుకుంటున్నాయి: ఉత్తమ్

బీజేపీని అన్ని రాష్ట్రాల్లో గెలిపించడానికే AIMIM నేత అసదుద్దీన్ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.   హైదరాబాద్ లో  జిహెచ్ ఎంసి ఎన్నికల ప్రచారంలోరెండు పార్టీలు తెగ రెచ్చి పోతున్న విషయం ప్రస్తావిస్తూ బీజేపీ మజ్లీస్ పార్టీ  రెండు ఒక్కటేనని అన్నారు.
ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ వైపల్యాలును వెల్లడిస్తూ,కాంగ్రెస్ హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలి అనే కరపత్రాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,షబ్బీర్ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ప్రసంగించారు.
ఈ ఎన్నికల్లో విపరీతంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ బిజకెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగాలను ఉటంకిస్తూ సంజయ్ కి  హైదరాబాద్ ఎక్కడా మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? అని ప్రశ్నించారు.
ఉత్తమ్ ప్రసంగం విశేషాలు:
బండి సంజయ్ కి హైదరాబాద్ కు ఏం సంబంధం?
బీజేపీ ఓట్లకోసం ఎంఐఎం నేతలు ,ఎంఐఎం ఓట్లకోసం బీజేపీ నేతలు ఇలాంటి  రెచ్చగొంటుకుంటూ  వ్యాఖ్యలు చేస్తున్నారు
బుద్దిలేకుండా వీళ్ల మాటలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ కష్టసుఖల్లో ప్రజలకు తోడుగా ఉంది.
హైదరాబాద్ ప్రజలు గమనించాలి.
కెసిఆర్ కూడా దాగుడుమూతలే అడుతున్నడు.
కేంద్రం పెట్టిన ప్రతి బిల్లును కేసీఆర్ మద్దతు పలికారు..
రాజకీయ లబ్ది కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..
మత సామరస్యం కోసం పాటుపడాలి..
ఇన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం పార్థసారథి చర్యలు తీసుకోవడం లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *