నివార్ తుపాను రాగల 6 గంటల్లో తీవ్రవాయుగుండం, ఆ తదుపరి 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది.
తీరందాటినా తీవ్ర ప్రభావం చూపనున్న నివర్ తుఫాన్.
నివర్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం , వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు , అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు నమోదయ్యాయి.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
నదులు , వాగులు దాటే ప్రయత్నం చేయరాదు
రైతులు అప్రమత్తంగా ఉండండి
(కె.కన్నబాబు,కమిషనర్ , విపత్తుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్)