కాశ్మీర్ లో శక్తివంతమయిన నిరసన గొంతుగా ఉన్న ఇంగ్లీష్ దినపత్రిక కాశ్మీర్ టైమ్స్ (Kshmir Times) కార్యాలయానికి అధికారులు తాళ వేశారు. కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం ఎస్టేట్ డిపార్ట్ మెంటు అధికారులు శ్రీనగర్ కార్యాలయానికి వచ్చి సిబ్బందిని బయటకు రప్పించి తాళం వేసుకుని వెళ్లిపోయారు. కార్యాలయం సామాగ్రి మొత్తంలో లోపలే ఉండిపోయింది.
ఈ పత్రిక హెడ్ క్వార్టర్స జమ్ములో ఉన్నా శ్రీనగర్ నుంచి కూడా ఒక ఎడిషన్ వస్తుంది. కాశ్మీర్ ఇపుడు లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ జోషి పాలనలో ఉంది.
తొలినుంచి కాశ్మీర్ టైమ్స్ 370వ అర్టికిల్ ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాదు, కాశ్మీర్ లో పత్రికల మీద విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో పిటిషన్ కూడా వేసింది. ఈ ఆంగ్ల పత్రిక ఎడిటర్ అనురాధ భషీన్ హక్కుల పోరాటంలో ముందుంటున్నారు.
కాశ్మీర్ లో చాలా కాలంగా వస్తున్నఆంగ్ల పత్రిక ఇదే. ఈ మధ్ ఈ పత్రిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది,దీనితో పత్రిక శ్రీనగర్ ప్రింట్ ఎడిషన్ ను మూసేశారు. ఇక్కడి నుంచి కేవలం వెబ్ ఎడిషన్ మాత్రం వస్తూ ఉంది, 1993 చాలా పత్రికలకు ప్రభుత్వం కార్యాలయాలు కేటాయించింది. అపుడు కాశ్మీర్ టైమ్స్ కు ఈ కార్యాలయం కేటాయించారు.
అనూరాధ భషీన్ ఈ పత్రిక యజమాని కూడా.
కార్యాలయానికి ఉన్నట్లు తాళం వేయడాన్ని ఆమె ఖండించారు. అధికారులు తమ కార్యాలయానికి సిబ్బందిన బయటకు రప్పించి తాళం వేశారని ఆమె పేర్కొన్నారు. కార్యాయలాన్ని సీల్ చేయడంలో పాటించాల్సిన నియమాలు పాటించలేదని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ప్రశ్నింయే పైవాళ్లతో మాట్లాడండి అని చెప్పిబలవంతంగా లాక్ చేసుకుని పోయారని ఆయన చెప్పారు.
” నిన్న సాయంకాలం ఎస్టేట్ అధికారులు కార్యాలయానికి వచ్చారు. వారు ఎలాంటి ఎవిక్షన్ ఉత్తర్వులు ఇవ్వలేదు. కార్యాలయాన్ని మూయాలనుకున్నపుడు తమ కు నోటీసు ఇవ్వాలి. ఖాళీ చేసేందుకు తగినంత గడువు ఇవ్వాలి. నోటీసు పత్రికల్లో ప్రకటించాలి. ఇలాంటి విధానమేది పాటించకుండా కార్యాలయానికి సీల్ చేసి వెళ్లిపోయారు,’ అని భషీన్ 19న ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Today, Estates Deptt locked our office without any due process of cancellation & eviction, same way as I was evicted from a flat in Jammu, where my belongings including valuables were handed over to “new allottee”. Vendetta for speaking out! No due process followed. How peevish! pic.twitter.com/J5P0eKxvbx
— Anuradha Bhasin (@AnuradhaBhasin_) October 19, 2020
తాను ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నందునే ప్రతీకారంగా పత్రిక గొంతునొక్కేస్తున్నారని, ఇందులో భాగంగాన కార్యాలయానికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా,నియమాలేవీ పాటించకుండా మూసేశారని భషీన్ విమర్శిస్తున్నారు.
కాశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. 2010 నుంచి కాశ్మీర్ లో మీడియా అణచివేత విధానం కొనసాగుతూనే ఉందని, ప్రతి ప్రభుత్వం మీడియా అణిచివేత లో వికార చరిత్రను సృష్టించాయని ఎడిటర్స్ గిల్డ్ ఒక ప్రటనలో పేర్కొంది.
“Preventing circulation of newspapers, blacklisting the newspapers from getting government advertisements in Srinagar and Delhi, and interrupting negatively in the routine operations have adversely impacted the media. These are in addition to the issues that reporters on daily basis while gathering information,” అని ఎడిటర్స్ గిల్డ్ తన ప్రకటనలో పేర్కొంది.