అద్భుతమయిన లంకమల కోనలో ట్రెకింగ్…

(రవిశంకర్)
లంకమల కోన కడప జిల్లాలో కడప పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో సిద్దవటం బద్వేల్ మధ్యలో ఉంటుంది.సిద్దవటం దాటిన తరువాత 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే లంకమల కోన చేరుకోవచ్చు. మంచి కొండలమధ్య ఉంటుంది.
ఇది లంకమల్లేశ్వర వన్యమృగ అభయారణ్యం కిందికి వస్తుంది. ఇలాంటి అభయారణ్యం దేశంలో ఇదొక్కటే. ఇక్కడే అరుదైన పక్షి జెర్డాన్స్ కోర్సర్ (Jerdon’s courser: Rhinoptilus bitorquatus) కనిపించింది. 1848లో ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ ధామస్ పి జెర్డాన్ ఈ పక్షిని మొదటి సారి చూశారు. తర్వాత ఈ పక్షి మళ్లి కనిపించకపోవడంతో అంతరించి పోయిందనుకున్నారు.
Jerdon’s courser(Wikimedia. Camera trap image)
అయితే, 1986లో మరొకసారి కనిపించింది. దీనితో ఈ ప్రాంతాన్ని జెర్డాన్స్ కోర్సర్ అభయారణ్యంగా ప్రకటించారు.దీని విస్తీర్ణం 464 చదరపు కి.మీ  మీరు ఓపిగ్గా  చూస్తుంటే, అదృష్టముంటే  ఈ అరుదైన మీకూ పక్షి కనిపించవచ్చు. మీరు హెడ్ లైన్ న్యూస్ కావచ్చు.ఈ అభయారణ్యంలో మొత్తం 1400 రకాల మొక్కలు, వృక్షాలు పెరుగుతున్నాయి.
ఎపుడూ సెలయేర్లు జలపాతాలయి దుముకుతుంటాయి. కొండచరియలు, లోయలు, చెట్టు … చాలా ఆహ్లదకరమయిన వాతావరణం  ఇక్కడ నెలకొని ఉంది. కొండలెక్కుతూ దిగుతూ సెలయేర్లు దాటుకుంటూ పైకి వెళితే అక్కడున్న వాతావరణంలో మీ మనసు తెలిక పడుతుంది.

ఆ ప్రశాంత వారణంలో మీరొకసారి ప్రపంచం మరిచిపోయి తన్మయత్వం చెందుతారు. అలా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ కోనని కపర్ధీశ్వరకోన అంటారు. అక్కడ ఒక .శివాలయమూ ఉంది. ఈ కోన ట్రెకింగ్ వీడియోలు చూడండి.
ఈ కోనకు చేరుకోవడం చాలా సులభం.  కడప నుంచి బద్వేల్ వెళ్లే బస్ ఎక్కి  సిద్దవటం చెక్ పోస్ట్ వద్ద దిగితే హాయిగా ఒక అర కిలోమీటర్ దూరం నడిస్తే చాలు, మీరు కోన చేరుకుంటారు. సిద్ధవటంలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. లేదా బసచేసేందుకు కడపలో చాలా హోటళ్లున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి, లేదా కడపకు రైళ్లు, బస్సులు విమానసర్వీసున్నాయి.   తిరుపతి నుంచి రావచ్చు. కడపనుంచీ వెళ్లవచ్చు.