ఆ రూమర్స్ కు ‘చెక్’ చెప్పటానికే ఈ ఫస్ట్ లుక్?

పెళ్లయ్యాక  యంగ్ హీరో నితిన్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. వరుస పెట్టి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చిత్రాన్ని చేస్తున్న నితిన్ త్వరలో హిందీ సినిమా ‘అందాధూన్’ని రీమేక్ చేయనున్నాడు. ఈలోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న  తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు సాయింత్రం రిలీజ్ చేసారు. అయితే ఇంత హఠాత్తుగా  ఈ లుక్ ని విడుదల చేయటం వెనక కారణం ఉందంటున్నారు.
గత రెండు రోజులుగా మీడియాలో …నితిన్ ,యేలేటి కాంబినేషన్ లో చేస్తున్న సినిమా పై సైలెంట్ గా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్  ఎప్పుడు మొదలెడతాడో చెప్పకుండా తన సొంత బ్యానర్ లో రూపొందే అందాధూన్ రీమేక్ పై పూర్తి దృష్టి పెట్టాడని అంటున్నారు. దానికి తోడు యేలేటి వైపు నుంచి కూడా అప్ డేట్స్ లేవు. దాంతో అసలు ఆ సినిమా ఏమైందనే ఆలోచన అభిమానుల్లో మొదలైంది. దానికి చెప్పటానికే హడావిడిగా చిత్రం టీమ్ ఈ రోజు  అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ పోస్టర్ ను కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. భవ్య క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం పేరు ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వైవిధ్యమైన సినిమాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.    ఓ కేసు, జైలు, ఈ నేపథ్యంలో అల్లిన ఓ థ్రిల్లింగ్ కథ ఆధారంగా చెక్ సినిమాను నిర్మిస్తున్నారు.
టైటిల్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ”చదరంగం నేపథ్యంలో  సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది . ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశ లో ఉంది ” అని చెప్పారు.
నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- ” నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాలో నితిన్ నటన మరో లెవెల్ లో వుంటుందని ఆయన అన్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందని తెలుస్తోంది.