కర్నూలు ఆర్ యూ ముందు ఆంధ్రరాష్ట్ర దినోత్సవం సందర్భం

ఆర్ యూ ముఖద్వారం ముందు ఆంధ్రరాష్ట్ర దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన విద్యార్థి సంఘాలు ఆర్ వియస్,ఆర్ విపియస్,ఆర్ విపి.ఎన్ ఎస్ ఎఫ్,ఏపిఎస్ఎఫ్.
రాయలసీమ జెండాలతో నిరసన
కర్నూల్ రాయలసీమ యూనిర్శిటీ, ఇక్కడి  రాయలసీమ విశ్వవిద్యాలయం ముఖద్వారం ముందు కేక్ కట్ చేసి రాయలసీమ ఉద్యమ విద్యార్థి నాయకులు ఆంధ్రరాష్ట్ర దినోత్సవం జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్ వియస్ వ్యవస్థాపక అధ్యక్షులు సీమకృష్ణ,ఆర్ విపి రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర,ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు లాజరస్,ఆర్ విపియస్ జిల్లా అధ్యక్షులు అశోక్,ఏపిఎస్ ఎఫ్ ఆర్ యూ కార్యదర్శి మాట్లాడారు.
వైసిపి ప్రభుత్వం అక్టోబర్ 1 ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జెండాలతో వారు నిరసన తెలిాపరు. శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి,వాటిలో హక్కులైనా తుంగభద్ర,కృష్ణ నదులలో నీటి వాటా హక్కు తేల్చాలని,ఆంధ్రకు సరిసమానంగా అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగాలలో సచివాలయం వాట రాయలసీమకు 40% తేల్చాలని గుండ్రేవుల వేదవతి,సిద్దేశ్వరం,సమాంతార కాలువ ప్రాజెక్టులు నిర్మించి రాయలసీమకు న్యాయం చేాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలి

రాయలసీమ హక్కుల ను గౌరవించి, శ్రీ భాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని అక్టోబర్ 1, 2020 న కర్నూలులో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారు ‌.
ఈ సందర్భంగా ఈ డిమాండ్లు చేశారు.
# కర్నూలు లో హై కోర్ట్ ను ప్రారంభించాలి.
# రాయలసీమ లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
# రాయలసీమ కు 400 టీఎంసీల నికరజలాలను కేటాయించాలి.
# రాయలసీమ లో పరిశ్రమలు, జాతీయస్థాయి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ను ఏర్పాటు చేయాలి.
ఈ నిరసన ప్రదర్శనలో కన్వీనర్ కృష్ణయ్య, B C. సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, బజారప్ప, హుస్సేన్ (DTF), వెంకటేశ్వర్లు (CPI ML న్యూ డెమోక్రసీ), వసంత్ ( PYF) జహంగీర్ (SDPI), రమణ ( PDSU) నాగభూషణం ( రాయలసీమ ప్రజా సమితి), రత్నం ఏసేపు (రాయలసీమ విద్యవంతుల వేదిక) గారలు పాల్గొని, ప్రసంగించారు.
ఎమ్మిగనూర్ లో…

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో కూడా నిరసన ప్రదర్శన నిర్వహించబడింది. అక్టోబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినంగా ప్రకించాలని, రాయలసీమ లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పరిశ్రమలను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రాయలసీమ లో ఏర్పాటుచేయాలని, RDS, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టు లను ప్రారంభించాలని రాయల ఉద్యమ కార్యకర్తలు డిమాండ్ చేశఆరు.  సోమప్ప సర్కిల్ నందు నిరసన ప్రదర్శన లో  నాగన్న, జేమ్స్ తదితర నాయకులు పాల్గొన్నారు.