ఒకే కుటుంబం నుంచి నలుగురు సివిల్స్ కొట్టేశారు.వరుసగా మూడేళ్లలో.. అందులో ఒక సంవత్సరంలో ఇద్దరు పాసయ్యారు.
ఒకే కుటుంబం నుంచి నలుగురు ఒకేసారి సివిల్స్ ప్రిపేరయ్యారు. వారంతా ఒకరితర్వాత ఒకరు అంతా సివిల్స్ పాసయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ ప్రతాప్ గడ్ లో జరిగింది. వాళ్లది చాలా చిన్న కుటుంబం. రెండు గదుల ఇంట్లోనే నివసించే వాళ్లు. కుటుంబ పెద్ద, తండ్రి అనిల్ మిశ్రా నిదానంగా ఉద్యగంలో పైకి వచ్చి అక్కడి గ్రామీణబ్యాంకులో మేనేజర్ గాపనిచేస్తున్నాడు. ఈ ఇంటి నుంచి నలుగురు సివిల్స్ రాశారు. కలసి చదువుకున్నారు. స్టడీ మెటీరియల్ పంచుకున్నారు. అనేక విషయాలు కలసి డిబేట్ చేసుకున్నారు. ఎవరు ఎపుడూ నిరుత్సాహపడలేదు. ఒకరిని చూసిఒకరు ఇన్ స్పైర అయ్యారు. ఇందులో ముగ్గురు ఐఎఎస్, మరొక ఐపిఎస్ కుఎంపికయ్యారు.
వీరిలో మొదట యేగేష్ 2013లో సెలెక్ట్ అయ్యాడు. ఆయన సివిల్స్ కు ఎంపిక కావడం ఇంట్లో అందరిని ఉత్సహపరిచింది. అందరికి కల ఒక్కటే సివిల్స్.
అందుకేఅంతాకలసిప్రిపేరవ్వడం మొదలుపెట్టారు. ఇందులో మొదటి చాన్స్ యోగేష్ దక్కడంతో మిగతా వాళ్లందరిలో తాము సాధిస్తామనే ధీమీ పెరిగింది. అంతే, 2014లో ఈ కుటుంబానికి మరొక కల నెరవేరింది.
మరొక సివిల్స్ సక్సెస్ స్టోరీ
సూది మందు చూపు పొగొట్టింది, పట్టుదల సివిల్స్ కు చేర్చింది…
2014 లో సోదరి మాధవి సివిల్స్ కు ఎంపికయింది.ఆమె ఆల్ ఇండియా ర్యాంకు 62 సాధించి ఐఎఎస్ కు ఎంపికయ్యారు. ఆమె ఎకనమిక్స్ లో పిజి చేసింది. ఢిల్లీ జెఎన్ యులో పిహెచ్ డి అడ్మిషన్ తీజుకున్నారు.
నిజానికి మాధవి ఆయేడాది ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (IES) ఆల్ ఇండియా ర్యాంకు 7 సాధించి విజయం సాధించారు.
ఆమె సివిల్స్ లో విజయం సాధించడంతో ఇంట్లోవాతావరణ పూర్తిగా మారిపోయింది. మిగతా ఇద్దరిలో ఉత్సాహం ఇనుమడించింది. ప్రిపరేషన్ తీవ్రం చేశారు.
2015 ఈ కుటుంబానికి మరుపు రాని సంవత్సరం. ఎందుకంటే ఈ ఏడాది మిగతా ఇద్దరు సివిల్స్ కు ఎంపికయ్యారు. ఇందులో ఒకరు లోకేష్(2015 AIR 44). లోకేష్ డిల్లీ ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ చదివినా ఆయన సోదరుడు యోగేష్ లాగా సోషియాలజీ మెయిన్స్ తీసుకున్నాడు.సోదరుడు తయారుచేసిన సోషియాలజీ నోట్స్ తోనే ప్రిపేరయ్యాడు.మొదట అయన స్టేట్ సివిల్ సర్సీస్ లో బ్లాక్ డెవెలప్ మెంటు ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే, లక్ష్యం సివిల్స్ కావడంతో స్టేట్ ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ కు ప్రిపేరయ్యాడు. సెలెక్టయ్యాడు.
రెండో వ్యక్తి అందరికంటే పెద్దదయిన క్షమ.
రెండు వరుసల ఘన విజయాల తర్వాత ఇక్కడ మరొక విశేషం ఉంది. ఈ మధ్యలో పెళ్ళిచేసుకుని వెళ్లిపోయిన క్షమలో కూడా పట్టుదల పెరిగింది. 2015లో ఆమె కూడా సివిల్స్ లో మంచి ర్యాంకు కొట్టేసిందది. ఆమె సాధించిన ర్యాంకు 172. అయితే, ఆది ఆమెకు నాలుగో ప్రయత్నం.
ఇవి కూడా చదవండి
*తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?
*మీ చిన్ననాటి పెన్సిల్ రోజులు గుర్తున్నాయా? అబ్బుర పరిచే 20 పెన్సిల్ వింతలు
నిజానికి ఆమెకు అప్పటికే పెళ్లయి 8 సంవత్సరాలయింది. ఆమెకు సివిల్స రాయాలనే ఆసక్తి ఉందని భర్త (స్టే ట్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగి) కు తెలుసు. అందుకే ఆమె మూడు ప్రయత్నాలలో విఫలమయినా నిరుత్సాహపడలేదాయన. నాలుగో ప్రయత్నానికి ఎంకరేజ్ చేశాడు. ఆమె నాలుగో ప్రయత్నం విజయవంతమయింది (2015 AIR 172). ఆమెఎమ్మెహిందీ లిటరేచర్ చేసింది. అందుకే హిందీనే ఆప్షనల్ గా తీసుకుంది. క్షమ ఐపిఎస్ కు ఎంపికయింది. ఆమెకు కర్నాటక కొడగు జిల్లాలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు.
తన సోదరులంతా పరస్పరం ఇన్ స్పైర్ చేసుకున్నారు. కలసి చదివాం. సాధిస్తామనేనమ్మకంతోనే చివరి దాకా ప్రయత్నించాం. ఇదేది మాకు వంశపారంపర్యంగా రాలేదు. పట్టువదలని శ్రమ తోనే సాధించడం జరిగింది, అని క్షమ కుటుంబ విజయం గురించి ప్రస్తావించినపుడు చెప్పారు.
ఈ వరుస విజయాల గురించి లోకేష్ మిశ్రా Humans of Lbsnaaలో రాశారు. “…the preparation became so much easier because we were all in it together- the hits, the misses, the discussions, study material everything. And the success started coming in”.
ఈ స్టోరీ నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి