మీ చిన్ననాటి పెన్సిల్ రోజులు గుర్తున్నాయా? అబ్బుర పరిచే 20 పెన్సిల్ వింతలు

Ode to the Pencil

To write or literature or to draw for art
This wondrous tool works every part
But beauty comes to behold
This wondrous tool that I hold
That is so much mightier than the pen 
మొదట మనల్ని రాతగాడిగా ప్రపంచానికి పరిచయం చేసేది ఈ పెన్సిల్ ముక్కే. మొట్టమొదట మనవూహలకి అంత ఈజీగా చెరిగిపోని రూపమిచ్చింది ఈ పెన్సిల్ ముక్కే. ఇపుడు మనం ఎక్కడున్నా, ఒక సారి కాళ్ల కిందచూసుకుంటే…మనం పెన్సిల్ మీదే నిలబడి ఉన్నామని తెలుస్తుంది. పెన్సిల్ తో  రాసిరాసి గీసి గీసి రబ్బర్ తో చేరిపేసి, అది పోకపోతే, ఏలితో గెలికేసి, పెన్సిల్ కొసను కొరికి మొట్టిక్కాయలు తిన్న రోజులు గుర్తున్నాయా? ఇది పెన్సిల్ జ్ఞాపకం
(Ahmed Sheriff)
“ఒక పెన్సిల్ లో దాని బయటి వైపు వున్న చెక్క ముక్క ప్రముఖం కాదు. లోపల వున్న గ్రాఫైటే ముఖ్యం. అందుకే నీ లోపల ఏం జరుగుతున్నదో అనే దాని మీదే దృష్టి పెట్టు” –  పాలో కోయోలో
దాదాపు పధ్ధెనిమిది సెంటీమీటర్లు పొడవున్న సన్నటి కడ్డీ లాంటి ఓ రాత పదార్థమూ, ఆ రాత పదార్థం చుట్టు కవచం లా స్థూపా కారం లో ఓ చెక్క   కవరింగూ, ఆ చెక్క ముక్క కు ఓ అందమైన రంగూ వెరసి మన పెన్సిలు.
The Pencil book cover page/ Amazon
మనమెపుడు పెన్సిల్ ను సీరియస్ తీసుకోము. అయితే, అదొక ఇంజినీరింగ్ మార్వెల్ అని  హెన్నీ పట్రోస్కి (Henry Petrosky)అన్నారు. పెట్రోస్కిన్ మనిషి న్యాచురల్ ఇంజనీరింగ్ స్కిల్క్ To Engineer is Human and Beyond Engineering అని పెట్రోస్కీ అద్భుతమయిన పుస్తకం రాశారు. తర్వాత ఆయన పెన్సిల్ లోని ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని గుర్తించి Pencil: The History of Design and Circumstance అని మరొక అద్భుతమయిన పుస్తకంరాశారు. ఈపుస్తకం ప్రకారం 16 వ శతాబ్దం మధ్య లో ఇంగ్లండులో గ్రాఫైట్ ను కనిపెట్టి తవ్వకాలతో వెలితీయడంతో పెన్సిల్ పుట్టింది. గ్రాఫైట్ చక్కగా రాయడం చూసి దానిని రాతకకు ఉపయోగించడం మొదలుపెట్టారు. మనిషి సౌలభ్యం కోసం చెక్క గొట్టంలో గ్రాఫైట్ కడ్డీని దూర్చి పెన్సిల్ తయారయింది కూాాడా గ్రాఫైట్ గనులున్న లేక్ జిల్లాలోలనే ఆని పెట్రోస్కి రాశాడు. అంటే పెన్సిల్ మనకి బ్రిటిష్ వాళ్ల ద్వారా పరిచయయిందన్నమాట.
ఒక సిధ్ధాంతం ప్రకారం పెన్సిల్ అనేది  పెన్సిల్లస్ (pencillus) అనే లాటిన్ పదం నుంచి వచ్చింది అంటారు. పెన్సిల్లస్ అంటే చిన్న తోక అని అర్థం. ఇంకో సిధ్ధాంతం ప్రకారం పెన్సిల్ అనే ది పిన్సెల్ (Pincel) అనే ఫ్రెంచి పదం ద్వారా వచ్చింది అంటారు. పిన్సెల్ అంటే చిన్న పెయింటు బ్రష్ అని అర్థం
పెన్సిలు వాడినప్పుడు ఏదయినా తప్పు జరిగితే దాన్ని సరిదిద్ద వచ్చు. రాసిన దానిని,  గీసిన దానిని తుడిపేసి మళ్లీ రాయ వచ్చు లేదా గీయ వచ్చు. పెన్నులలో ఈ సౌలభ్యం లేదు అందుకే బ్యాంకుల్లొ పెద్ద పెద్ద బ్యాలన్సు షీట్లకీ, చిత్రకారుల చిత్రాలకూ  భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగులకూ, ఈనాటికీ పెన్సిలునే వాడతారు. ఎరేసర్లు కనిపెట్టడానికి ముందు పెన్సిలు తో రాసింది ఏదయినా చెరపడానికి బ్రెడ్డు ని వాడే వారు.
పెన్సిలు లో రాయడానికి వుపయోగించే పదార్థం (పెన్సిలు  చెక్కినపుడు వచ్చే ముక్క)  గ్రాఫైటు అనే పదార్థం తో తయారవుతుంది. గ్రాఫైటు దాదాపు 1500 శతకం మధ్యలో నే కనిపెట్టారు. అప్పట్లో గ్రాఫైటు ని గొర్రెల మీద గుర్తులు వేయడానికి వుపయోగించే వారట. పెన్సిలు లో వున్న ఈ రాత పదార్థాన్ని కోర్  అని వ్యవహరిద్దాం.
కోర్ ను గ్రాఫైటు, బంక మన్ను లాంటి మట్టి (క్లే) కలిపి తయారు చేస్తారు. ఈ రెండింటి మిశ్రమం తో తయారయ్యే కోర్ లో క్లే శాతం ఎక్కువైయితే కోర్ కఠినంగా (లైటు గా) రాస్తుంది అలా కాక గ్రాఫైటు శాతం ఎక్కువయితే అది మెత్తగా (నల్లగా) రాస్తుంది. ఈ శాతాలను బట్టి పెన్సిళ్లను పలు రకాల గ్రేడ్ లలో పెడతారు.
పెన్సిల్ డ్రాయింగ్ credits: morguefile
సాధారణంగా స్కూలు పిల్లలు వాడే పెన్సిలు మీద   HB అని వుంటుంది. దీని అర్థం హార్ద్ బ్లాక్ (Hard, Black) అని. అంటే ఈ రెండు పదార్థాలూ సగం సగం వుంటాయి అన్న మాట. ఇది కఠినంగా రాయదు అలాగే మెత్తగానూ రాయదు. ఈ రకంగా ఏదో ఒక పదార్థపు శాతాన్ని పెంచుకుంటూ పోతే ఈ క్రింది గ్రేడ్ల పెన్సిళ్లు వస్తాయి.  క్లే శాతం పెంచితే అది హార్డ్ గా రాస్తుంది. గ్రాఫైటు శాతం పెంచితే అది మెత్తగా రqఅస్తుంది. ఈ కోర్ ను లెడ్ అని వ్యవహరిస్తారు. చాలా మంది పెన్సిలు లో ని కోర్ లెడ్ (సీసము) తో తయారవుతుంది అనుకుంటారు. సీసం విష పూరితం. పిల్లలు పెన్సిళ్లను నోట్లో పెట్టుకుంటూ వుంటారు. కోర్ ను లెడ్ అని వ్యవహరించినా  అది లెడ్ (సీసము) తో తయారవ్వదు. గ్రాఫైటు, క్లే ల మిశ్రమాలతో నే తయారవుతుంది.
ఒక పెన్సిలు హార్డ్ గారాస్తుందంటే లైటు గా రాస్తుందని అర్థం. అదే సాఫ్టు  పెన్సిలు డార్క్ (నల్లగా) రాస్తుంది. పెన్సిలు ఆర్ట్ వేసే ఆర్టిస్టులకు అన్ని రకాల షేడ్ లు అవసరం. ఈ షేడ్ ల గ్రేడింగు లైట్ నుంచి డార్క్ వైపు ఇలా వుంటాయి.
9H, 8H, 7H, 6H, 5H, 4H, 3H, 2H, H, HB, B, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B, 9B
ఇవి కాక న్యూమరికల్ గ్రేడింగు అంటే కేవలం “2”, “2 1/2”, “3” ఇలా  నంబర్లు మాత్రమే వుంటాయి.
ఇలాగే పెన్సిల్ మీద Bonded Lead అని అక్షరాలుంటాయి. గమనించారా? దీనర్థం ఏంటంటే, గ్రాఫైట్ కడ్డీని పెన్నిల్ కదలకుండా నిలబ్టేందుకు దానికి దానికి పెన్నిల్ గొట్టంలో బాగా అంతికించారు (Bonded) అని అర్థం. అంటే రాసేటపుడు అది కదలడం గాని, విరగడం కాని జరుగదు.
Credits: Morguefile
పెన్సిలు గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు :
*ఒక సుమారైన చెట్టు తో దాదాపు 3,00 000 పెన్సిళ్లను తయారు చేయ వచ్చు.
*ఒక పెన్సిలు తో అది పూర్తిగా అరిగిపోయేంతవరకూ దాదాపు 55 కిలో మీటర్ల పొడవున్న గీత గీయ వచ్చు.
*పెన్సిలు అరిగి పోతుంటే మనం దాన్ని చెక్కుతూ పోతాం .అలా ఒక పెన్సిలు ను దాదాపు 17 సార్లు చెక్క వచ్చు.
*ఒక పెన్సిలు తో సగటు పొడవున్న 45,000 పదాలను రాయ వచ్చు.
*బాల్ పాయింటు పెన్నులు, మామూలు పెన్నులు పని చేయని శూన్య గురుత్వాకర్షణ వద్ద, పెన్సిలు తో రాయ వచ్చు. ఈ రూపేణా ఇది వ్యోమగాములకు వుపయోగం. పెన్సిలు తో నీళ్లలోనూ రాయ వచ్చు.
*మనకు తెలిసిన పెన్సిల్ బ్రాండ్లు అప్సర,కేమ్లిన్లి, కోహినూర్. అయితే కొహినూర్ పెన్సిళ్లు చెకోస్లోవేకియాలో తయారవుతాయి మనకు తెలిసిన పెన్సిల్ బ్రాండ్లు అప్సర,కేమ్లిన్, కోహినూర్. అయితే కొహినూర్ పెన్సిళ్లు చెకోస్లోవేకియాలో తయారవుతాయి.
*ప్రఖ్యాత నవలా రచయితలు ఎర్నెస్ట్ హెమ్మింగ్వే, జాన్ స్టీన్ బెక్ తమ నవలలు రాయడానికి పెన్సిళ్లను వుపయోగించేవారు. జాన్ స్టీన్ బెక్ రోజుకి 60 పెన్సిళ్లను వుపయోగించేవాడట.
*18 కారట్ల బంగారాన్ని, 240 సంవత్సరాల వెనుకటి ఆలివ్ చెక్కను వుపయోగించి  గ్రాఫ్ వాన్ ఫేబర్ కాస్టెల్ (Graf von Faber-Castell)  తయారు చేసిన Perfect పెన్సిలు ప్రపంచం లోనే అతి ఖరీదయినది. దీని ధర దాదాపు 13 000 డాలర్లు.  ఈ కంపెనీ 240  వార్షికోత్సవం గుర్తుగా 2001లో ఈ పెన్సిల్ తయారుచేశారు. ఇది వజ్రాలు పొదిగి చేసిన అద్భుతం.
 గిన్నిస్ రికార్డు ప్రకారం ప్రపంచంలోనే అతి పొడవైన పెన్సిలు 2017 అక్టోబర్ 10న  ఫ్రాన్స్ ( BIC కంపెనీ) లో తయారయింది.  దీని పొడవు 1091.99 మీటర్లు.
*మార్చి 30ని నేషనల్ పెన్సిల్ డే గా జరుపుకుంటారు. ఎందుకో తెలుసా? 1858 మార్చి 30 హైమన్ లిప్ మన్ (Hymen Lipman) కు ఆరోజున పెన్సిల్ చివరకు ఇరేజర్ తొడిగి తయారుచేసేందుకు పేటెంట్ దొరికింది. అంతకు ముందు పెన్సిల్,ఇరేజర్ వేర్వేరుగా ఉండేవి. అందుకేఆ రోజున పెన్సిల్ డే జరుపుకుంటారు.
* రెండో ప్రపంచయుద్ధకాలంలో ఇంగ్లండు కంబర్ ల్యాండ్ పెన్సిల్ కంపెనీ సైనికుల కోసం పెన్సిళ్లు తయారుచేసింది. ఇందులో చివర్లో గ్రాఫైట్ ముక్క ఉంటుంది.లోపల ఒకచిన్న మ్యాప్, కాంపాస్ ఉంటాయి. యుద్ధఖైదీలుగా దొరికినపుడు శత్రుశిబిరాలనుంచి తప్పించుకునేకు ఇవిపనికొచ్చేవి.  చార్లెస్ ఫ్రేజర్ స్మిత్  వీటిని డిజైన్ చేశాడు.వీటిని రాయల్ ఎయిర్ ఫోర్స్ వారికి అందించారు.

Like this story? Share it with a friend!

పెన్సిలు తయారు చేసినవాడు పెన్సిలు తోొ ఒక కథచెబుతాడు.  అంతర్లీనంగా ఇది మనుషులకోసమే.
“నిన్ను ఈ ప్రపంచం లో కి పంపే ముందు నువ్వు తెలుసుకో వలసిన విషయాలు అయిదు వున్నాయి. నిన్ను డబ్బాలో పెట్టే ముందు అవి నీకు చెబుతాను వాటిని గుర్తు పెట్టుకో ఎన్నటికీ మరువకు.
ఒకటి : ఇతరుల చేతుల్లో వుండటానికి ఇష్టపడితే నువ్వు ఎన్నో గొప్ప పనులు చేయ గలవు.
రెండు: తరచూ బాధాకరమైన చెక్కడాన్ని నువ్వు అనుభవిస్తావు. అది నువ్వు మరింత గొప్పగా రాణించడానికి అవసరం
మూడు: నువ్వు చేసే తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం నీకు వుంటుంది
నాలుగు: నీలో అత్యంత ముఖ్యమైన భాగం నీలోపలే వుంటుంది
అయిదు: ఎటువంటి తలం మీద నువ్వు నడిచినా , నీ గుర్తును వదలాలి. ఎటువంటి పరిస్థితిలో నయినా నువ్వు రాస్తూనే వుండాలి
Ahmed Sheriff
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management & Quality