తిరుపతి భూకబ్జాలకు అవినీతికి కారణం ఇదే…: యాక్టివిస్టు నవీన్ రెడ్డి

పవిత్ర తిరుపతి పట్టణంలో భూకబ్జాలకు అక్కడి రెవిన్యూ శాఖలో అండదండలుండటమేనని కాంగ్రెస్ నేత,యాక్టివిస్తు నవీన్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఈ అధికారులు ఇక్కడి రెవిన్యూ కార్యాలయంలో ఎలా పాతకుపోయి పెత్తనం చలాయిస్తున్నారంటే వాళ్లకి 15 సంవత్సరాలుగా బదిలీ కూడా ఉండటం లేదని,ఉన్నా అక్కడక్కేడే నని ఆయన చెబుతున్నారు. దీనికి అవినీతి యే కారణమని చెబుతూ ఇలాంటి జాబితాను తాను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నట్లుఆయన వెల్లడించారు. తిరుపతి అవినీతి గురించి ఆయన ఏంచెబుతున్నారో వినండి

తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొంతమంది గత 10 నుంచి 15 సంవత్సరాలుగా చిన్న స్థాయి ఉద్యోగం నుంచి వివిధ హోదాలలో అటెండర్, సీనియర్ అసిస్టెంట్ లుగా డిప్యూటీ తాసిల్దారులుగా అలాగే తాసిల్దార్లుగా పదోన్నతులు పొందుతున్నారు. వాళ్లకి  బదిలీ ఉండటం లేదు.
ఒక వేళ ఉన్నా, ఆ పేరుతో కేవలం తిరుపతి అర్బన్ నుంచి తిరుపతి రూరల్ కు తిరుపతి రూరల్ నుంచి చంద్రగిరి కి చంద్రగిరి నుంచి రేణిగుంట కి ఇలా 10 కిలోమీటర్ల పరిధిలోనే బదిలీలు జరుగుతున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అండదండలతో కొంతమంది ఇతర జిల్లాలకు కనీసం మదనపల్లి చిత్తూరు లాంటి డివిజన్లకు కూడా బదిలీ కావడం లేదు.
ఇవి కూడా చదవండి
ఒకవేళ బదిలీ అయినా 6 నెలలు లేక సంవత్సరం తిరగకముందే తిరిగి అదే స్థానానికి వస్తున్నారు.
దీనికారణంగా తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక్కసారైనా పని చేయాలని ఎదురు చూస్తున్న ఎంతోమంది రెవెన్యూ ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సీఎం కార్యాలయానికి పంపుతున్నాను!
రెవెన్యూ చట్టం ప్రకారం కనీసం ప్రతి 3 లేక 5 సంవత్సరాలకి అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో సంబంధంలేకుండా అందరికీ సమానంగా బదిలీల ప్రక్రియ జరగాలి రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులు బదిలీలకు అతీతులు కాదు అన్న విషయాన్ని గుర్తించాలి!
తిరుపతి నగర ప్రజల తరఫున గత 5 సంవత్సరాలుగా తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయ పరిధిలో ప్రభుత్వ మరియు ఇనాం భూముల హక్కులపై పేర్ల (NAME &TITLE TRANSFER’S) మార్పిడికి సంబంధించి జరిగిన పూర్తి సమాచారాన్ని “సమాచార హక్కు చట్టం” ద్వారా సేకరించి ఎక్కడైనా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయి ఉంటే అవసరమైతే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తా!
తిరుపతి జిల్లాగా మారిన తర్వాత తిరుపతి పరిసర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయం కోర్టు భవనం ఇతర ప్రభుత్వ శాఖల భవన నిర్మాణాలతో పాటు పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది!!
 తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ప్రభుత్వ ,ఇనామ్ భూముల హక్కు కోసం పేర్ల మార్పిడి లావాదేవీలపై నిఘా వర్గాల ద్వారా వాస్తవ సమాచారం తెప్పించుకొని పరిశీలించండి సీఎం గారు!!
రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాల ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లాగా మారబోతుంది!
 తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక సెంటు భూమి కూడా కబ్జా కానివ్వం అని ప్రకటించిన “తిరుపతి రెవెన్యూ డివిజనల్ ఉన్నతాధికారికి” నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదములు
తిరుపతి,చంద్రగిరి శాసనసభ్యులు(MLA’S) తిరుపతితో పాటు చంద్రగిరి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు కొంత మంది అవినీతి అధికారుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని పద్ధతి మార్చుకోవాలని లేకపోతే వేటు తప్పదు అని ప్రత్యక్షంగా పత్రికాముఖంగా హెచ్చరించడం అభినందనీయం!
 తిరుపతిలో ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు స్పందించకపోతే అసలు ప్రభుత్వ భూమి ఒక సెంటు కూడా లేకుండా పోతుందేమో అన్న భయం నగర ప్రజల్లో కలుగుతుంది!!
 తిరుపతి పరిసర ప్రాంతాలలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ భూములను పంచుతూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేయాల్సిన దుస్థితి వస్తుంది!!
వైయస్సార్ పార్టీ నాయకులు విజయ్ సాయి రెడ్డి ఎంపీ నిన్న వైజాగ్ లో మాట్లాడుతూ ఏ పార్టీ వారైనా సరే ప్రభుత్వ భూములు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆక్రమిస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం శుభపరిణామం అలాగే ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి!!
ప్రభుత్వ భూములు అంటే అది ప్రజల ఆస్తి భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి పౌరుడిపై ఉంది!
( *నవీన్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ నేత,రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు)