ముందు మసీదు, మందిర్ కూల్చివేత మీద న్యాయవిచారణ జరపాలి: కాంగ్రెస్

(G Niranjan )
కూల్చిన చోటే దేవాలయము, మసీదులు నిర్మిస్తామని చేతులు దులుపుకుంటే సరిపోదు- కూల్చివేతకు దారి తీసిన పరిస్తితులపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని శిక్షించాలి.
ముఖ్య మంత్రి కె.సి.ఆర్ వివరణ నమ్మ శక్యముగా లేదు. కప్పిపుచ్చేదిగా ఉంది.
కె.సి.ఆర్ కొందరిని మచ్చిక చేసుకొని తన భాధ్యత నుండి తప్పించుకోలేరు.
విరుచుకుపడే స్వభావమున్న అసదుద్దీన్ ఒవైసీ లాలూచీ పడుతూ కె.సి.ఆర్ కు జీ హుజీరీ చేస్తున్నాడు.
సెక్రటెరియట్ లో ఉన్నంత మాత్రాన ఆ ప్రార్థనా మందిరాలు ప్రభుత్వము సొంతము కాదు, తమకు తోచిన రీతిలో పడగొట్టడానికి.
ప్రజలెవరైనా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రక్కనున్న వారి ఆస్తులకు నష్టము కల్గిస్తే శిక్షించకుండా ఉపేక్షిస్తారా ?
ప్రజలకొక న్యాయము? ప్రభుత్వానికి ఒక న్యాయమా?
కూల్చివేతలు మొదలు పెట్టిన మొదటి రాత్రే ప్రక్కనున్న భవనాలు కూలగొడుతుంటే మట్టి పెళ్లలు పడి శ్రీ నల్లపోచమ్మ ఆలయము మరియు రెండు మసీదులు దెబ్బ తిన్నాయనే వాదన నమ్మశక్యముగా లేదు.
మూడు ప్రార్తనా మందిరాలపై ఒకే సారి మట్టి పెళ్లలు పడే అవకాశము లేదు? ఒక చోట పడినప్పుడు మిగతా రెండు ప్రార్థనా స్థలాలు దెబ్బతిన కుండా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు?
ఆ కూల్చి వేతలో పాల్గొన్న సిబ్బందిని మరియు పర్యవేక్షించిన అధికారులను విచారించారా?
అసలు ఆ ప్రార్థనాస్థలాను యథాతథంగా ఉంచాలనే ఉద్దేశ్యము ప్రభుత్వానికి ఉండేనా? ఉంటే ఆ పరిసరాలలో కూల్చివేతలు చేపట్టేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోవాలని సిబ్బందిని అప్రమత్తము చేసారా?
అసలు ప్రభుత్వము ఉద్దేశ్యపూర్వకముగానే మొదటి రోజు రాత్రే ఆలయాన్ని మసీదులను కూల్చి వేయించిదని స్పష్టమవుతుంది. ప్రజలకు తెలిస్తే వ్యతిరేకిస్తారని ప్రజలకు తెలియక ముందే తామనుకున్న పని పూర్తి చేశారు.
అదే స్థలములో తిరిగి విశాలముగా నిర్మిస్తామన్నా, బోనస్ గా చర్చి నిర్మిస్థామన్నా ప్రభుత్వము తప్పించుకోలేదు.
సాక్షాత్తు సెక్రటెరీయట్ లోనే ప్రార్థనా మందిరాలను రక్షించలేని ప్రభుత్వముపై ప్రజల విశ్వాసము దెబ్బ తిన్నది.
సమగ్ర న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
Niranjan G , Spokesperson,TSPCC
(G.Niranjan,AICC Member,Official Spokes Person
Telangana Pradesh Congress Committee)