బంగారు ఎగుమతుల్తో విపరీతంగా సంపాదిస్తున్న రష్యా

అంతర్జాతీయంగా బంగారు ధరలు విపరీతంగా  పెరుగుతుండటంతో  రష్యాకు స్వర్ణయుగం మొదలయింది. భారీగా బంగారు ఎగుమతులను పెంచి విపరీతంగా రష్యా డబ్బు ఆర్జిస్తుంది. రష్యా చరిత్రలో ఇంతగా బంగారు ఎగుమతులు చేసి డబ్బు గడించిన సందర్భాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు.
రష్యా బంగారు వ్యాపారం ఎంత విపరీతంగా పెరిగిందంటే రష్యాకు ప్రధానంగా రాబడి ఇస్తున్న న్యాచురల్ గ్యాస్ ఎగుమతులను బంగారు ఎగుమతులు మించిపోయాయి.
ఫెడరల్ కస్టమ్స్ సర్వీస్, సెంట్రల్ బ్యాంక్ (సిబిఆర్) విడుదల చేసిన లెక్కల ప్రకారం 2020 ఏడాది ఏప్రిల్ ,మే నెలల్లో రష్యా 65.4 టన్నుల బంగారం అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించింది.దీని వల్ల 3.55 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇదే కాలానికి న్యాచురల్  గ్యాస్ ఎగమతుల వల్ల రష్యాకు గిట్టిన ఆదాయం  కేవలం 2.4 బిలియన్ డాలర్లే. 2020 సెకండ్ క్వార్టర్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతుల వల్ల రాష్యాకు  వచ్చిన రాబడి 3.5 బిలియన్ డాలర్లే.  రెండు నెలల బంగారు ఎగుమతులకంటే తక్కువ. అంటే రష్యాకు భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెడుతున్నది బంగారమే.
ఆధునిక  రష్యాలో ఎపుడూ ఇంతగా రష్యా బంగారును ఎగుమతి చేయలేదు. 1994 నుంచి రష్యా ఎగుమతుల్లో అగ్రస్థానం న్యాచురల్ గ్యాస్ దే. బంగారు ఎగుమతులకు ఎపుడూ ఇంత ప్రాముఖ్యం లేదు.
రష్యా బంగారు ఎగుమతులు  ఏడాదికి  14 శాతం పెరుగుదల చూపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ –మే నెలల్లో రష్యా  247 మిలియన్ డాలర్ల విలువయిన బంగారు ను ఎగుమతి చేసింది. అదే 2020 మొదటి క్వార్టర్ లో 1.4 బిలియన్ డాలర్లకు చేరింది.
గత ఏడాది రష్యా 5.7 బిలియన్ డాలర్ల బంగారం ఎగుమతి చేసింది. దీన్నంతా కొనుగోలు చేసింది ఇంగ్లండు. రష్యానుంచిఇంగ్లండుకు జరుగుతున్న బంగారు ఎగుమతుల్లో పెరుగుదల 12 రెట్లు పెరిగింది. మొత్తం రష్యా ఎగుమతుల్లో బ్రిటన్ కొనుగోలు చేసిందెంతో తెలుసా 93శాతం. అంటే 5.3 బిలియన్ డాలర్ల విలువయిన బంగారాన్ని ఒక్క రష్యాయే కొనుగోలు చేసింది. మిగతా 409 మిలియన్ డాలర్ల బంగారాన్ని కజక్ స్తాన్, స్విజర్లాండ్, వంటి 12 దేశాలు కొన్నాయి.