తిరుపతి మునిసిపాలిటి యూజర్ చార్జీల ఆలోచన మానుకోవాలి: నవీన్ రెడ్డి

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో యూజర్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత కన్వీనర్ రాయలసీమ పోరాట సమితి, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి నగర ప్రజలు,వ్యాపారస్తులు నగర పాలక సంస్థకు సకాలంలో అర్ధ సంవత్సరం ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు అందుకు గాను నగరంలో రోడ్లు కాలువ నిర్మాణాలు, పారిశుద్ధ్యం,మంచినీళ్లు,వీధిలైట్లు నగర ప్రజలకు అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులపై ఉంది. మళ్లీ యూజర్ చార్జీలేమిటి అన్నది ఆయన ప్రశ్న .

కరోనా కారణంగా తిరుపతి నగరంలో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు వ్యాపారాలు లేక వాణిజ్య సముదాయాలకు అద్దెలు చెల్లించలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తుల బాధలు వర్ణణాతీతం.
కరోనా సమయంలో వాణిజ్య సముదాయాలకు వసతి,నివాస గృహాలకు, చేతి వృత్తిదారులు పెరిగిన విద్యుత్ చార్జీలను అప్పులు చేసి చెల్లించారు.
ఇలాంటి సమయంలో చెత్త సేకరించేందుకు  యూజర్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయాలనుకోవడం ఏమిటి ఆయన ఆయన ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన మానుకోవాలని ఆయన కోరుతున్నారు.