20 సంవత్సరాల టిటిడి లెక్కలను కాగ్ చేత ఆడిట్ చేయించాలి: నవీన్ కుమార్ రెడ్డి

(నవీన్ కుమార్ రెడ్డి)
టీటీడీ తీర్మానంలో 2014 నుంచి నేటి వరకు అలాగే రాబోయే రోజులలో కూడా “కాగ్” (C&AG) ద్వారా ఆడిట్ జరగాలని తీర్మానం చేశారు. ఇది అభినందనీయం. ఈ మేరకుఆగస్టు  28న జరిగిన సమావేశంలో  టీటీడీ ట్రస్టు బోర్డు ఈ మేరకు తీర్మానించింది.
ఈ తీర్మానంలో 2014 నుంచి నేటి వరకు  టిడిిడి ఆదాయపు ఖర్చులను కాగ్ తో ఆడిట్ చేయంచడమే కాకుండా రాబోయే రోజులలో కూడా “కాగ్” ద్వారా ఆడిట్ జరపించాలని  పేర్కొన్నారు. మంచిదే. కానీ గత 20 సంవత్సరాలు  టిటిడి లెక్కలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది.  ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా , ఎవరు చైర్మన్ గా ఉన్నా,  ఏ అధికారి ఈవో గా పని  వారి హయాంలో శ్రీవారి నిధులు ఎక్క,  ఎందుకు, ఎలా ఎంత ఖర్చు చేశారనే విషయాలు ప్రజలకు తెలియాలి.  అలాగే గతంలో అమ్మిన శ్రీవారి స్థిర,చరాస్తులు సక్రమంగా విక్రయించారా మిగిలిన ఆస్తులు భద్రంగా ఉన్నాయా లేవా అన్న దానిపై కాగ్ ఆడిట్ జరగాలి వాస్తవాలు భక్తులకు తెలియాలి అనే నేను డిమాండ్ చేస్తున్నాను.
  టిటిడి అమలుచేయాల్సిన మరిన్ని అంశాలు:
1) టిటిడి ని “కాగ్” ;పరిధిలోకి తెచ్చినట్లే,  “సమాచార హక్కు చట్టం”(RTI) పరిధిలోకి తీసుకురండి!!
2) టీటీడీలో సమాచార హక్కు చట్టం శ్రీవారి భక్తుల చేతిలో బ్రహ్మాస్త్రం అవుతుంది.
3) టిటిడి ని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్య స్వామి హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL No 326/2018) ను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా స్పందించి ధర్మకర్తల మండలిలోతీర్మానం ( Resolution No 141 28-8-2020) చేసిన చైర్మన్ సభ్యులకు అభినందనలు.
4)  శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా?? ఉంటే గతంలో ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన శ్రీ రమణ దీక్షితులు, అలాగే ప్రస్తుత రాజ్యసభ సభ్యులు   విజయసాయి రెడ్డి  ఆరోపించిన విధంగా “పింక్” డైమండ్ మాయమయ్యిందా?  లేక టీటీడీకి మూడవసారి మళ్లీ వచ్చిన అధికారి చెప్పిన విధంగా అసలు పింక్ డైమండ్ అనేది లేదా?? అన్న దానిపై స్పష్టంగా కాగ్ ఆడిట్ జరగాలి!
6) శ్రీవారి పింక్ డైమండ్ పై గతంలో మీడియా ముఖంగా మాట్లాడిన రమణ దీక్షితులు గారు విజయ్ సాయి రెడ్డి గారి పై అప్పటి ధర్మకర్తల మండలి చైర్మన్ అలాగే ఇప్పటి ఈవో 200 కోట్ల పరువునష్టం కు సంబంధించి తిరుపతి కోర్టులో ఫీజు కింద కట్టిన శ్రీవారి సొమ్ము 2 కోట్ల రూపాయలపై కాగ్ సమగ్ర ఆడిట్ జరిపి వడ్డీ రూపంలో టిటిడికి జరిగిన నష్టపరిహారాన్ని సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలి!!
7) టీటీడీ లో ఇటీవల ప్రారంభించిన శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చింది ఆ నిధులు ఏ ఖాతాలో జమ చేస్తున్నారు వాటి వివరాలపై కాగ్ ఆడిట్ జరపాలి!!
8) తిరుమలలో టీటీడీ వివిధ మఠంల నిర్మాణాలకు కేటాయించిన స్థల విస్తీర్ణం ఎంత? కేటాయించిన స్థలంలోనే నిర్మాణాలు చేపట్టారా? తద్వారా టీటీడీ కి వస్తున్న అద్దె ఆదాయం ఎంత ?అన్న దానిపై సమగ్రంగా కాగ్ ఆడిట్ జరగాలి!!
9) తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే పరమపవిత్రమైన కానుకలను మంచినీళ్లలా ఖర్చు పెట్టే కొంతమంది అధికారుల గుండెల్లో కాగ్ ఆడిట్ తో దడ ప్రారంభమైంది!!
10) టీటీడీలో కాగ్ ఆడిట్ ద్వారా 6 నెలల్లో వచ్చే నివేదిక ఆధారంగా శ్రీవారి నిధుల వినియోగంలో అవకతవకలు జరిగి ఉంటే సంబంధిత అధికారుల ఆస్తులను జప్తు చేసి శ్రీవారి ఖాతాలో జమ చేయాలి!
11) కాగ్ ఆడిట్ నివేదిక ఇచ్చే ఈ 6 నెలల సమయంలో ప్రస్తుతం టిటిడి లోని ఉన్నతాధికారులు ఎవరు కూడా బదిలీ పై వెళ్లకుండా కాగ్ ఆడిట్ కు సహకరించేలా ప్రభుత్వం వెంటనే స్పెషల్ జీవో ఇవ్వాలి!!
ఓం నమో వెంకటేశాయ గోవిందా
(నవీన్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐఎన్ టియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు)