రాత్రంతా చదివినా పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నారా? కారణం ఇదే…

(Ahmed Sheriff)
ఈ కాలం విద్యార్థులకు పరీక్షల రోజుల్లో రాత్రంతా మేలుకుని, చదివి పరీక్షకు ప్రిపేర్ కావడం అలవాటు. అయితే దీని వల్ల విద్యార్థుల సామర్థ్యం పడిపోతున్నదన్న విషయా వారికి తెలియదు. ఇలాంటి వారి  కంటే  చక్కగా ఆరేడు గంటల  మామూలుగా నిద్రపోయి పరీక్షలు రాసే విద్యర్థుల పర్ఫామెన్స్ బాగుటుంది. వారికి  మార్కులు, రాంకులు/గ్రేడ్లు ఎక్కువ వస్తున్నాయని మానసిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
గత కొద్ది సంవత్సారాలుగా నిద్రకు విద్యార్థుల ఎకడమిక్ పర్ఫామెన్స్ (Academic performance)కు సంబంధం ఉందా అనే విషయం మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.
స్లీప్ కి  ఎకడమిక్ పర్ఫామెన్స్ కు మధ్య సంబంధం ఉందని చాలా అధ్యయాలు వెల్లడించాయి కూడా.   ప్రతి విద్యార్థికీ రోజూ కనీసం 7 గంటల నిద్ర అవసరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
అదీ కాక ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోక పోవటం హానికరమని కూడా ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.ఒకే సమయానికి పడుకొనకపోవడం ఒకే సమయానికి లేవక పోవటం కూడా విద్యార్థుల చదువు మీదా, విషయ సంగ్రహణా (cognitive learning) ప్రక్రియల  మీద చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా,  ప్రతి మనిషికీ ప్రతి రోజూ కనీసం 7 గంటల నిద్ర అవసరం.  ఒక మనిషి , నిద్రకు ఉపయోగించే సమయం, ఆ మనిషి నిద్రపోయే తీరు (sleep pattern) అంటే 24 గంటలలో అతడు ఎన్ని సార్లు నిద్ర పోతాడు ఎంతసేపు నిద్ర పోతాడు అనే విషయాలు ఆ మనిషి మానసిక స్థితి నీ, శారీరక ఆరోగ్యాన్నీ, అతడి మెదడు పని చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.
ఈ విషయాలను విద్యార్థులకు అన్వయిస్తే అవి ఆ విద్యార్థి చదువు పై,  పరీక్షల్లో అతడి వుత్పాదకత పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ కాలం విద్యార్థులకు పరీక్ష రోజుల్లో రాత్రంతా మేలుకుని, చదివి పరీక్షలు రాయడం అలవాటు. దీని వల్ల విద్యార్థుల వుత్పాదకత తగ్గి పోయి, వీరు అలా మేలుకోకుండా మామూలుగా నిద్రపోయి పరీక్షలు రాసే విద్యర్థులకంటే తక్కు వ మార్కులు, రాంకులు/గ్రేడ్లు పొందుతారని మానసిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. గత కొద్ది సంవత్సారాలుగా ఈ విషయాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి విద్యార్థికీ రోజూ కనీసం 7 గంటల నిద్ర అవసరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.  అదీ కాక ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోక పోవటం, ఒకే సమయానికి లేవక పోవటం కూడా విద్యార్థుల చదువు మీదా, విషయ సంగ్రహణా (cognitive learning) ప్రక్రియల  మీద ప్రభావాన్ని చూపుతాయి.
జసెప్పే క్యూర్ చో (Guiseppe Curcio) నేతృత్వంలో మరొక శాస్త్రవేత్తల బృందం నిద్రకు, విద్యార్థుల గ్రాహక శక్తికి ఉన్న సంబంధం మీద పరిశోధనలుచేసి పలు ఆసక్తికరమయిన అంశాలను ధృవీకరించింది.
ఇందులో రెండింటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను. నిద్రలేమి వల్ల నేర్చుకునే శక్తే కాదు, వాటిని వ్యక్తీకరించడం కూడ సన్నగిల్లుతుంది. ( Sleep loss is associated with poor declarative and procedural learning in students),  చదువుతున్నపుడు,అది తలకెక్కడం అనేది ఆ సయమంలో మీరు నిద్రని అణచుకున్నారా లేక కావలసినంత నిద్రపోయారా అనేదాని మీద ఆధారపడి  ఉంటుంది. (studies in which sleep was actively restricted or optimized showed, respectively, a worsening and an improvement in neurocognitive and academic performance).
1950 దశకానికి ముందు మనిషి మీద నిద్ర ప్రభావం ఎలా వుంటుంది అనే దిశలో ఎక్కువ పరిశోధనలు జరగలేదు. ఎక్కువ సమాచారం సేకరింప బడలేదు. అప్పుడు నిద్రపోయే మనిషి లో శరీరం, మెదడు నిద్రాణమై వుంటాయని, అవి ఏ పనీ చేయవనీ అనుకునేవారు.
ఒక మనిషి  నిద్రకు వుపయోగించే సమయం  అతడి ఆయువులో సగటుగా మూడో వంతు వుంటుంది. అంటే 90 సంవత్సరాలు జీవించే మనిష్ దాదాపు 30 సంవత్సరాలు నిద్రపోతాడన్న మాట. ఈ 30 సంవత్సారాలు అతడి వుత్పాదకత శూన్యమనీ, ఇది వ్యర్థంగా పోయే  సమయమనీ అనుకునే వారు. ఆ తరువాత ఈ దిశలో పరిశోధనలు ముమ్మరమయ్యాయి. చాలా కొత్త (ఆశ్చర్య కరామైనవి కూడా) విషయాలు వెలుగు చూసాయి.
జాన్స్ హాప్కిన్స్ న్యూరాలజిస్ట్ (Neurologist) మార్క్ ఊ (Mark Wu) ప్రకారం మనిషి నిద్ర పోయే సమయం లో అతడి మెదడు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటుంది.ఈ అద్బుతాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచేంది.
అది  మంచి జీవితానికి పనికి వచ్చే అనేక మైన పనుల్ని చక్క బెట్టడం లో మునిగి వుంటుందని డా.ఊ చెప్పారు.

Sleep is a period during which the brain is engaged in a number of activities necessary to life- which are closely linked to the quality of life: Dr Mark Wu

పరిశొధనల ద్వారా తేలిన విషయమేమిటంటే, మనజ్ఞాపక శక్తిని గట్టి పరచడానికి నిద్ర ముఖ్యావసరం. నిద్ర లేమి వల్ల ఏదయినా విషయం చదువుతున్నా దాని మీద ఏకాగ్రత వుండదు. ఏకాగ్రత లోపించి అంతంత మాత్రంగా చదివిన విషయాన్ని మన మెదడు అనవసర విషయంగా పరిగణించ వచ్చు. దానిని ముఖ్యమైన విషయాల నుంచి వేరు పరచి తక్కువ ప్రాముఖ్యత గల విషయాల జాబితాలో చేర్చ వచ్చు   మనం నిద్ర పోతున్నపుడు మన మెదడు పనిచేస్తూ ఆరోజు మనం నేర్చుకున్న విషయాల్లో ఏవి వుంచాలి? ఏవి తీసేయ్యలి? అనే నిర్ణయం తీసుకుంటూ దాన్ని అమలు చేస్తూ వుంటంది. అంటే మన మెదడు లోని నాడీ వ్యవస్థలో అవసరమైన సంబంధాల్ని వుంచి అనవసరమైన వాటిని కత్తిరిస్తూ మన జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది.
మనం ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ లోనే దాని మెమరీ సర్దుబాట్లు చేయడానికి అనవసరమైన వీడియోలూ, పాటలు వగైరా తీసేస్తూ వుంటాం. మనిషి మెదడు కూడా మనిషి కున్న మెమరీ ని కట్టుదిట్టం చేసే పనిలో వుంటుంది. అది షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ లను సర్వదా నిర్వహిస్తూ వుండాలి. ఒక చిన్న సెల్ ఫొనూ మెమరీ ని సర్ద డానికి మనం ఎంత హైరానా పడ్తాం.
2010 లో ప్రచురించిన ఒక అంచనా ప్రకారం మనిషి మెదడు 2.5  పెటా బైట్ ల జ్ఞాపక శక్తి (మెమరీ) ని కలిగివుంటుంది. ఒక బైట్ అంటే ఒక అక్షరం అనుకుందాం. ఒక పెటా బైటు అంటే “1000,000,000,000,000” బైట్లు. దీన్ని ఒక స్మార్ట్ ఫోన్ మెమరీ తో పోల్చిచూద్దాం. ఉదాహరణకి ఒక ఫోన్ మెమరీ 8 జి.బి. అనుకుందాం. షుమారుగా ఇటువంటి 3,000,000 ఫోన్లు ఎంత జ్ఞాపకశక్తిని కలిగి వుంటాయో మనిషి  మెదడు అంత జ్ఞాపక శక్తి కలిగి వుంటుంది. మరి మన మెదడుకు మనం అది పని చేసేవిధానం లో సహకరించాలి కదా?
నిద్ర దాని తీరు తెన్నులు :
ఒక రోజులో మన శరీరం  ఆకలి మీద అంతర్గతంగా కోరిక పెంచుకుంటుంది. ఇది పెరిగి పెరిగి ఒక స్థాయి కి వచ్చే సరికి మనం ఆకలి తీర్చు కోవాలి. అలాగే నిద్ర కూడా వృధ్ధి చెందుతూ పోతుంది. ఒక స్థాయి వచ్చేటప్పటికి మన శరీరం నిద్రను కోరుకుంటుంది. అయితే శరీరానికి సంబంధించినంత వరకూ ఆకలికీ, నిద్రకూ మధ్య ఇక్కడొక వ్యత్యాసం వుంది.
ఆకలి మన శరీరాన్ని శాసించలేదు. అంటే  ఏదయినా తినమని మన శరీరాన్ని బలవంతం చేయలేదు. కాని నిద్ర విషయం లో అలా కాదు. నిద్ర వచ్చిందంటే ఆ నిద్ర మన శరీరాన్ని నిద్రపోవడానికి బలవంత పెడుతుంది. అందుకే మనం నిద్రను ఆపుకోలేం. బాగా అలసి ఫోయిన రోజు శరీరం నిద్రను కోరుకుంటూ వుంటే మనం పాఠాలు వింటున్నా, ఏదయినా సభలో కూర్చుని వున్నా కళ్లు మూతలు పడుతూ వుంటాయి. మనకు తెలీకుండానే స్వల్ప కాల వ్యవధుల్లో మనం నిద్రా, మెళకువల మధ్య కునికి పాట్లు పడుతూ వుంటాం. రాత్రిళ్లు వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా వుండవలసింది ఈ విషయం లోనే. ఇదేకాక పగలు నిద్ర పోవాలనె కోరికతో మనం ఓ అరగంట నిద్ర పోతే,  రాత్రంతా   నిద్ర లేకుండా  పోయే ప్రమాదం వుంది.
ఈ సమయం లోనే మన మెదడు, (జ్ఞాపక శక్తి కి సంబంధిన అల్జీమర్సు వ్యాధిని కలుపుకుని), మనకు హాని కలిగించే విషాలను (టాక్సిన్లు) తొలగిస్తూ, మెదడు కణాలను  శుభ్రపరుస్తుంది. మనిషి నిద్ర పోతున్న  సమయం లో మెదడు కణాల మధ్య వున్న స్థలం వ్యాకోచిస్తుంది. అప్పుడు అక్కడ వున్న అనవసరమైన పదార్థాన్ని శుభ్రం చేయడం సులభ మవుతుంది.
విషయాలు నేర్చుకోవడం, చదవడం  ద్వారా జ్ఞాన సమాచారాన్ని సేకరించడం, అర్థం చేసుకోవడం, జ్ఞాపక శక్తి లో నిలువ చేసుకోవడం, అవసరమైనప్పుడు గుర్తు చేసుకోవడం  వగైరా కాగ్నిటివ్ స్కిల్స్ మీద నిద్ర లేమి ప్రభావం చాలా వుంటుంది..
అంతే కాక మల్టి టాస్కింగ్ (ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడం) సామర్థ్యం మీద నిద్రలేకపోడం అన్నది చాలా ప్రభావం చూపుతుంది. కారు నడపడం అన్నది  మల్టి టాస్కింగ్ (multi-tasking) కు ఉదాహరణగా తీసుకోవచ్చు. రాత్రి సరిగ్గా నిద్ర పోని వ్యక్తి మరుసటి రోజు, కారును సమర్థవంతంగా నడపలేడు. అలాగే ఏకాగ్రత మీద కూడా దీని ప్రభావం వుంటుంది.
నిద్ర లేమి సృజనాత్మకత ను తగ్గిస్తుంది. థింకింగ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ క్షమత కు అవరోధం అవుతుంది. నిద్ర లేక పోవడం అన్నది అనారొగ్యానికి దారి తీస్తుంది. దయాబెటిస్, హై బి.పి. లాంటి వాటి ని కలిగిస్తుంది. అంతే కాదు డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతల్ని కలిగిస్తుంది. ఈ నాటి విద్యార్థులకు  పరీక్షలు వచ్చేంతవరకు చడువును అంతగా పట్టించుకోకుండా, తీరా పరీక్షలు వచ్చాక టెన్షన్  పెంచుకుని పరీక్ష ముందు రోజు రాత్రంతా మేలుకొని చదవడం అలవాటు. దీన్నే స్టూడెంట్ సిండ్రోం అని కూడా అంటారు.
 నిద్ర పోతున్నప్పుడు మెదడు ఏం చేస్తుంది ?
మనిషి నిద్ర పోతున్నంత సేపు మెదడు రెండు రకాల నిద్రల మధ్య తిరుగాడుతుంది.  మొదటి రకపు నిద్ర ను గాఢ నిద్ర, రెండో రకపు నిద్రను కలల నిద్ర అనొచ్చు.మొదటి రకపు నిద్ర నాలుగు దశల్లో సాగుతుంది. మొదటి దశ మేలుకుని వుండటం నుంచి మెల్లగా నిద్ర లో కి జారుకోవడం. రెండొ దశ తేలిక పాటి నిద్ర. ఈ సమయం లో గుండె లయ, శ్వాస సర్దుకుంటాయి. శరీర వుష్ణోగ్రత తగ్గి పోతుంది. మూడూ, నాలుగు దశల్లో గాఢ నిద్ర పడుతుంది .
రెండొ రకం నిద్ర రాపిడ్ ఐ మూవ్ మెంట్ (REM) నిద్ర. ఈ సమయం లో మూసి వున్న కనుల వెనుక కను గుడ్లు వేగంగా కదులుతుంటాయి, శ్వాస తీవ్ర త పెరుగుతుంది. మెదడు నుంచి జనించే తరంగాలు మనిషి మెల్కోని ఉన్నప్పుడు ఎలా వుంటాయో అలాగే వుంటాయి. శరీరం తాత్కాలిక పక్షవాతానికి  లోనవుతుంది. నిద్ర పోతున్నత సేపు మెదడు పని చేసే తీరు ఈ రెందూ రకాల నిద్రల మధ్య తిరుగాడుతుంది. ఇది ప్రతి నిద్రా సమయం లో 4  నుంచి 5 సార్లు జరగ వచ్చు. అయితే మొదటి రకం నిద్రలో చెప్ప్పిన 3, 4  స్థాయిల నిద్రా సమయం తగ్గి పోతూ  వస్తుంది
అయితే ఈ విషయం లో రాత్రంతా మేల్కొని చదివే విద్యార్థులు అలా చదవకుండా మామూలుగా నిద్ర పోయె విద్యార్థుల గురించి “వాళ్లు ఆ పాటికె చదువుకుని ఉంటారు అందుకే నిద్ర పోవచ్చు. అంతే కాని అలా నిద్ర పోయినందు వల్ల వాళ్లకు ఎక్కు వ మార్కులు వచ్చాయని చెప్పలేం” అనొచ్చు.
కానీ నిద్ర గురించి జరిగిన మిగతా పరిశొధనల్లో, మనుషులు నిద్ర పోయేటప్పుడు మెదడు పని తీరు తెలూసుకున్న తరువాత,  మిగతా సమాచారం ప్రకారం విద్యార్థుల జ్ఞాపక శక్తి,,  ఏకాగ్రత, పరీక్షలలో విషయాలను  గుర్తుకు తెచ్చుకోవడం అనేవి నిద్ర తో ఎలా కూడి వూన్నయో మనం చర్చించాం. ఇవి కాక సరిగ్గా నిద్ర లేక పోవడం వల్ల మరుసటి రోజు నిద్ర మత్తు గా వుండటం, ఏకాగ్రత లోపించడం, శారీరక అరోగ్యం దెబ్బ తినడం, stress, వంటి సమస్యలు తలెత్తు తాయి. ఎటొచ్చీ విద్యార్థులు తగినంత నిద్ర తగిన సమయం లోనె పొందడం వల్ల    వారి విద్యార్థి జీవితం ప్రశాంతంగానూ, ఫల ప్రదంగానూ వుంటుందనడం లో సందేహం లేదు .
.
Ahmed Sheriff
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)