చైనాలో ఆహార సంక్షోభం, ప్రజల దృష్టి మళ్లించేందుకే భారత్ తో చైనా గొడవ ?

పదకొండు సంవత్సరాల కిందట 2008లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బు ష్ ఒక వివాదాస్పదమయిన ప్రకటన చేశారు. ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో,  ఆహారం ధరలు పెరిగిపోయేందుకు కారణం అభివృద్ది చెందుతున్న రెండు పెద్ద దేశాలు భారత్, చైనా లు విపరీతంగా తింటూండటమే అన్నారు.
అప్పటి యుఎస్ స్టే ట్ సెక్రెటరీ కొండలీజా రైస్ , బుష్ ఇద్దరు కలసి భారత్, చైనాల మీద ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దీనికి భారత్ చైనాలు అభ్యంతరం చెప్పాయి.
మిస్సోరీ లో ఒక చర్చలో పాల్గొంటూ దీనికి బుస్ సమర్థన కూడా ఇచ్చారు. ఇండియాలో మధ్య తరగతి జనాభా 350 మిలియన్లకు చేరుకుంది. అంటే అమెరికా మొత్తం జనాభాతో ఇది సమానం. వీళ్లందరి ఆదాయం బాగా పెరిగింది. అది మంచిదే. ఆదాయం పెరిగితే ఆహారం డిమాండ్ పెరుగుతుంది. వాళ్లకి మంచి ఆహారం కావాలి. మేలైన ఆహారంకావాలి. ఒక అమెరికా సైజు దేశానికి అదనపు ఆహారం సరఫరా చేసినపుడు ఏమవుతుంది? ‘ When you start getting wealth, you start demanding better nutrition and better food, so demand is high, and that causes the prices to go up,” అని అన్నారు.
కోండలిజా రైస్ చైనా గురించి దాదాపు ఇవే మాటలన్నారు.
 ఇది నిజమా!
ఇపుడు  చైనా ఆహారసమస్య ఎదుర్కొంటూ ఉందని చెబుతున్నారు.  ఈసమస్యను ఎదుర్కొనేందుకు చైనా కొత్త నినాదం ఇచ్చింది.
దాని పేరు ‘క్లీన్ ప్లేట్ క్యాంపెయిన్’ (Clean Plate Campaign). కోవిడ్ సంక్షోభం, తీవ్రమయిన వరదల తర్వాత చైనా ఎదుర్కొంటున్న మరొక ఉపద్రవం ఆహారం కొరత.  ప్రజలలో ఆహార భద్రత గురించిన చైతన్యం కల్గించేందుకు  ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టినట్లు చైనా అధ్యక్షడు జి జిన్ పింగ్ చెప్పారు. ఇది 1960 దశకంలో అప్పటి చైనా ఛెయిర్మన్  మావో కూడా ఇలాంటి క్యాంపెయిన్ మొదలుపెట్టి విమర్శలు పాలయ్యారని, ఇపు డు జీ జిన్ పింగ్ కూడా అదే దారి పట్టారని కొంతమంది విమర్శిస్తున్నారు.
నిజానికి ఈ తరహా క్యాంపెయిన్ ఎపుడో 2013 లోనే ’క్లీన్ యువర్ ప్లేట్ క్యాంపెయిన్’ (Clean your plate campaign) రూపంలో  వచ్చింది.కాకపోతే, అపుడు ప్రభుత్వాలు ఇచ్చే విలాసవంతమయిన విందుల మీద ఈ క్యాంపెయిన్ గురిపెట్టారు. ఇపుడు జి పిలునిచ్చింది  దాని 2.0 నూతన  రూపం. ప్రభుత్వాధికారులే కాదు ప్రజలు కూడా మితాహారం నియమాలు పాటించాలని  క్లీన్ ప్లేట్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దీనిని చాలా కఠినంగా అమలుచేస్తున్నారు. ఎంతకఠినంగా అంటె, సాధారణంగా కస్టమర్లు ఎక్కువ తినాలని కోరుకునే రెస్టరాంట్లు , చైనాలోఇపుడు అంత తినొద్దు, తక్కువ తినండి, వేస్టు చేయవద్దు అని సలహా లిస్తున్నాయి.
బుష్ చెప్పినట్లు చైనాలో మిడిల్ క్లాస్ ప్రజలు తెగ తినేస్తున్నారని  అక్కడి ప్రభుత్వమే ఈ క్యాంపెయినతో అంగీకరించినట్లయింది.
ఈ జల్సాతో చాలా ఆహారం వేస్ట్ అవుతూ ఉంది. ఈ క్యాంపెయిన్ మొదటి ఉద్దేశం ‘తినండి, ప్లేట్ క్లీన్ చేయండి,  అంతేకాని ఆహారాన్నిమిగిలించి పడేయవద్దు’ (Don’t waste food)  అనేదే.
దీనితో హాటళ్లు, క్యాటరర్స్ అసోసియేషన్ లు దేశాధ్యక్షుడిని పిలుపును అమలుచేయడం మొదలుపెట్టాయి. పాండెమిక్ కాలంలో అంతర్జాతీయ ఆహార సమస్య రాకుండా ఉండేందుకు చైనా అధ్యక్షుడు ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని  చైనాలో మితి మీరిన ఆహారం వృధాని తగ్గించాలనే సదుద్దేశమేదీనివెనక ఉందని  అని చైనా అధికారులు అంటున్నారు.
చైనా జనాభా 1.4 బిలియన్ . ఇంత జనాభా పూటకొక ముద్ద ఆహారాన్ని  వేస్టు చేసినా ఎంత అహారమవుతుందో వూహించవచ్చు.
ఒక అంచనా ప్రకారం చైనాలో ప్రతియేటా వేస్టు చేస్తున్న ఆహారం 30 నుంచి 50 మిలియన్ల జనాభా కడుపు నింపవచ్చు.
దీనిని నివారించేందకు కఠినంగా నియమాలు అమలుచేస్తున్నారని అధికారులు అంటున్నారు. చెడామడా తినేస్తున్న విందులను లైవ్ స్ట్రీమ్ చేయాలని విందుచేసుకునే వారికి, రెస్టరెంట్లకు ఆదేశాలి చ్ఛారు. విద్యార్థులు తినేవిధానాన్ని మానిటర్ చేస్తూ వృధా చేస్తున్నవారి స్కాలర్ షిప్ లు రద్దు చేస్తున్నారు.
ఆహరం విషయంలో మితం పాటించండి, ఆహారం వృధాచేయడం సిగ్గుపడాల్సిన విషయం అనే సంస్కృతి  దేశంలో సృష్టించాలని జి జిన్ పింగ్ చెప్పారు.
‘cultivate thrifty habits and foster a social environment where waste is shameful and thriftiness is applaudable,” అని దేశాధ్యక్షుడు పిలుపునిచ్చారు.
అయితే, దీనికి అంతర్జాతీయంగా చైనాకు ఎదురవుతున్న వ్యతిరేక వాతావరణం  కారణమని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
ఇటీవల అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాదేశాలతో చైనాకు విబేధాలొచ్చాయి. ఈ దేశాలే చైనా ప్రధానంగా ఆహారం సరఫరాచేసేవి. ఈ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, అమెరికా అధ్యక్షుడు ట్రంపు వాణిజ్య ఆంక్షలు విధించడంతో ఆహార సరఫరా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనితో పాటు ఇటీవల వచ్చిన వరదలో సంభవించిన నష్టమూ తోడయింది.వీటన్నింటి వల్ల చైనా స్వావలంభన గురించి ఆలోచించాల్సిన ఎమర్జన్సీ వచ్చిందనే విషయాన్ని జి జిన్ పింగ్ నినాదం చెబుతుందని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
 అతిధులు వచ్చినపుడు దండిగా వంటలు చేయడం,భారీగా వడ్డించడం  భారత్ లో లాగానే చైనాలో కూడా హోదాకుసంబంధించిన సంప్రదాయం. ఇదొక స్టేటస్ సింబల్ కావడం వల్ల  చుట్టాలకు ,స్నేహితులకు, క్లయింట్లకు ఇచ్చే  విలాసం వంతమయిన విందులీయడం గౌరవప్రదమయినందని ఇక్కడడబ్బున్నోళ్లు భావిస్తారు. అది విందు ఇస్తున్న వారి అతిథ్య హృదయానికి, ఉదారగుణానికి సంకేతంగా చూస్తారు. విందుల్లో విపరీతంగా వంటలు చేసినపుడు వృధా ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి భోగలాలసత్వం వల్ల ఏటా చైనాలో 17 నుంచి 18 మిలియన్ టన్నుల దాకా ఆహారం వృధా అవుతున్నది. ఇలా ఆబగా తినడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరిక చేయడం కోసేం జి క్లీన్ ప్లేట్ క్యాంపెయి న్ మొదలుపెట్టారని  చైనాలో  చెబుతున్నారు. దీనిని అమలు చేయడం ఒక సవాల్ గా మారింది చైనాలో.
మితంగా తినడం, లేదా పొదుపుగా ఉండటం అనేది లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవనశైలి, మాల్స్ కు అలవాటుప డ్డ    నేటి మాడరన్  చైనాలో జరిగే పనికాదు. ఇలాంటి జీవితం ఎపు డో మావో జెడాంగ్ కాలంలో ఉండేది. ఆరోజుల్లో ప్రజలు రెండుసార్లే భోజనం చేయాలని, ఇందులో ఒకటి కచ్చితంగా మెత్తటి లేదా ద్రవరూపంలో ఉండాలని  చైనా కమ్యూనిస్టుపార్టీ  ప్రజలను కోరింది. ఆపుడు ఆహార సమస్య బాగా ఉండేది, కొరత తీవ్రంగా ఉండేది. చాలా మందికి ఆహారం దొరికేది కాదు. ఇపుడు పరిస్థితి తలకిందులయింది. చైనాలో ఆహారం కొరత లేదు. విదేశాలనుంచి భారీగా దిగుమతిచేసుకునే శక్తి వచ్చంది. అయితే, అంతే జోరుగా  పళ్లేల నుంచి మిగిలిపోయిన ఆహారాన్ని పడేస్తున్నారు.
చైనా రాజధాని బీజింగ్ లో బాగా పేరున్న డక్ రోస్ట రెస్ట్ రెంట్ Quanjude Roast Duck Restaurant కస్టమర్లకు ‘ ఎంత తిన గలరో అంతే తెప్పించుకోండి,’అని సలహా ఇస్తూ ఉంది. జి జిన్ పింగ్ ‘క్లీన్ ప్లేట్ క్యాంపెయిన్ ’  పిలుపు తర్వాత దేశంలో  పేరున్న రెస్టరాంట్లన్నీ కస్టమర్లకు ఈ సలహా ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇపుడు స్వాంజుడే రెస్టరెంటు ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టింది.
 ముంచ్కొస్తున్న ఆహార సమస్యనుంచి ప్రజల దృష్టిమళ్లించేందుకే చైనా ఇపుడు లదాక్ ప్రాంతంలో భారత్ తో సరిహద్దు ఉద్రిక్తత పెంచుతూ ఉందని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. 1962లో భారత్ మీద చైనా దాడిచేయడం వెనక నాటి మావోజెడాండ్  ప్రభుత్వం వైఫల్యం ఉందని, అపుడు ఆయన తీసుకు వచ్చిన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ (Great Leap Forward) విఫలం కావడంతో దానినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చైనాభారత్ యుద్ధానికి తలపడిందని, ఇపుడూ అలాంటి సాహసమే చేస్తున్నదని హిందూస్తాన్ టైమ్స్ లో ఒకవిశ్లేషణ వచ్చింది.
అయితే, చైనా అధికార వెబ్ సైట్ గ్లోబల్ టైమ్స్ దీనిని  మీడియా ప్రచారంగా కొట్టి పడేసింది. పాండెమిక్, ఇటీవలి దక్షిణ చైనా వరదలు, అమెరికాతో వాణిజ్య తగాదాలవల్ల తగ్గిపోయిన ఆహార దిగుమతులు చైనా ఆహార సంక్షోభం వస్తూ ఉందనేది కేవలం మీడియా ప్రచారమే. ఈ  అంశాలుచైనాలో ఆహార  సంక్షోభం సృష్టించలేవని, క్లీన్ ప్లేట్ క్యాంపెయిన్ కేవలం  ఆహారం వృధాకాకుండా నివారించేందుకే నని గ్లోబల్ టైమ్స్ రాసింది.

“Despite media hype that China is in a looming food crisis, which is worsened by the epidemic, floods in southern China, food imports, Chinese agriculturist said that the above factors will not lead to a food crisis in China, but that wasting food is an issue that deserves more attention.” Source: Global Times