ఇండియా ఫస్ట్ మహిళా కార్డియాలజిస్టు, వందేళ్ల డా. పద్మావతి కరోనాతో మృతి

భారతదేశంలో మొట్టమొదటి మహిళా హృద్రోగ నిపుణురాలు (cardiologist) డాక్టర శివరామకృష్ణన్ అయ్యర్ పద్మావతి నిన్న చనిపోయారు.
ఆమె వయసులు 101 సంవత్సరాలు.
డాక్టర్ పద్మావతి భారతదేశంలో మొదమొదటి కార్డియాలజిస్ట్. డాక్టర్ గా సేవలందిస్తూనే గుండె జబ్బుల  (heart diseases) గురించి ప్రజలలలో చైతన్యం తీసుకురావడానికి క్యాంపెయిన్ చేపట్టి తీవ్రంగా కృషి చేశారు.భారత హృద్రోగ చికిత్స చరిత్రలో ఆమె చాలా అంశాల్లో నెంబర్ వన్ గా నిలుస్తారు.
101 సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా బతకారంటే,  ఆమె ఎన్ని సమస్యలతో  వీరోచితంగా పోరాడి గెలిచి ఉంటారో ఊహించుకోవచ్చు.
ఎక్కువ కాలం బతకడం కేవలం ఆరోగ్యానికి సంబంధించే కాదు, మనుసుకు సంబంధించింది కూడా. శారీరక,మానసిక సమస్యలతో నెగ్గి నూరేళ్లు దాటినా ఆమె ఉల్లాసంగానే ఉన్నారు. వైద్య సేవలందిస్తూనే వచ్చారు.  అయితే, డాక్టర్ పద్మావతి కోవిడ్ ను జయించలేకపోయారు. చివరకు తను స్థాపించిన ప్రతిష్టాత్మక హృద్రోగ చికిత్స సంస్థ National Heart Institute లోనే చనిపోయారు.

 

పదకొండు రోజుల కిందట ఆమెను నేషనల్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ (NHI)లో చేర్పించారు. కరోనా వల్ల ఆమె ఊపిరితిత్తులకు తీవ్రంగా ఇన్ ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సమస్యతోనే ఆమె నిన్న చనిపోయారు. న్యూఢిల్లీ పంజాబీ బాగ్ స్మశానవాటికలో ఆమెకు అంత్య క్రియలు నిర్వహించారు.

 

 అయితే, ఆమె ఎన్ హెచ్ ఐ లో చేరే దాకా ఉల్లాసంగా ఉండేవారు.కరోనా సోకకుండా ఉండి ఉంటే,  ఆమె వాళ్ల అమ్మమ్మ  రికార్డు బద్దులు కొట్టేవారేమో. వాళ్ల అమ్మమ్మ 108 సంవత్సరాలు జీవించినట్లు ఆమెయే ఒక సారి చెప్పారు.
2015 దాకా ఆమె వైద్య సేవలందిస్తూనే వచ్చారని ఎన్ హెచ్  ఐ  సిఇవొ డాక్టర్ ఒపి యాదవ్ చెప్పారు.
“ఇదేఇన్ స్టిట్యూట్ లో రోజుకు 12 గంటలు, వారానికి ఐదురోజులు పనిచేస్తూ వచ్చారు.  ఈ ఇన్ స్టిట్యూట్ ను ఆమె 1981లో స్థాపించారు.
National Heart Institute, New Delhi
హృద్రోగ చికిత్సకు ఆమె ఎంతగా అంకితమయి పనిచేశారంటే ఆమెకు  హృదయశాస్త్ర మాతృదేవత (God-mother of Cardiology) అని పేరు వచ్చింది,” అని డాక్టర్ యాదవ్ చెప్పారు.

డాక్టర్ పద్మావతి బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న బర్మాలో ఇర్రవడ్డీ నది ఒడ్డున ఉన్న మాగ్వే (Magwe) పట్టణంలో 1919లో   జన్మించారు.  బర్మా 1937లో స్వతంత్రదేశమయింది. తండ్రి అపుడు అక్కడొకపెద్ద లాయర్.  బర్మాలో ఉంటున్నందన రంగూన్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎప్ చదివారు.  అక్కడ  ఉన్నత శ్రేణిలో నెంబర్ వన్ గా పాసవడమే కాదు, రంగూన్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబిబిఎస్ చదివిని మొదటి మహిళకూడా అయ్యారు.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జపాన్ బర్మాను ఆక్రమించింది. అపుడుతల్లి, సోదరుడు నలుగురు చెల్లెళ్లతో కలసి భారతదేశానికి ఉన్న చివరి విమాన సర్వీసులో తమిళనాడులోని కొయంబత్తూరుకు తిరిగి వచ్చేశారు. ఆమె తండ్రి అక్కడే ఉండిపోయారు.
పద్మావతి పూర్వీకులు కొయంబత్తూరు సమీపంలోని గొపిచెట్టి పాళ్యం.ఆమె తండ్రి బెంగుళూరులో న్యాయ శాస్త్రం చదవి మాగ్వే వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టి అక్కడే స్థిరపడ్డారని తన ఆత్మకథ మై లైఫ్ అండ్ మెడిసిన్  లో డాక్టర్ పద్మావతి రాశారు
అయితే, ప్రపంచయుద్ధం ముగిశాక మళ్లీ ఆమె తండ్రి  బర్మా నుంచి తిరిగొచ్చారు. కొయంబత్తూరులో స్థిరపడ్డారు.
1949లో  డాక్టర్ పద్మావతి రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్  ఫెలోగా  లండన్ వెళ్లారు తర్వాత అమెరికా బాల్టిమోర్ జాన్స్ హాప్ కిన్స్ యూనివర్వీటీ ఫెలో షిప్ పొందారు.
ఈ మధ్యలో కొద్ది రోజులు స్వీడెన్ లో కూడా చదివారు. జాన్స్ హాప్ కిన్స్ లో ఆమె ప్రఖ్యాత కార్డియాలజిస్టు డాక్టర్ హెలెన్ తుస్సిగ్ దగ్గిర శిక్షణ పొందారు. అక్కడు తొలి హృదయ శస్త్ర చికిత్సలను పుట్టకతో గుండెలోపాలున్ పిల్లల మీద చేశారు. ఇలాంటి పిల్లలను బ్లూబేబీస్ (Blue babies) అంటారు.
తర్వాత 1952లో ఆమె హార్వర్డ్ మెడికల్ స్కూల్  లో చేరారు. అక్కడి డాక్టర్ పాల్ డూడ్లే వైట్ దగ్గర చేరారు. డాక్టర్ మాడర్న కార్డియాలజీ పితామహుడు. ఆమెకు 1953 లో భారత దేశం తిరిగి వచ్చారు.
భారతదేశంలో నూతన అధ్యాయం
డాక్టర్ పద్మావతి భారతదేశానికి తిరిగిరావడంతో ఇక్కడి హృద్రోగ చికిత్సలో,  హృద్రోగ విద్యలో నూతనాధ్యాయం మొదలయింది.
మొదట ఆమె  న్యూఢిల్లీలోని లేడీహార్డింజ్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా చేశారు. అయితే, ఒక ఏడాదిలోనే ఆమె అక్కడ ప్రొఫెసర్ ఆప్ మెడిసిన్ గా ప్రమోట్ అయ్యారు.
తర్వత ఉత్తర భారదేశంలో నే మొట్టమొదటి  కార్డియాక్ క్యాథెరైజేషన్ ల్యాబ్ ని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ గ్రాంటుతో ఏర్పాటు చేశారు. ఇది నిజానికి మహిళల  కోసం ఏర్పాటు చేశారు.
అయితే,ఇక్కడి చికిత్సకు  మంచి పేరు రావడంతో పురుషులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడి రావడం మొదలయింది. ఇక్కడ ఉన్నపుడు ఆమె క్లినికల్ ఇన్వెస్టి గేషన్ కూడా మొదలుపెట్టి ప్రజలలో హృద్రోగ సమస్యలెలా ఉన్నాయి, వాటిని నివారించడమెట్లా అనేవిషయం మీద సుమారు 300 రీసెర్చ పేపర్లను కూడా తయారు చేశారు.
ఈ దశలో ఆమెకు భారత ప్రభుత్వంనుంచి గుర్తింపు వచ్చింది.  మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ (MAMC) డైరెక్టర్-ప్రిన్సిపాల్ పదవి చేపట్టాలని ప్రభుత్వం కోరింది. అక్కడే ఆమె తొలిసారి కార్డియాలజీలో  డిఎం (DM course in Cardiology) ప్రారంభించారు.
డాక్టర్ పద్మావతికి 1967లో పద్మశ్రీ, 1992లో పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి.
ఆమెకు హార్వర్డ్ మెడికల్ స్కూల్, బిసి రాయ్ అవార్డు,  కమలా మీనన్ రీసెర్చ్ అవార్డు లు కూడా లబించాయి.

ఆరోజుల్లో నేను కాలేజీకి వెళ్లే నాటికి హృద్రోగ నిపుణులే బాగా తక్కువ. అందునా మహిళా కార్డియాలజిస్టులెవరూ లేరు? అందువల్ల నా మనసు కార్డియాలజీ మీదకు వెళ్లింది,’ అని ఆమె చెప్పారు. ఆమె  My Life and Medicine పేరుతో ఆత్మకథ రాశారు.