ఆప్కో ఎన్నికలు, వస్త్ర నిల్వల కొనుగోలుపై మంత్రితో చర్చ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, సమాచార సాంకేతిక శాఖామాత్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డినికలసి చేనేత రంగానికి సంబంధించిన పలు విషయాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
చేనేత సహకార సంఘాలకు మాతృసంస్థ అయిన ఆప్కోకు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని వివరించారు.
పాలకవర్గాలు లేని సొసైటీలకు పీఐసీలను నియమించే యోచనలో ప్రభుత్వం వున్నట్టు తెలిసిందని, అదే జరిగితే ఆప్కో చైర్మనను కూడా నామినేట్‌ చేసేందుకు ఆస్కారం వుంటుందని తెలిపారు.
ఈ విషయాలన్నింటినీ పరిశీలించి ఆప్కోకు త్వరితగతిన పాలకవర్గం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, సహకార సంఘాల వద్ద వున్న వస్త్ర నిల్వలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి, త్వరితగతిన బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెడల్‌ లూమ్‌ మగ్గాలను ప్రవేశపెడితే బాగుంటుందని చిల్లపల్లి అభిప్రాయపడ్డారు.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్వవైభవం సంతరించుకుంటున్న చేనేతను కొత్త పుంతలు తొక్కించాలంటే పెడల్‌ లూమ్‌ మగ్గాలను పరిచయం చేస్తే బాగుంటుందన్నారు.
పెడల్‌ లూమ్‌ మగ్గాలను వినియోగిస్తే నేత పని సులభం కావడంతోపాటు వస్త్ర ఉత్పత్తి సామర్ధ్యం పెరిగి ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి స్పందిస్తూ ఈ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి వైయస్‌ జగనమోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, చేనేత పరిశ్రమ పురోభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.