ఈ ఫోటోలో కొంతమంది మహిళలు ఒక పోలీసు అధికారి ఫోటోకు క్షీరాభిషేకం చేయడం కనిపిస్తుంది.ఇలాంటిది అరుదుగా జరుగుతుంది. అందునా పోలీసు అధికారులకు ఇలాంటి గౌరవం దక్కడం మరీ అరుదు. ఈ అరుదైన గౌరవం ఒకప్పుడు కర్నూలు జిల్లాపోలీసు సూపరింటెండెంట్ గా పని చేసిన ఆకె రవి కృష్ణకు దక్కింది.
రవి కృష్ణ జిల్లా ఎస్ పిగా పనిచేస్తున్నపుడు ఒక వైపు పోలీసు అధికారిగా లాఠీ ఝళిపిస్తూ మరొక సోషల్ వర్కర్ గా కూడా పని చేశారు. ఇది ఆయన కత్తి రెండు వైపుల పదును. ఇదిఆయన పని తీరు. ఆయన చక్కటి రచయిత, మంచి గాయకుడు కూడా. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తానే పాటలు రాసి పాడే వాడు.ఇలాంటి పాటలతో ప్రజలకు బాగా దగ్గిరయ్యారు.
ఒకప్పుడు గ్రామకక్షలకు నిలయమయిన కపట్రాళ్ల గ్రామాన్ని ఎస్ పి గా ఉన్నపుడు ఆయన దత్తతు తీసుకున్నారు. అక్కడ సామరస్యం నెలకొల్పాలని, అక్కడి ప్రజలన జీవన ప్రమాణాలను పెంచాలని ఆయన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీని కోసం కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రాానికి బ్యాంక్ వచ్చేలా చేశారు.రోడ్లు వేయించారు. ప్రభుత్వ పథకాలను ఎలా వినియోగించుకోవాలో చూపించారు. రెగ్యులర్ వాటిని పర్యవేక్షించేందుకు ఒక ఇల్లు కూడా తీసుకుని అపుడపుడు వస్తూ పోతూ ప్రజలతో సంబంధాలను కొనసాగించారు.జిల్లాలో పొదుపు ఉద్యమానికి పునాది వేసిన ఒర్వకల్ మండల సమాఖ్య అధ్వర్యంలో ఇక్కడ పొదుపు కార్యక్రమం మొదలయింది. ఈ ఉద్యమాన్ని 20 యేళ్ల కిందట ప్రారంభించి దేశంలోనే ఒర్వకల్ మండలానికి గుర్తింపు తెచ్చిన సలహాదారు విజయభారతిని కూడా రవికృష్ణ కార్యక్రమంలోకి తీసుకువచ్చారు. కపట్రాళ్ల తో పాటు,పెద్ద పాడు, తంగరడోన బుక్కాపురం గ్రామాలలో గ్రామజ్యోతి కింది ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఆయన కర్నూలు జిల్లానుంచి వెళ్లిపోయినా కపట్రాళ్లతో అనుబంధం కొనసాగించారు. ఆయన చొరవతో గ్రామంలో మహిళలతో స్వయం సంఘాలు ఏర్పాటు చేశారు.పొదుపు ఉద్యమం మొలకలెత్తింది. పెరిగి పెద్దదయింది. వాళ్లని సంపాదనపరులను చేసే కార్యక్రమంగా ఎదిగింది.
ఇవన్నీ ఇపుడు బాగా పనిచేస్తున్నాయి. అక్కడి మహిళల సంపాదనా పరులయ్యారు. ఆ రోజుల్లో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తి తో చాలా మంది అధికారులు గ్రామాలను దత్తతు తీసుకున్న సంగతి తెలిసింది. ఇదే వరసలలో కపట్రాళ్లను రవికృష్ణ దత్తత తీసుకోవడంతో ఆయనకు కపట్రాళ్ల శ్రీమంతుడు అని పేరొచ్చింది.
ఈ రోజు కప్పట్రాళ్ల గ్రామంలోని కళ్యాణ మండపం లో కప్పట్రాళ్ల శ్రీమంతుడు శ్రీ ఆకె.రవికృష్ణ (ఇపుడుడీఐజీ ) జన్మదినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు కేక్ కట్ చేసి స్వీట్లు సంబరాలు నిర్వహించారు. రవికృష్ణ చిత్రపటానికి పొదుపు సంఘం మహిళలు పాలాభిషేకం చేయడం జరిగింది.
గ్రామజ్యోతి ఎస్ ఒ నారాయణ మాట్లాడుతూ, ‘రవికృష్ణ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. 950 మంది మహిళలు 91 సంఘాలతో ఈరోజు మహిళా సంఘాలు నడుస్తున్నాయి ఇప్పటివరకు మహిళా సంఘాలు 8 కోట్ల టర్నోవర్‌ను చేయగలిగాయి. ఈరోజు ప్రతి మహిళా లక్షాధికారి కావడమె లక్ష్యంగా ఉంచుకొని పని చేస్తున్నారు,’ అని పేర్కొన్నారు.
పొదుపు మహిళలు అంజనమ్మ, భవాని మాట్లాడుతూ ‘ఈ రోజు సార్ లేకుంటే మేము ఈ విధంగా ధైర్యం ముందుకు వచ్చే వాళ్ళం కాదు. ఈరోజు మేము సంతోషంగా కుటుంబాలతో ఉన్నాము అంటే దానికి కారణం ఆయనే. పగలు ప్రతీకారాలు వీడి మేము పొదుపు సంఘాల లో చేరి అభివృద్ధి చెందుతూ ఉన్నాము. మా గ్రామంలో స్కూల్ కట్టించారు,మహిళల కోసం శ్రీ శక్తి భవనాన్ని కట్టించారు,మరియు కళ్యాణ మండపం కట్టడం జరిగింది.మా కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది,రోడ్లు వేశారు నీటి వసతి కల్పించారు ఇలా ఎన్నో మేలులు మా గ్రామాని చేసినారు,’ అని కృతజ్ఞతులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కప్పట్రాళ్ల మల్లికార్జున, చింతమాను రవికుమార్, గొర్ల సుంకన్న గ్రామ ఐక్య సంఘం లీడర్లు కాజా మనీ,హనుమంతమ్మ మరియు గ్రామ జ్యోతి సిబ్బంది సుధాకర్,జ్యోతి , లక్ష్మి మొదలగువారు పాల్గొనడం జరిగింది.