రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లా కక్షలకు కార్పణ్యాలకు నిలయంగా గా ఉంటున్నా అదే సమయంలో సాహితీవనం కూడా వర్దిల్లింది. పెన్నానది పారుతున్న ఈ గడ్డ మీద ఎందరో కవులు రచయిత,నటులు,గాయకులు, కథకులు పుట్టారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. అలాంటి వారిలో ‘ప్రాసల పాదుషా’ ఎస్ కమాల్ సాహెబ్ (ఏప్రిల్ 2, 1946-ఆగస్టు 4, 2020) ఒకరు.
జమ్మలమడుగు పట్టణానికి చెందిన విద్యాన్ కమాల్ సాహెబ్ ఒక నిర్వచనంలో ఒదగడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. కాని, ఆయన గొప్ప ఉపన్యాసకుడు, వక్త, నటుడు, గాయకుడు, కవి, పాత్రికేయుడు. మొన్నటి మొన్నటి వరకు ఆయన ఉపన్యాసాలకు విపరీతమయిన పాపులారిటీ ఉండింది.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కవిరత్న షేక్ కమాల్ సాహెబ్ చెందుతాడు ఆగస్టు 4 వ తేదీన కన్నుమూశారు.
తెలుగు పండితునిగా తన 36 సంవత్సరాల సర్వీస్ లో వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచారు. తెలుగుపాఠం చెప్పడంలో ఆయనది ఒక ప్రత్యేక శైలి. అది గానశైలి. పద్యమైనా నా గద్య మైనా తన స్వరంతో విద్యార్థులను కట్టిపడేసే వారు. మధురమైన స్వరం ఆయన పాఠానికి వశీకరణ శక్తి ఇచ్చిది. కమాల్ సాహెబ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలాది సాహితీసభలో తెలుగు భాష పై తనదైన శైలిలో ప్రసంగించి తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు నేర్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసేవారు. ఆ యన వేదిక ఎక్కాడంటే జీవ నది ప్రవాహం వలే లయలు హొయలు ఉపమానాలు పద్యాలు పాటలతో సభికులను ఎంతో రంజింప చేసేవారు. తన తెలుగు మాటలు స్పష్టత నిర్దిష్టత పద్య పట్టణంలో భావానికి తగిన రాగాన్ని మేళవించి ఆలపించడం కమాల్ సాహెబ్ సొంతం.
కమాల్ సాహేబ్ జమ్మలమడుగు కవిత్వ వారసత్వ ఆస్తి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 ప్రోగ్రాములు, ఒరిస్సా కర్ణాటక లో కూడా పర్యటించి తన అనన్య సామాన్య ప్రతిభతో అక్కడి తెలుగు వారిని రంజింపజేశారు
పండిత పామరులును పరవశింపచేసే ప్రాస ఆయనది. ఆయన నాలుగ మీది నుంచి ప్రాస జలపాతంలాగ దూకూతుంది,సెలయేరులాగా పాకుతుంది. ఏడుపదుల వయసులో ఆయన తెలుగు భాష తియ్యదనాన్ని ‘తీయనైన భాష తెలుగు భాష’ అనే మకుటంతో 2016లో ‘కమాల్ శతకం’ రచించారు. అలతి పదాల ఆయన ఆట వేలాది అందరినీ ఆకట్టుకుంది. అలాగే 2018లో వచ్చిన కవితా ఖండిక ‘హృదయ నాదం’ సాహితీ అభిమానుల మనసులను దోచుకుంది.
విద్వాన్ కమాల్ సాహెబ్ సాహితీ జమ్మలమడుగు ప్రాంతంలో ఆదర్శంగా నిలిచి అందరితో కలసిపో యియువకులను వెన్ను తట్టి ప్రోత్సహించే వారు. ఆయన తెలుగు తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా కడపజిల్లా కు తీరనిలోటు.