కరోనా కంట్రోలయ్యే దాకా స్కూళ్లొద్దు: సిఎం జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల పున:ప్రారంభించడం సబబా అనే  చర్చజరుగుతూ ఉంది. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలుప్రారంబించాలని ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా పలు సందర్భాలలో ఈ విషయం ప్రకటించారు. దీనికి తోడు అంతర్జాతీయంగా అనేక దేశాలు పాఠశాలలను ప్రారంభించాయి. ముఖ్యంగా యూరోప్ లో పాఠశాలను ప్రారంభించారు. దీనివెనక నమ్మకం ఉంది. కోవిడ్-19 అనేది సాధారణంగా పిల్లల్లో కనిపించకపోవడం, కనిపించాని పిల్లల్లో మరణాలు రేటు తక్కువగా ఉండటం  దీనికితోడు చాలా పాఠ శాలల్లో టీచర్లు కూడా యువకులే  ఉండటం వల్ల  ఈ వయో బృందాలు కోరానుకుగురించి భయపడాల్సిన పని లేదనే వాదన బాగా ప్రచారం లోకి వచ్చింది. దీనితో పాఠశాలలు  ప్రారంభమయ్యాయి.
బ్రిటిష్ ప్రధాన మంత్రి బొరిస్ జాన్సన్  తల్లితండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తూ పిల్లలందరిని పాఠశాలలకు పింపించాలని, వాళ్లని ఇంటి దగ్గిర ఉంచుకోవడం కోవిడ్ కంటే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
“It’s vitally important that we get our children back into the classroom to learn and to be with their friends. Nothing will have a greater effect on the life chances of children than returning to school. … missing school will be far more damaging to kids that the coronavirus itself,” అని బొరిస్ జాన్సన్ అన్నారు. అంతేకాదు, స్కూళ్లలో పిల్లలకు కరోనా సోకే అవకాశం బాగా తక్కవ అని  కూడా ఆయన చెప్పారు.  ఇంగ్లండులో కరోనా కేసులు తగ్గిపోవడం, కరోనా టాప్ పదిదేశాల నుంచి ఇంగ్లండ్ మాయమవడంతో బ్రిటిష్ ప్రధానికి పాఠశాలలు తెరవ వచ్చనే ధైర్యం వచ్చింది.
అయితే, జర్మనీ అనుభవం మరొకలా ఉంది. జర్మనీలో వేసవి సెలవులను పూర్తి చేసుకున్న పాఠశాలను తెరిచారు. అక్కడ వేసవి సెలవులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక సారి ఉంటాయి. ఆగస్టు పది నుంచి అక్కడ పాఠశాలలు మొదలయ్యాయి. మొత్తానికి, ఒక వైపు స్కూల్లు తెరవాలా వద్ద అనే చర్చ దేశంలో జరుగుతుండగనే,  క్లాసులో కూడా మాస్కులు కొద్ది రోజులు ధరించాలనే నియమంతో అక్కడ పాఠశాలలు క్రమంగా మొదలవుతున్నాయి.
ఈ లోపు స్కూలు పిల్లలకు పెద్ద ఎత్తున కరోనా సోకింది.బెర్లిన్ నగరంలో 41 పాఠశాలలలోని వందలాది మంది పిల్లలకు, టీచర్లకు కరోనా సోకింది. ఎలిమెంటరీ స్కూళ్లు, ట్రేడ్ స్కూళ్లు, హైస్కూళ్లన్నింటిలోని విద్యార్థులకు కరోనా సోకింది. రెండు స్కూళ్లను మళ్లీ మూసేశారు. ఇది యూరోప్ లో మొదటి పాఠశాలలను తెరచిన జర్మనీ అనుభవం. జర్మనీ ప్రభుత్వం  మాత్రం పాఠశాలలను తెరవడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంది.
ఇలాంటి చర్చే ఇండియాలో కూడా నడుస్తూఉంది.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 5 నుంచి కోవిడ్ -19 నియమాలను పాటిస్తూ పాఠశాలలను తెరవాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈనిర్ణయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వ్యతిరేకించింది.కరోనా పూర్తిగా నివారించబడేవరకైనా లేదా వ్యాక్సిన్ వచ్చే వరకైనా పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేయడం మంచిదని ఆయన ముఖ్యమంత్రి కి సూచించారు.
ఈ మేరకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.
K Ramakrishna CPI Secretary Andhra Pradesh/Facebook
లేఖ లోని అంశాలు:
మన్జు రోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై పునరాలోచించాలి.
ఏపీలో 3,61,712 కరోనా పాజిటివ్ కేసులు, 3368 మరణాలు సంభవించాయి.
ప్రతిరోజు ఏపీలో 8 వేల నుండి 10 వేలకు పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు ప్రారంభించటం సరికాదు.
రాష్ట్రంలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
అనంతపురం జిల్లాలో టీచర్ చారుమతి, కృష్ణాజిల్లాలో ఇంటూరి ప్రతాప్ అనే టీచర్ మృతి చెందటం విచారకరం.
ఏపీ విద్యాశాఖ మంత్రికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది.
అమెరికాలో పాఠశాలలు తెరిచిన 15 రోజుల్లో లక్ష మంది పిల్లలకు కరోనా సోకడం గమనార్హం.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతిచ్చి కరోనా వ్యాప్తికి కారణమైంది.
కరోనా పూర్తిగా నివారించబడేవరకైనా లేదా వ్యాక్సిన్ వచ్చే వరకైనా పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేయడం మంచిది.