ఆంధ్రలో ఫోన్ ట్యాపింగ్ గొడవ ఏమవుతుంది?

ఆంధ్రలో ఫోన్ ట్యాపింగ్ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. మాజీ  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాస్తూ దీని మీద చర్య తీసుకోవాలన్నారు. చట్టబద్ధంగా కాకుండా ఇల్లీగల్ టెక్నాలజీ ఉపయోగించి టాప్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టాపింగ్ లో న్యాయమూర్తులు, జర్నరలిస్టులు, సామాజిక కార్యకర్తులు కూడా ఉన్నారని ఆయన ప్రధానికి రాసిన లేఖలో  పేర్కొన్నారు.
ఇదే నిజమయితే జగన్ ప్రభుత్వ కూలిపోతుందని, వైసిపి రెబెల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు జోష్యం చెప్పారు. ఎక్కడ ట్యాపింగ్ జరగిందో సమాచారం ఇస్తే విచారణ జరుపుతామని డిజిపి గౌతమ్ సవాంగ్ చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ! దీని మీద నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వం కూలుతుందటున్నారు. అసలు టాపింగ్ చేయడం చంద్రబాబు విధానమని, గతంలో ఇజ్రేల్ నుంచి టెక్నాాలజీ కొనే ప్రయత్నం చేశారని వైసిపి రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యారోపణ చేశారు.  గోడవేంటంటో సీనియర్ జర్నిస్టు ఎన్ బి సుధాకర్ రెడ్డి వివరిస్తున్నారు వినండి.