ఇకిగై : సంతోషమయ జీవితానికి జపనీస్ మంత్రం

(CS Saleem Basha)
“ఇకిగై” అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలి అంటే జీవిత పరమార్థం. సంతోషంగా ఉండటానికి నువ్వు చేసే పని. ఒక విధంగా చెప్పాలంటే ikigai అన్నది సంతోషంగా ఉండడానికి నువ్వు ఏం చేస్తావో అది. ప్రతి ఒక్కరికి ఇకిగై ఉండితీరాలి. జపనీస్ ఇకిగై దీర్ఘకాలం సంతోషంగా ఉండడానికి ఒక మార్గం.

ikigai

Pronunciation /ˈɪkɪɡʌɪ/ /ˈiːkɪɡʌɪ/

NOUN

Especially with reference to Japanese culture: a motivating force; something or someone that gives a person a sense of purpose or a reason for living. Also more generally: something that brings pleasure or fulfilment.

Origin

1970s; earliest use found in Japan Christian Quarterly. From Japanese ikigai, specific use of ikigai value of being alive from iki life, living (nominalized stem of ikiru to live) + -gai (formerly -gafi), combining stem of kai worth, benefit, value (formerly kafi; nominalized stem of kau to buy). (source Lexico.com)

జపాన్లోని ఓకినోవా ద్వీపం దీనికి పుట్టినిల్లు. ఆ ద్వీపంలో ఎక్కువమంది నూరు సంవత్సరాల పైబడిన వారు లేదా సెంచరీకి దగ్గరగా ఉన్న వారు. చాలామంది శాస్త్రవేత్త లు, సామాజిక పరిశోధకులు వారి జీవనశైలిని పరిశీలించారు. అక్కడ వారి ఇకిగై ఏమిటి అని దీర్ఘకాలం పరిశోధనలు చేశారు. వారికి కొన్ని విషయాలు తెలిశాయి. అక్కడి వారి ఈ లో ఐదు అంశాలు ప్రస్పుటంగా ఉన్నాయి. అవి ఉన్నదానితో తృప్తి పొందడం, తక్కువ తినడం,( పైగా అక్కడ దొరికే ఆహార పదార్థాలు కూడా మంచి పోషక విలువలు కలిగినవి. క్వినోవా రైస్ అక్కడివే. అంతేకాకుండా ఎక్కువ భాగం వండని ఆహార పదార్థాలు వారి రోజువారి భోజనంలో భాగం.) బంధాలకు విలువ ఇవ్వడం, రోజూ వైవిధ్యంగా జీవించడానికి ఇష్టపడడం, . నవ్వుతూ ఉండటం.ఈ పంచ సూత్రాలవల్ల అక్కడ ఎక్కువమంది శతాధికులు ఉన్నారు. ఆ పంచ సూత్రాల గురించి ఒకసారి మనం కూడా చూద్దాం.
మొదటిది ఉన్నదానితో తృప్తి పడటం అంటే దాని ఉద్దేశం పని చేయకుండా ఉండడం అని కాదు. సంపాదన తో సంబంధం లేకుండా, ఇష్టమైన పనిని చేస్తూ ఉండడం. అలా పని చేస్తూనే చచ్చిపోవడం వారికి ఇష్టం. ఉన్నదానితో తృప్తి పడడం అన్నది ఇది కొంచెం కష్టమైన విషయమే. తృప్తి అంటూ ఉంది, అసంతృప్తి లేదు అన్నది వాళ్లందరికీ బాగా తెలుసు.
రెండవది తక్కువ తినడం.” ఆహారాన్ని మందు లాగా తీసుకోవాలి. లేకుంటే మందులే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది” అని వారికి తెలుసు. Eat Right. అంటే Right food, Right quantity , Right Time అని అర్థం. అంటే సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన ఆహారం తీసుకోవడం. ఇదే వారి ఆరోగ్య రహస్యం. ఎక్కువ భాగం ఆకుకూరలు కాయగూరలు, పళ్ళు ఉంటాయి. వండిన ఆహారం ఇరవై శాతం మాత్రమే ఉంటుంది. మిగతా 80 శాతం పైన చెప్పిన వి ఉంటాయి. మళ్లీ ఈ సరైన ఆహారాన్ని సరైన మోతాదులో అంటే కడుపునిండా తినకుండా , 80 శాతం మాత్రమే కడుపు నింపడం. అది టైంకు తినడం. ఇవన్నీ కలిస్తే సరైన భోజనం అవుతుంది. దీర్ఘకాలం జీవించడానికి కాదు ఇలా తినాల్సింది, బతికున్నంతకాలం సంతోషంగా బతకడానికి. అనారోగ్యానికి, సంతోషానికి లింకు కుదరదు, అని వాళ్లకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఆరోగ్యమే మహాభాగ్యం- సంతోషానికి మూలం. అన్నది వారికి తెలుసు.
మూడోది వారికి చాలా ముఖ్యమైనది. ఇదే వారి మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమైన ది. బంధాలు గట్టిగా ఉన్నంతకాలం జీవితంలో సంతోషానికి కొదవ ఉండదు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యమే! అక్కడ అపార్థాలకు, కోపతాపాలకు తావుండదు. సంఘ జీవనం లో ఒకరి కష్టాలు మరొకరు పంచుకుంటూ, చేదోడు వాదోడుగా ఉండగలిగితే ఏ సమస్యలు ఉండవు, ఒకవేళ సమస్యలు వచ్చినా మనకు తోడుగా ఎందరో ఉంటారు.
నాలుగోది వైవిధ్యభరితమైన నా జీవితం. వారు రొటీన్ గా ఉండడానికి ఇష్టపడరు. రోజూ ఏదో ఒక కొత్త పని, ఇష్టమైన పని చేస్తూ ఉండటం. ఇతరులకు సహాయం చేయడం. సరదాగా విహారయాత్రలకు వెళ్లడం. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం. ఇవి వారి దినచర్యలో భాగం. ఒకటే పని ఎక్కువ కాలం చేయడానికి వాళ్లు ఇష్టపడరు, అది నచ్చిన పని అయినా సరే.
Laughter is the best Medicine వాళ్ళు దృఢంగా నమ్ముతారు. “నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా” అన్నది వాళ్ళ మోటో. నవ్వు, నడక,నమ్రత అన్న మూడు విషయాలు వాళ్లు తు.చ తప్పకుండా పాటిస్తారు. నవ్వు నాలుగు విధాలా చేటు కాదు, నలభై నాలుగు విధాల మేలు అన్న సూత్రాన్ని నమ్ముతారు.
పంచ సూత్రాలకు అనుబంధంగా వారు మరో పది పాటిస్తారు.
ఏప్పుడూ హుషారుగా ఉండటం (పనిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా).
అర్జెంటుగా ఎదైనా చెయ్యాల్సిన అవసరం లేదు. నిదానమే ప్రధానం.
కడుపు పగిలేలా తినొద్దు. కొంచెం ఖాళీ ఉండాలి
వ్యాయామంతో బాడీ ఫిట్ గా ఉంచుకోవటం
చుట్టు నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి
నవ్వుతూ పలకరించాలి
ప్రకృతితో మమేకం కావాలి
కృతజ్ఞత చూపటం మర్చి పోకూడదు.
ఈ క్షణంలో బతకటం
తమ “ఇకిగై” ను అనుసరించటం
ఇంకో ముఖ్యమైన విషయం. ఆ ద్వీపంలో కొంతమంది శతాధికులు కలిసి ఒక బ్యాండ్ గా ఏర్పడతారు. ఆ బ్యాండ్ లో చేరడానికి ముఖ్యమైన క్వాలిఫికేషన్ 100 లేదా ఆపైన వయసు. ఆ బ్యాండ్ లో ఉన్న వాళ్ళు బాధల్లో ఉన్నవాళ్ళని, హుషారుగా లేనివాళ్ళని దగ్గరికెళ్ళి ఆట పాటలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)