న్యూస్ వెబ్ సైట్ లకు ముప్పు …హ్యాక్ చేసి వ్యతిరేక వార్తలను ఎడిట్ చేస్తున్నారు

ఇదొక కొత్త రకం సైబర్ దాడి.  సైబర్ నేరగాళ్లు రకకాలు. దొంగలు, టెర్రరిస్టుల, దేశాల గూఢచారులు.  వెబ్ సైట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించి డబ్బు కాజేయడం సైబర్ దొొంగలు చేసే పని.  ఇలాగే వెబ్ సైట్ లలోకి హ్యాక్ చేసి చొరబడి తమ సంస్థ నినాదాలను పోస్టు చేయడం టెర్రరిస్టుల సంస్థలు చేసే పని. ఇక మూడో రకం సైబర్ నేరగాళ్లు తమకు నచ్చని దేశాల వైబ్ సైట్ లోకి చొరబడి  కీలకసమచారం కాజేస్తుంటారు.ఎపుడూ జరుగుతున్నవే.
 ఈ మధ్య రష్యా వాళ్లు తయారుచేసినవ్యాక్సిన్ స్పుత్నిక్ -5  తయారుచేసే విధానాన్ని అమెరికా, ఇంగ్లండు జర్మనీ వంటి దేశాల  ల్యాబరేటరీల కంప్యూటర్లలను హ్యాక్ చేసి దొంగిలించారని ఆ దేశాల నేతుల కొందరు విమర్శించారు.ఇలా సైబర్ నేరాలు  రకరకాలు.
ఇపుడు మరొక కొత్త నేరం బయటపడింది.
ఇంతవరకు వీళ్లెవరూ పెద్దగా న్యూస్ వెబ్ సైట్లలోకి చొరబడి నట్లు లేదు.అయితే, ఇపుడు దీనికి మార్గం ఏర్పడింది. ఇది ముందు ముందు పెద్ద ముప్పుగా పరిణమించవచ్చు.దాదాపు జర్నలిజానికి గతంలో ఎపుడూ ఎదురుకాని ముప్పు. ఇంతవరకు ప్రభుత్వాలు న్యూస్ పేపర్ల మీద, ఇపుడు వెబ్ సైట్లమీద నిఘా పెట్టి ఉండవచ్చు. లేదా బ్లాక్ చేసి ఉండవచ్చు.  అయితే, ఇపుడు కొత్త తరహా దాడి మొదలయింది. ఇది జరుగుతున్నట్లు విప్లవ రచయితల సంఘం వెల్లడించింది.అయితే, ఈ దాడులను ఎవరు ఎవరిమీద నైనా ప్రయోగించవచ్చు.
ఈ దాడి ఎంటంటే,  హ్యక్ చేసి న్యూస్ వైబ్ సైట్ లలోకి చొరబడి అక్కడివ్యాసాలను పూర్తిగా తొలగించడం, విశ్లేషణలను ఎడిట్ చేయడం, తమకు కష్టమయిన భాగాలను  తొలగించడం, ఇష్టమయిన వాటిని చేర్చడం ఇలా ఈ తరహా సైబర్ దాడిలో చేయవచ్చు.

ఈ తరహా దాడి తమ వెబ్ సైట్ మీద జరిగిందన  విప్లవ రచయిత సంఘం (విరసం) సంఘం వెల్లడించింది.
తమ అఫిషియల్  వెబ్ సైట్ virasam.org మీద కొన్ని రోజులుగా సైబర్ దాడి జరగుతూ ఉందని చెబుతూ  వెబ్ సైట్ ను హ్యాక్ చేసి వ్యాసాల తొలగింంపు, వ్యాసాలను సెన్సార్ చేయడం జరగుతూ ఉందని  ఈ సంస్థ పేర్కొంది.
ఇది ఇక ట్రెండ్ గా మారితే, ఇక న్యూస్ వైబ్ సైట్  లన్నింటికి భద్రత కరువతుంది.
ఎందుకంటే విమర్శనాత్మక వ్యాసారాలు రాసినపుడల్లా ఇలా వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ,  ప్రభుత్వాలకు, ప్రభుత్వ విధానాలకు , ప్రభత్వాధినేతలకు వచ్చే వ్యాసాలన్నింటిని ఎడిట్ చేయవచ్చు.
 ఇక నుంచి క్రిటికల్ న్యూస్ వెబ్ సైట్ లకు  కొత్త సమస్య ఎదురయినట్లే. విరసం వెబ్ సైట్ ను హ్యాక్ చేసి వ్యాసాలలోకి కీలక భాగాలను తొలిగించినట్లే, టెక్నాలజీ మీదపట్టున్న రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి వెబ్ సైట్ లలోకి దూరి తమకు ఇష్టంలేని  పేరాలను తొలగించవచ్చు. లేదా తమకు అనుకూలంగా ఉండేలా కొత్త వాక్యాలను చేర్చవచ్చు. విరసం వెబ్ సైట్ కు ఏం జరిగిందో చూద్దాం.
ఈ నెల 11 తారీఖున రాత్రి విరసం.ఆర్గ్ మొదటిసారి దాడికి గురి అయింది. ఆగస్టు 5న విరసం సభ్యుడు పాణి  “ఈ నిర్మాణం ఏ విధ్వంసానికి?” అని ఒకవ్యాసం రాశారు. జార్ఖండ్లో ఆ మధ్య సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివాసుల మీద దాడిచేసి, దానిని మావోయిస్టు పార్టీ జరిపినట్టుగా చేసిన ప్రచారం చేశాయి. దీని  మీద నిజనిర్దారణజరిగింది. దీనికి సంబంధించిన వ్యాసాలను తొలగించారు.
 తర్వాత ఈ మధ్య మరణించిన ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా కళాకారుడు వంగపండు ప్రసాద్ నివాళి వార్త మీద దాడి జరిగింది. నిజానికి నివాళి లో ఏముంటుంది. ఆయన గొప్పవాడు, ఆయన పాట గొప్పది అనే ఉంటుంది. ఆగంతకులు సైట్   మీద విరసం నివాళి ప్రకటనను తీసివేశారు.
వాటిని విరసం వెబ్ టీమ్ తిరిగి అప్లోడ్ చేసింది. అయితే, ఆగస్టు 12 సాయంత్రం పూర్తిస్థాయిలో హాక్ చేశారు. విరసం వెబ్ హోమ్ పేజీ మీద ‘మీ ప్రవర్తనతో మేము విసిగిపోయాము, మేము ఎన్ని సార్లు చెప్పిన మీరు మారటంలేదు, అందుకు అనుభవించండి,’ అంటూ ఒక మెస్సేజ్ పోస్టు చేశారు.  Hacked by PA4TR1K అని కూడా పెట్టారు.
 టెక్నీకల్ ఎక్సపర్ట్స్ సాయం తీసుకుని  వెబ్సైటు ను ఆగస్టు 13 ను రెస్టోర్ చేశారు. ఇంతటితో దాడులు ఆగలేదు.
 ఆగస్టు 14 తెల్లవారుజామునుంచి సైట్ మీద దాడి చేస్తూ వస్తున్నారు.  నిన్న రాత్రికి మళ్లి హాక్ చేశారు.ఈ సారి hacked by balck blush  అని పెట్టారు.
మొదటి సారి హాక్ చేసినప్పుడు విరసం వెబ్ మ్యాగజైన్లో ఈ నాలుగేళ్ల కాలంలో వేరు వేరు సంధర్భాలలో తీసుకువచ్చిన వ్యాసాలను ముఖ్యంగా మోదీ, బిజెపి పరిపాలన మీద వచ్చిన విమర్శ వ్యాసాలను, మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన వ్యాసాలను తొలగించారు.
భీమాకొరేగాం కుట్రకేసులో అక్రమంగా జైలులో నిర్బంధించబడ్డ వరవరరావు వీడియోల లింకులను తొలగించారు. వీటితో పాటు రోహిత్ వేముల, ఢిల్లీ జేఎన్ యు లలో  ఆజాదీ వీడియో లింకులను తొలగించారు.
ఈ మధ్య కాలంలో వార్త పత్రికలు రాజకీయ పార్టీలు విడిపోయాక, ఈ పార్టీలతో విబేధించే వారు  సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొందరు సొంతంగా వెబ్ సైట్ లను బ్లాగ్ లను నిర్వహిస్తున్నారు.
ఈ సైబర్ సెన్సార్ షిప్ తో క్రిటికల్ వార్తలెక్కడున్నా ఈ ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉంది.   భిన్నమైన భావజాలం,  ప్రత్యామ్నాయ రాజకీయాల మీద జరుగుతున్న దాడుల్లో ఇది కూడా భాగమే.