1947 ఆగస్టు 15 భారదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మనకు తెలుసు. ఆరున్నర దశాబ్దాలుగా ఈ రోజును అతి ముఖ్యమయిన జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నారు ప్రజలు.
ఆ రోజునే సాతంత్య్రం ఇవ్వాలని బ్రిటిష్ వాళ్లు ఎందుకు నిర్ణయించారు. ఆ రోజున ముహూర్తం పెటింది భారతీయులా లేక బ్రిటిష్ పాలకులా?
ఆగస్టు 15 వెనక ఏదయిన విశేషముందా?
స్వాతంత్య్రానికి ఆగస్టు 15 ముహూర్తం నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ వైష్రాయ్ లార్డ్ లూయస్ మౌంట్ బాటన్.
1929లో జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడి గా ఉన్నపుడు ప్రతి ఏడాది జనవరి 26న సంపూర్ణ సాతంత్య్ర దినం (Purna Swaraj) పాటించాలని పిలిపునిచ్చారు. 1930 తర్వాత ఇది మొదలయింది. స్వాతంత్య్రం వచ్చే దాక ఇదే పద్ధతి కొన సాగింది. ఆతర్వాత 1950, జనవరి 26న భారతదేశం సర్వసత్తాక దేశమయిన రోజున రిపబ్లిక్ డే పాటించాలని నిర్ణయించారు.
ఇలాంటపుడు మధ్యలో ఆగస్టు 15 అనే తేదీఎలా వచ్చింది? లార్డ్ లూయస్ మౌంట్ బాటెన్ ఇండియాకు వైస్రాయ్ గా పంపిందే స్వాతంత్య్రం ఇచ్చేందుకు.
1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని తేదీ ఖరారు చేసి బ్రిటిష్ పార్లమెంటు ఆయనను ఇండియాకు పంపారు.
అయితే, దేశంలో పరిస్థితులుచూశాక మౌంట్ బాటన్ అంత కాలం ఆగడం సాధ్యం కాదనుకున్నారు. అందువల్ల తేదీని ముందుకు జరుపుతున్న మౌంట్ బాటెన్ బ్రిటిష్ పార్లమెంటకు చెప్పారు.
దేశంలో రక్తపాతం జరగకుండా ఉండేందుకు తానీ పనిచేస్తున్నట్లు ఆయన బ్రిటిష్ పార్లమెంటును ఒప్పించారు.
దీనితో బ్రిటిష్ పార్లమెంటు 1947 జూలై నాలుగున బ్రిటిష్ కామన్స్ లో భారత స్వాతంత్య్రం బిల్ ను ప్రవేశ పెట్టింది. 15 రోజులలో బిల్లుకు ఆమోదం లభించింది.
ఒక భారతదేశానికి పరిపాలనాధికారం అప్పగించేందుకు ఒక తేదీ నిర్ణయించాలి. అపుడు ఆయన బాగా తెలిసిన తేదీ ఒకటుంది.
అది ఆగస్టు 15. ఎందుకంటే ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది.జపాన్ చక్రవర్తి లొంగిపోతున్నట్లు ప్రకటించింది ఆ రోజునే.
దీని వెనక లార్డ్ మౌంట్ బాటన్ పాత్ర వుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన ఎలైడ్ సైనిక దళానికి ఆగ్నేయాసియా సుప్రీం కమాండర్ గా ఉన్నారు. సింగపూర్ కేంద్రంగా ఆయన యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఆగస్టు 15 1945 న జపాన్ చక్రవర్తి హిరొహిటో రేడియో ప్రకటన చేస్తూ జపాన్ సైన్యాలు ఎలైడ్ సైన్యాలకు లొంగిపోతాయని, జపాన్ పాట్స్ డాం డిక్లరేషన్ (Potsdam Proclamation) కు కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.
దీని పర్యవసానంగానే సెప్టెంబర్ 4, 1945న సింగపూర్ లో మౌంట్ బాటెన్ ముందు జపాన్ జనరల్ ఇతగాకి, వైఎస్ అడ్మిరల్ ఫుకుడోమే లొంగిపోయారు.
ఈ కారణంగా ఆయనకు ఆగస్టు 15 తేదీ బాగా గుర్తుంది. అందువల్ల బ్రిటిష్ పార్లమెంటు భారత్ కు స్వాతంత్య్రం ఇవ్వాలనినిర్ణయించినపుడు ఆయన గుర్చొచిన తేదీన ఆగస్టు 15. అందుకే అధికార మార్పిడి ఆగస్టు 15న జరుగుతుందని ప్రకటించారు.
ఈ తేదీని ఎలా నిర్ణయించారని మౌంట్ బాటెన్ అడిగినపుడు ఆయన చెప్పిన సమాధానం ఇది…
“The date I chose came out of the blue. I chose it in reply to a question. I was determined to show I was the master of the whole event. Whey they asked: had I set a date, I knew it had to be soon. I hadn’t worked it out exactly then- I thought it had to be about August or September and then I went to the 15th of August. Why? Because it was the second anniversary of Japan’s surrender.”
మౌంట్ బాటెన్ పూర్తి పేరు Admiral Lord Louis Francis Albert Victor Nicholas Mountbatten (Supreme Allied Commander, Southeast Asia)
Like this story? Share it with a friend!