నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నపుడు వాళ్ల ముఖాలకి మాస్కులుంటాయి. దొంగలను పట్టుకున్నమాని చెబుతూ ముసుగులో మీడియా ముందు ప్రవేశపెట్టడం ఏమటి అని మీరేపుడయిన ప్రశ్నించుకున్నారా?
నిందితులకు ఎందుకు ముసుగు కప్పుతారో మనలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ విషయం పెద్దగా పట్టించుకోము కూడా.
అసలు నిందితులకు ముసుగు ఎందుకు కప్పుతారంటే… పోలీసులు పట్టుకున్న వారందరు నేరగాళ్లు కారు. నేరం రుజువు కానంత వరకు వారిని నిందితులుగా భావించాలి కానీ నేరస్తులుగా చూడకూడదు. అంతేకాదు, వారి నేరాలకు సాక్ష్యలు వచ్చి వాళ్లని మొదట గుర్తించాలి. సాక్ష్యులు వారిని గుర్తించముందే వారి ముఖాలు ప్రపంచానికి పరియమయితే, సాక్ష్యులనుమానిప్యులేట్ చేయవచ్చు. వీటిని నివారించాలి. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు నేరస్తులో, నిరపరాధులో కోర్టులో వాద ప్రతివాదాలు జరిగాక న్యాయమూర్తులు నిర్ధారిస్తారు.
అప్పటివరకు పోలీసుల కస్టడీలో ఉన్నవారిని దోషులుగా సమాజం ముందు చూపటం న్యాయ సమ్మతం కాదు. అందుకే వారి ముఖాలు అందరికి తెలియకుండా ఉండటానికి ముసుగు కప్పుతారు. వందమంది నేరగాళ్లు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు కదా..!
అయితే, నిజానికి దీనికి సంబంధించి చట్టంలో ప్రత్యేక రూలేమీ లేదు.కేవలం అవగాహన మాత్రమే. అందుకే చాలా పోలీస్ స్టేషన్లలో ప్రత్యుక మాయిన మాస్కులేవీ ఉండవు.కొన్ని స్టేషన్లలో మంకీక్యాప్ లను మాస్కులుగా వాడుతుంటారు.