పాలకూర తింటే కరోనాతో పాటు ఈ క్యాన్సర్లకు చెక్ పెట్టొచ్చు

కూరగాయల షాపులో ఎల్లపుడూ ప్రత్యక్షమయి పచ్చని బంగారంలాగా తళుక్కున మెరిసి మనల్ని ఆకట్టుకునేంది పాలకూరయే. ఫ్రెష్ గా ఉన్నపుడు పాలకూర ఆకర్షణను తప్పించుకోవడం చాలా కష్టం. చాలా పచ్చని కూర కూరగాలు ఉడికేస్తేపచ్చదనం కోల్పోతాయి. పాలకూర ఆకుపచ్చని చాలా వరకుకాపాడుకుటుంది. అందుకే పాలకూర ను దూరంగా ఉంచడం చాలా కష్టం. పాలకూర పప్పుతో మొదలుపెడితే, ఎన్నిరకల వంటలను పాలకూరతో చేయవచ్చో చెప్పలేం. తెలుగువాళ్ల ఆకుకూరలాగా కనిపించే పాలకూర నిజానికి భారతీయ సంతతి కూర కాదు. అది పర్షియానుంచి యూరోప్ కి, చైనాకి  ఆపైన భారతదేశానికొచ్చిన విషయం చాలా మందికి తెలియదు.
పాలకూర 15 వ శతాబ్దంలో పర్షియానుంచి యూరోప్ వారికి పరిచయమయింది. ఎనిమిదో శతాబ్దంలో మూర్స్ ద్వారా స్పెయిన్ వెళ్లింది. అక్కడి నుంచి యూరోప్ అంతా వ్యాపించింది. కొన్నిదేశాలలో దీనిని స్పానిష్ వెజిటబుల్ అని పిలిచేందుకు కారణం ఇదే. అమెరికాలో పాలకూర పండించడం 1806 లో  మొదలయింది.
వృక్ష శాస్త్రంలో ఇది చీనోపొడియేసీ (Chenopodiaceae)కుటుంబానికి చెందిన మొక్క.పాలకూర మూడురకాల మొక్కలుగా లభిస్తుంది.
రెండు రోజులకు ఒకసారి అయినా మనం తీసుకునే ఆహారంలో ఆకు కూరను చేర్చుకోటం వలన ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఆకు కూరలలో పాలకూర చాలా పోషక విలువలు కలిగి ఉంది.

గుర్తుంచుకోవలసి విషయం: పాలకూరలోని పోషకాలన్నీ అందాలంటే బాగా ఉడికించకూడదు. ఇది చాలా సున్నితమయిన ఆకు కూర కాబట్టి కొద్ది ఉడికిస్తే చాలు.

మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ ఎ అత్యవసరం.  మనం తీసుకునే ఆహారంలోని బీటా కెరొటీన్లు  విటమిన్ ఎ గా మారిపోతాయి. విటమిన్ ఎ ఏంచేస్తుందో తెలుసా.  మనశరీంలోకి ప్రవేశించే కరోనావైరస్  రోగకారకాలను సమర్థవంతంగా నిర్వీర్యం చేసేలా యాంటిబాాడీస్ కు సాయం చేస్తుంది. అందువల్ల కరోనా ఇమ్యూనిటీ రావాలంటే  మనం ఆహారంలో బీటా కెరొటిన్ లు సమృద్ధి గాఉండాలి. దీనికి పాలకూర మించిన చవగ్గా దొరికే వెజిటబుల్ ఏముంది? ఈ మాటఅంటున్నది మెలిస్సా  మజుందార్. ఆమె ఆకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డెయిటీటిక్స్  అధికార ప్రతినిధి.
పాలకూర ఖజానాలో దొరికే వజ్రవైఢూర్యాలివే…
1. ఇందులో విటమిన్ ఏ, సి, కే, పీచు పదార్ధం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియమ్, సోడియం, క్లోరిన్, బీటా కెరోటిన్, పాస్ఫరస్, ఐరన్, బి విటమిన్లు, ప్రోటీన్లు, యాంటి ఆక్సిండెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
2. ఇన్ని పోషక విలువలు ఉన్న పాలకూరను ఈ కరోనా సమయంలో తరచూ తింటుంటే రోగనిరోధక శక్తి (immunity) పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
3. శరీర పెరుగుదలకు, శరీర దృఢత్వానికి పాలకూర ఉపయోగపడుతుంది. కంటిచూపు మెరుగవుతుంది.
4. జ్వరం, వాయు, శ్వాస సంబంధ రోగాలను దూరం చేస్తుంది. స్త్రీల సౌందర్యాన్ని కూడా వృద్ధి చేస్తుంది.
5. శరీరానికి కావలిసినంత ఐరన్ పాలకూర ద్వారా లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
6. ఎక్కువగా పిల్లలు, బాలింతలు, గర్భవతులు అనీమియా వ్యాధి బారిన పడుతూ ఉంటారు. పాలకూర తినటం వలన ఆ లోపం ఉండదు.
7. వయసు మళ్ళిన తర్వాత వచ్చే మతిమరుపు పాలకూర తినటం వల్ల అధిగమించవచ్చు.
8. పాలకూరలో ఉండే కాల్షియమ్ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. పాలకూర గుండె జబ్బులను కూడా నయం చేస్తుంది.
9. పాలకూరలో 13 రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పని చేస్తాయి.
10. పాలకూరలో లభించే విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్ నివారకాలుగా ఉపయోగపడతాయి.
11. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అదుపు చేయటంలో ఎంతో బాగా తోడ్పడతాయి.
12. రోజూ ఆహారంలో పాలకూర ఎక్కువగా తీసుకునే మహిళలకు అండాశయ క్యాన్సర్ దరిచేరదు.

photo credits: wikimedia commons