తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను వెనక్కి తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
ఈ భూములను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జివొ కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలను చిత్తూరు జిల్లా యడమర్రి, బంగారుపాళెం మండలాల్లో 2010 లో కేటాయించారు. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు సంబంధించింది. ఎకరా రు. 1.87 లక్షలకు నాటి ప్రభుత్వం కేటాయించించింది.
ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ (ఎపి ఐఐసి)కి ఉత్తర్వులిచ్చింది. 20 వేల మంది స్థానికులు ఉద్యోగాలిస్తూ ఈ భూములను వినియోగించకపోతే, ఎఫిఐఐసి వెనక్కి తీసుకోవచ్చన్న క్లాజ్ ను బట్టి ప్రభుత్వం ఈ ఉత్తర్వులిచ్చింది. అయితే, ఈ కంపెన 229.66ఎకరాలను మాత్రమే వినియోగించుకుంది. 253.61 ఎకరాలను వినియోగించుకోలేదు. అందుకే ఈ పేరుతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలనుకుంంది.
దీనిని సవాల్ చేస్తూ అమరరాజా సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.