మొత్తానికి తిరుపతిలో కరోనా ఆంక్షలు మొదలు…రేపు పాక్షిక లాక్ డౌన్

తిరుపతిలో కరోనాకేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు అమలుచేయాలని గత కొద్ది రోజులు స్థానికుల  తీసుకున్న వత్తిడికి అధికారులు తలొగ్గారు. ఆదివారం నాడు పాక్షికంగా లాక్ డైన్ ప్రకటించారు. తిరుపతిలో లాక్ డౌన్ విధిస్తే తిరుమలకు భక్తుల రాక తగ్గుతుందని దానితో రెవిన్యూ పడిపోతుందని కావాలనే కరోనాను తక్కువ చూపి ఆంక్షలు విధించడంలేదని విమర్శమొదలయింది. అయితే,ఇపుడు టిిటిడిలో సిబ్బందికి, చివరకు అర్చకులను కూడా కరోనా వదలకపోవడం మళ్లీ కరోనా బిగింపు మొదలుపెడుతున్నారు. తిరుమల ను కూడామూసేసి, దర్శనాలను ఆపి కేవలం శ్రీవారికి ఏకాంత సేవలు మాత్రం జరిపిస్తారనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి మునిసిపల్ కార్యాలయం  పాక్షిక లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రకటన విడుదలచేసింది.
రేపు, 19-07-2020, ఆదివారం ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తారు. ఈ మేరకు ప్రకటన విడుదలచేశారు.
ప్రకటన ఇదే…
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో (కోవిడ్-19) కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ, నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు రేపు ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి.
ఈ చర్య ప్రజాఆరోగ్యమును దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు 10 గంటల పైనే తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయబడును.
వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 10 గంటల పైన తెరిచిన చోనగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయవలెనని
కమిషనర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.