గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: WHO కు 239 మంది శాస్త్రవేత్తల లేఖ

గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనేందుకు ఆధారాలు కనబడుతున్నాయి, మీ కరోనా వ్యాప్తి గైడ్ లైన్స్ సవరించండని అనేక దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు లేఖ రాశారు.
వెలుతురు,గాలి ప్రసరణ  సరిగ్గాలేని  బార్లలతో, రెస్టరెంట్లలో, స్కూళ్లలో, కార్యాలయాల్లో, కెసీనోలలో, మార్కెట్లలో గాలిద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తూ ఉందనేందుకు తమకు ఆధారాలు కనిపించాయని వారు చెబుతున్నారు.
ఇంతవరకు గాలిద్వారా వ్యాపిస్తుందనే అనుమానాలు వ్యక్తమయినా, దీనికిపుడుబలమయిన ఆధారాలను కొంత మంది శాస్త్రవేత్తలు చూసిస్తుండటంతో శాస్త్ర ప్రపంచంలో ఆందోళన మొదలయింది.
అది ఇల్లు కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, బార్ కావచ్చు,ఆఫీసు కావచ్చు, భవనాల లోపుల గాలిలో కరోనా వైరస్ ఎగిరి పడి కొద్ది దూరం తెేలుతూ ప్రయాణించి అక్కడ ఉన్నవారికి కోవిడ్ సోకించవచ్చని, ఇది తమకు కనిపించిందని  ప్రపంచ బ్యాంకు ఒక బహిరంగ లేఖలో  రాసినట్లు న్యూ యార్క్ టైమ్స్ రాసింది.
గాలి సరిగ్గా ప్రసంరించని ప్రదేశాలలో జనం గుమి కూడినపుడు గాలిద్వారా  కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న ఈ శాస్త్రవేత్తల చెప్పేది నిజమే అయితే, ఇళ్లలో కూడా మాస్కులు ధరించాల్సి వస్తుంది.
కరోనా వైరస్ అనేది  మనుషులు ఒకరినొకరు తాకినపుడు లేదా దగ్గిరదగ్గిర ఉన్నపుడు వ్యాపించేది మాత్రమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతూ వచ్చింది. సమీపంలోని మనిషి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా వెలువడే తుంపర్ల నుంచి వైరస్ పక్కవారికి వ్యాపిస్తుందని ఈ సంస్థ బలంగా నమ్మింద. ప్రపంచాన్ని కూడా నమ్మించింది. ఇపుడు ఈ శాస్త్రవేత్తలు  ఈ వ్యాక్యాన్ని సవరించి, గాలి ద్వారా కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని చేర్చాలని ప్రపంచఆరోగ్య సంస్థను కోరారు.
అయితే, ఈ శాస్త్రవేత్త లేఖ మీద ప్రపంచ బ్యాంకు ఇంకా స్పందించలేదు.
తుమ్మినా దగ్గిన తంపర్లు మొదట గాలిలోకే ప్రవేశిస్తాయి. శ్వాస వదిలినపుడు కూడా  తుంపర్లు గాలి దూసుకుపోతాయి. గాలిలోకి ప్రవేశించాక అవి  గదిలో కొంతసేపు, కొంతదూరం ప్రయాణిస్తాయి. ఇలా గాలిలో  ప్రయాణిస్తున్నపుడు ఉన్నపుడు అవి ఇతరుల్లోకి ప్రవేశిస్తాయని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
32 దేశాలకు చెందిన ఈ  239 శాస్త్రవేత్తలు ఇలా గదులలో గాలిలోకి  ఎగిసిపడిన తుంపర్ల ద్వారా కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో  ఆధారాలతో సహ వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి కి తీసుకువచ్చారు. ఈ లేఖను వచ్చే వారం ఒక సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురించేందుకు కూడా ఈ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్రు.
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ముఖ్యంగా ఎవైనా వైద్య పరీక్షలో లేదా ఆపరేషన్లో జరిగినపుడు మాత్రమే కొనిరకాల తుంపర్లు ఏరోసోల్ రూపంలో బయపడతాయని, సాధారణ పరిస్థితుల్లో కరోనా గాలిద్వారా వ్యాప్తి చెందదని నమ్ముతుంది.
అయితే,  సైన్సు వ్యవహారాలో  మొండిగా ఉంటూ కొత్త ప్రపతిపాదనలను విశ్వసించకపోవడం ప్రపంచ ఆరోగ్య సంస్థకు మంచిది కాదని కొంతమంది శాస్త్రవేత్తలు, కన్సల్టెంట్లు కూడా భావిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
అయితే, ఈ సంస్థ ఈపుడు శాస్త్రవేత్తలు చూపిస్తున్నఆధారాలతో సంతృప్తి చెందడంలేదు. గాలిద్వారా కరోనా వ్యాపిస్తుందనేందుకుచూపిస్తున్న ఆధారాలు బలంగా లేవని ఈ సంస్థ భావిస్తూ ఉంది.